మెయిన్ ఫీచర్

మిస్ డెఫ్ ఆసియా నిష్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరియాణాకు చెందిన ఇరవై మూడు సంవత్సరాల నిష్టా డుడేజా ఇప్పుడు ‘మిస్ డెఫ్ ఆసియా’. ఒకప్పుడు ఆమెను అందరూ ‘స్పీకర్ లేని టీవీలాంటిది’ అని గేలిచేసేవారు. ఎందుకంటే నిష్టాకు చెవుడు. అస్సలు వినిపించదు. కానీ ఆమె అలాంటి అవమానాలను అస్సలు పట్టించుకోలేదు. లక్ష్యం పైనే దృష్టి పెట్టింది. లక్ష్యాన్ని సాధించింది. 2018 మిస్ డెఫ్ ఆసియా టైటిల్ గెలుచుకున్న ఈమె టెన్నిస్ క్రీడాకారిణి కూడా. 2013 ఒలంపిక్స్‌లో, 2015 డెఫ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున ఆడారు. ముందునుంచీ స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం అలవాటున్న ఆమెకు హై హీల్స్ వేసుకుని ర్యాంప్‌పై నడవడం కష్టంగా అనిపించిందట. మొదట్లో నిష్టాకి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేదట. ఒకరోజు నిష్టా స్నేహితురాలికి తెలిసిన అమ్మాయి ‘మిస్ బ్లైండ్’ కిరీటం గెలుచుకుందన్న వార్తను తెలుసుకుందట. అప్పటినుంచి ఓ బ్లైండ్ అమ్మాయి మిస్ బ్లైండ్ కిరీటం దక్కించుకోగా లేనిది నేను మిస్ డెఫ్ కిరీటం ఎందుకు దక్కించుకోలేను అని ఆలోచించిందట.. అంతే అప్పటినుంచి మేకప్ ఎలా వేసుకోవాలో నేర్చుకుంది. నెమ్మదిగా హై హీల్స్ వేసుకుని ర్యాంప్‌పై నడవడం ప్రాక్టీస్ చేసింది. అలా అలా నేడు మిస్ డెఫ్ ఆసియా కిరీటాన్ని గెలుచుకుని తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.