మెయిన్ ఫీచర్

సమానత్వ సాధనే అసలు సవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోని మతానికి అతీతమైన లౌకికత క్రమేపీ కనుమరుగయ్యే సూచనలు స్పష్టమవుతున్నాయి. శతాబ్దాల నాటి మత సంబంధిత ఆచారాలు ప్రస్తుత 21వ శతాబ్దంలోని అత్యాధునిక సమాజానికి ఎలాంటివైనా ఆదరణీయంగా ప్రోత్సాహం లభింపజేసే విరుద్ధ సంఘటిత కార్యాచరణ ఆరంభమైంది. రాజ్యాంగపరంగా ప్రసాదింపబడే జీవించే స్వేచ్ఛ, సమాన న్యాయం కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులు వెలువరిస్తున్నా, ప్రగాఢ మత విశ్వాసం ఎదురుతిరిగి ప్రశ్నిస్తోంది. సెప్టెంబరు 28న శబరిమల అయ్యప్పను మహిళలు అందరూ సందర్శించే హక్కు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించే తీవ్ర నిరసనలు, ఆందోళనలకు దారితీసింది. 62 రోజుల మండలం- మకర విలక్కు యాత్రాదీక్షా సంరంభం ఈ సంవత్సరం రెండు వర్గాలమధ్య వివాదగ్రస్త అంశంగా శాంతిభద్రతల సమస్యగా పరిణమించింది.
స్వాతంత్య్రం సాధించిన తొలి దశాబ్దాలలో ప్రభుత్వాలకు మత సహనం ప్రధాన లక్షణంగా వుండేది. క్రమేపీ దేశం, సాంకేతికంగా శాస్ర్తియపరంగా అభివృద్ధి పొందినా, మతైక్యత తలఎత్తింది. అన్ని మతాలలో దైవత్వం సర్వత్రా వెల్లివిరుస్తోంది. తొలితరం రాజకీయ పార్టీల నేతలలో మతం పట్ల నిరసన భావాలు లేకపోయినా మతాన్ని కుటుంబ వ్యక్తిగతంగా తప్ప అంతా పట్టించుకొనేవాడు కాదు. క్రమేపీ వ్యక్తిగతమైన మత ఆరాధన సమాజపరమైంది. ఓట్లు దండుకొని, అధికారం సాధించాలనే రాజకీయ పార్టీలు మతాన్ని ఆశ్రయించటం ఆరంభమైంది. కుల, మత వ్యవస్థలను పెంచి పోషించే అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్ష కార్యాచరణ ఆరంభించాయి. బ్రిటీష్ ప్రభుత్వాన్ని పారద్రోలటానికి తొలితరం కొందరు జాతి నేతలు నాడే మతైక్యత ఆలంబనగా చేసుకొన్నారు. దేశ విభజన కారణంగా ఏర్పడిన పాకిస్తాన్ శత్రు దేశం కావటంతో క్రమేపీ మత సహనం మత విద్వేషంగా రూపుదిద్దుకొనే విపత్కరత తల ఎత్తింది. మహాత్ముడు ‘ఈశ్వర అల్లా తేరే నామ్’ ‘సబ్ కో సన్మతి దే భగవాన్’ సందేశం రాజకీయ నేతలే నిర్వీర్యం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి నవభారత నిర్మాతల నాటి రాజ్యాంగపరమైన వారి మహత్తర ఆశయాలకు నీరుకార్చే రాజకీయ ధోరణులు ప్రస్తుతం బలపడుతున్నయి. తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నడూ వ్యక్తిగతంగా కూడా ఆలయ సందర్శనలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈవేళ భారత జాతీయ కాంగ్రెస్, ఇతర పార్టీలు అన్నీ దేవాలయాలలో ఆరాధనలు ప్రారంభించారు. వామపక్ష పార్టీలు ఈ ప్రవాహానికి ఎదురు ఈదలేక ములిగిపోతున్నాయి.
