మెయిన్ ఫీచర్

వాదోపవాదాలు ఘర్షణలకు దారితీస్తాయి (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదాహరణకు, స్నేహితులతో కూర్చుని ఒక సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు అది బాగుందని కొందరు, బాగాలేదని మరికొందరు వాదిస్తారు. చివరికి ఆ వాదోపవాదాలు హద్దులు దాటి అనేక ఘర్షణలకు, పోరాటాలకు దారితీస్తాయి. పోరాడుతున్నారంటే అర్థం మీరు ఒక హద్దును దాటి మరొక హద్దు చివరకు చేరుతున్నారన్నమాట. పోరాటంలో అలా చెయ్యక తప్పదు.
నిబద్ధీకరణలతో పోరాడమని నేను మీకు బోధించట్లేదు. వాటిని సరిగా అర్థం చేసుకోండి. వాటి పట్ల చాలా తెలివిగా ఉండండి. అవి మిమ్మల్ని ఎలా శాసిస్తున్నాయో, అవి మీ ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో, అవి మీ వ్యక్తిత్వాన్ని ఎలా తయారుచేశాయో, అవి మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ధ్యాన పూర్వకంగా గమనించండి. అలా చేస్తే ఏదో ఒక రోజు వాటి పట్ల మీకు సరియైన అవగాహన కలుగుతుంది. అప్పుడే వాటి నుంచి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. అలాంటి అవగాహనే అసలైన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛనే నేను ‘తిరుగుబాటు’ అంటాను.
అసలైన తిరుగుబాటు యోధుడు పూర్తి అవగాహనతో ఉంటాడు. అందుకే అతడు ఎప్పుడూ పోరాడకుండా తెలివిలో ఎదుగుతాడే కానీ, కోపోద్రేకాలకు లోనవడు. ఎందుకంటే, అవి గతానికి చెందినవి. కాబట్టి, మీరు కోపంలో ఉన్నంత వరకు మీ గతం మీ ఉనికి కేంద్రంలోకి చేరి మిమ్మల్ని శాసిస్తూనే ఉంటుంది. కోపంలో సహజంగానే మీరు ఒక హద్దు చివరినుంచి మరొక హద్దు చివరకు చేరుకుంటారు. అయినా అక్కడ కూడా మీరు గతాన్ని అంటిపెట్టుకునే ఉంటారు. అందువల్ల కోపంలో ఉన్నంతవరకు మీరు ఎప్పటికీ పరిణామం చెందలేరు. కాబట్టి, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి అవగాహనతో తిరుగుబాటుచేసే యోధునికి, ధ్యాస సాధకులకు అది మార్గం కాదని అర్థం చేసుకోండి.
మీరు చర్చి పక్కనుంచి వెళ్తున్నప్పుడు అందులోకి వెళ్ళి ప్రార్థన చెయ్యాలనే కోరిక మీలో కలుగుతుంది. అలాగే దేవాలయం పక్కనుంచి వెళ్తున్నప్పుడు మీకే తెలియకుండా మీరు ఆ దేవుడికి నమస్కరిస్తారు. ‘‘అలా ఎందుకు చేస్తున్నారు?’’ అనే విషయాన్ని కాస్త గమనించండి. ఎందుకంటే, అవి పవిత్రమైన గొప్ప దేవాలయాలని, వాటిలో దేవుడున్నాడని మీకు బోధించబడింది. అది నిజమని, అందుకే అలా చేస్తున్నామని మీరు కచ్చితంగా చెప్పగలరా?
నిబద్ధీకరణలతో పోరాడమని నేను మీకు చెప్పట్లేదు. వాస్తవాలను గమనించమంటున్నాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు నిశితంగా గమనిస్తే ‘‘మరమనిషిలా మీరు చెప్పింది చేస్తున్నారే కానీ, ‘‘అలా ఎందుకు చెయ్యాలి?’’ అని మీరు ఏమాత్రం ఆలోచించట్లేదని’’ మీకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మీ మెదడులో నిక్షిప్తం చేయబడిన కార్యక్రమ ప్రణాళిక దాదానికి సంబంధించిన ఆనవాలు కూడా మీలో ఏమాత్రం మిగల్చకుండా వెంటనే అదృశ్యమవుతుంది.
ప్రతిస్పందనలో స్పందనకు సంబంధించిన నకలు మిగిలి ఉంటుంది. కానీ, తిరుగుబాటులో ఎలాంటి నకలు ఉండదు. ఎందుకంటే, అదే అసలైన స్వేచ్ఛ. అయితే ‘‘ఎవరు ఎవరితో పోరాడాలి?’’ అని కూడా మీరు అడగవచ్చు. పోరాడవలసిన అవసరం ఉన్నప్పుడే ఆ ప్రశ్న ఉదయిస్తుంది. కానీ, అలాంటి అవసరమే లేదు. మీరు కేవలం ఒక సాక్షిగా ఉండండి. అప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అదే మీ నిబద్ధీకరణ. అదే మీ అసలు స్వరూపం. అదే మీ వాస్తవ చైతన్యం.
ఏదైతే సాక్షిగా ఉంటుందో అదే మీ ఉనికి ఇంద్రియాతీత మూలాధారం.
నాకు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది. కానీ, దాని గురించి ఆలోచించిన వెంటనే నాలో చాలా భయం కలుగుతోందని ఇటీవలే నాకు తెలిసింది. అయితే అది కేవలం ఒంటరితనం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే తప్ప వేరే ఏదీ కాదు. కాబట్టి, స్వేచ్ఛ గురించి ఎందుకు అంతగా భయపడుతున్నానో దయచేసి కాస్త వివరంగా చెప్పండి.
మీరు ఇతరులపై ఆధారపడి వారి సలహాలు, సూచనలను పాటించాలని మీకు బాగా చిన్నప్పటి నుంచే బోధించారు. అందుకే మీకు స్వేచ్ఛ అంటే భయం. అది సహజమే. మీకు వయసు పెరిగిందే కానీ, బుద్ధి పెరగలేదు.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్