మహిళా న్యాయం
మతం, దైవత్వం అసంఖ్యాక భక్తజనకోటిని వారి ఆధ్యాత్మిక ప్రాచీన ఔన్నత్యాన్ని ఆరాధించే సమాజం పటిష్టం కావటం సామాన్య జనావళి ఐహిక, ఆముష్మిక శాంతి సౌభాగ్య, సమున్నత సాధించటం సదా సమాదరణీయం. మతోన్మాదంతో ఉగ్రవాదం హింసా ద్వేషాలు పెచ్చుపెరిగి మానవతా విలువలకు మైనారిటీ, దళిత, బలహీన, నిరుపేద నిస్సహాయ మహిళల జీవన వేదనను రూపుమాపే కార్యాచరణ కావాలి. రాజ్యాంగం ప్రసాదించే సమానత, జీవన నైతికతా మహోన్నత విలువలను మతాలకు అతీతంగా వుంటేనే రాజకీయ నేతల ప్రభుత్వాలు, పార్టీలు పరిరక్షించగలవు. జన జీవన సంక్షేమానికి, శ్రేయస్సుకు కట్టుబడి దేశ అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగం ప్రసాదించిన దైవదత్తంగా వెలువరించే తీర్పులపై వ్యతిరేకత ప్రస్తుతం స్పష్టమవుతోంది. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చే తీర్పు తలాక్, ముంబై హాజీ అలీ దర్గా ప్రవేశం, శనిసింగనాపూర్, అయ్యప్ప ఆలయ ఆంక్షల తొలగింపు ఇటీవల సుప్రీం న్యాయ పోరాటాలలో కొందరు మహిళలు సాధించగలిగారు. రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్తులు సమానత్వ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు కొండంత అండగా నిలబడటం రాజకీయ పార్టీల నేతలు కొందరికి మింగుడుపడని అంశం అయింది. 21వ శతాబ్దంలో వున్న భారతీయ సమాజంలో నేటికీ ఏ పవిత్ర మత ప్రాచీనతా మూల అంశాలైనా కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా వున్నాయని, అవసరమైతే వాటిని రద్దుచేసి చట్టాలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం భారత ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థను ఆదేశిస్తోంది. రాజ్యాంగం, సదా శిరోధార్యంగా, రాజకీయం ఔదలదాల్చాలి. అపుడే జనస్వామ్యం సజీవంగా వుంటుంది.
మతం రాజకీయ ఆయుధం కాదు
భారతజాతి తొలి వైతాళికులుగా మహిళల జీవితాలలో వెలుగు నింపటానికి రాజారామమోహనరాయ్ వంటి సంస్కర్తలు ఎందరో నాడూ నేడూ ప్రభుత్వాలను కదిలిస్తూనే ఉన్నారు. ఏ మతమైనా సదాచారాలను చిత్తశుద్ధితో నిర్వర్తించటం, కాలక్రమేణా తలెత్తే దురాచారాలను మానవా విలువల దృష్ట్యా సంస్కరించుకోవటం రెండూ కాలగతిలో ఆగేవి కాదు. సతీ సహగమన దురాచారంలో భర్తతో భార్యను చితిమంటలలో ఆహుతిచేసే దురాచారం నిర్మూలించబడినట్టే ఎన్నో రాక్షస దురాచారాలు, అన్యాయ అసమానతలు అంతం కావలసిందే. మహిళల జీవన స్థితిగతులలో కౌమార, యువ, వివాహిత, మధ్య, వృద్ధాప్య దశలలో నాగరికతా, విద్యా వైజ్ఞానిక సమాజ నడవడికలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. సహజ శారీరక ధర్మమైన రుతుక్రమం అపవిత్రం, అపరిశుద్ధంగా వారు భావిస్తే నిర్ణయం వ్యక్తిగతంగా సంప్రదాయంతో సంబంధం లేకుండా జీవనశైలిని వారే రూపొందించుకొంటారు. అది మహిళల శారీరక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా రాజకీయ పార్టీలు గుర్తించాలి. ఉద్వేగపరంగా వుండే అంశాలను మఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు పరిష్కరించగలరు లేదా కాలమే పరిష్కరిస్తుంది.
ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా వుండగా అస్సాంలోని బార్‌పేటా వైష్ణవ సంప్రదాయ నిష్ఠాగరిష్ఠత కలిగిన మతంలోకి ప్రవేశం తిరస్కరించబడిన సంఘటన జరిగింది. కొందరు స్వామీజీలు, మఠాధిపతులు మహిళలను తమ పాదాలు ఇప్పటికీ స్పృశించనివ్వరు. నైష్టిక బ్రహ్మచారి అయ్యప్పస్వామిని సందర్శించాలనే తాపత్రయంతో సతమతమయ్యేవారు ఆలోచించుకోవచ్చు. శనిదేవుని నుంచి వెలువడే తీక్షణ తేజ ప్రకంపనల కిరణాలు మహిళలకు హాని చేస్తాయంటారు కొందరు స్వామీజీలు. భారతీయ సంప్రదాయ మహిళకు సహజ శారీరక ధర్మమైన రుతుక్రమ సంబంధిత పవిత్ర అపవిత్ర అంశాలపై పోరాటాలకంటే ఎన్నో సాధించవలసిన అంశాలున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక ప్రజాస్వామ్యంలోనే అందరికీ మనుగడ, సమానత, సౌభాగ్యం, సామాజిక శ్రేయస్సు కలుగుతుంది.
*

- జయసూర్య