మెయిన్ ఫీచర్

ఇతరులను అనుసరించడం విషతుల్యం(ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదేమైనా, మీరు పిల్లలను ఏదో ఒక రకంగా నిబద్ధీకరిస్తున్నారు.
చెట్లు, జంతువులు, పక్షులు- ఇలా అస్తిత్వంలో ఉన్నవన్నీ ఎలా ఎదగాలో ఎవరూ ఏదీ బోధించకుండానే చాలాచక్కగా ఎదుగుతున్నాయి. వాటికి ఎలాంటి ప్రణాళిక అవసరంలేదు. నిజానికి, ప్రతి ప్రణాళిక బానిసత్వాన్ని సృష్టించేదే.
అనేక వేల సంవత్సరాలుగా మనిషి రకరకాల పేర్లు ఉపయోగిస్తూ బానిసలను సృష్టిస్తూనే ఉన్నాడు. ప్రజలు ఒక పేరుతో విసిగిపోతే వెంటనే మరొక పేరు చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసిన ప్రణాళికలతో ఆ స్థానాన్ని భర్తీచేస్తుంది. అలా ఎన్ని మార్పులు జరిగినా వౌలిక పరిస్థితి అలాగే ఉంది కానీ, ఏమాత్రం మారలేదు. పాత తరం పెద్దలు, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ ఒక పద్ధతిగా ప్రవర్తించాలనే కోరుకుంటారు. అందుకే మీరు కూడా ‘‘పిల్లలు పూర్తి సామర్థ్యంతో ఎదిగేందుకు మనం ఎలా సహాయపడాలి?’’అని అడుగుతున్నారు.
అది తల్లిదండ్రులు చెయ్యవలసిన పనికాదని నా అభిప్రాయం. పిల్లలు స్వయంగా ఎదుగుతారు. వాళ్ళను అలాగే ఎదగనివ్వాలి. అందుకు మీరు ఆసరాగా ఉంటూ వారిని పోషిస్తే చాలు. మీ ఆదర్శాలను వారిపై రుద్దుతూ దిశానిర్దేశాలు చెయ్యకండి. ఏది తప్పో, ఏది ఒప్పో వారికి చెప్పకండి. వాటిని వారే స్వయంగా అనుభవించి తెలుసుకోనివ్వండి.
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నిబద్ధీకరించారని, వారి ఆదర్శాల పరిమితులలో జీవించడంవల్ల మీరు మీ జీవితాన్ని పూర్తిగా కోల్పోయారని, ఆ తప్పును మీరు చెయ్యదలచుకోలేదని మీ పిల్లలకు మీరే చెప్పండి. అలా మీ జీవితాన్ని వారితో పంచుకోవడమే మీరు చెయ్యగల పని.
అలాగే గతానికి ప్రాతినిధ్యం వహించే మమ్మల్ని, మా అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా, మీరు మీ తెలివితేటలపై ఆధారపడి మానుంచి పూర్తిస్వేచ్ఛగా జీవిస్తే చాలునని, ఒకవేళ మీరు తప్పుచేసినా అది మీరు మాకు బానిసగా ఉంటూ ఒప్పుచేసిన దానికన్నా మంచిదేనని, ఇతరులను అనుసరిస్తూ ఏ తప్పులు చెయ్యకుండా ఉండడంకన్నా, తప్పులుచేస్తూ వాటినుంచి ఏదోఒకటి స్వయంగా అనుభవించి తెలుసుకోవడమే మంచిదని, లేకపోతే మీరు కేవలం ఇతరులను అనుసరించడం తప్ప ఎప్పటికీ ఏదీ స్వయంగా తెలుసుకోలేరని, అలా ఇతరులను అనుసరించడం విషతుల్యమని మీ పిల్లలకుమీరే ధైర్యంగా చెప్పండి. అంతేకానీ, ‘‘అలా ఎలాచెప్పేది?’’ అని అడగకండి. అలా అడుగుతున్నారంటే అర్థం మీరు ఒక పద్ధతినో, ఒక విధానాన్నో అడుగుతున్నట్లే. ప్రేమ ఒక పద్ధతి, ఒక విధానం కాదు. కాబట్టి, మీరు మీపిల్లలను నిజంగా ప్రేమిస్తున్నట్లైతే వారికి అలా చెప్పడం సులభమే.
మీరు మీ పిల్లలను ప్రేమించండి, వారి స్వేచ్ఛను ఆనందించండి. వాళ్ళను తప్పులు చెయ్యనివ్వండి. కానీ, వారుచేసిన తప్పును వారే తెలుసుకునేలా వారికి మీరు సహకరించండి. అలాగే ‘‘తప్పులు చెయ్యడం తప్పుకాదు. అలాచెయ్యడం ద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి, ఎన్ని తప్పులైనా చెయ్యండి. కానీ, చేసిన తప్పును మళ్ళీ, మళ్ళీ చెయ్యకండి. అలాచెయ్యడం చాలా తప్పు, మూర్ఖత్వం, ప్రమాదకరం’’ అని వారికి చెప్పండి.
కాబట్టి, మీ ప్రశ్నకు నేను సులభమైన సమాధానం చెప్పలేను. మీరు మీ పిల్లలతో అనుక్షణం కలిసి జీవిస్తూ, చిన్న చిన్న విషయాలలో వారికి పూర్తి స్వేచ్ఛ కల్పించి వారిని ఒక కంట కనిపెడుతూ మీ ప్రశ్నకు సమాధానం మీరే స్వయంగా తెలుసుకోవాలి.
‘సాయంత్రం తొందరగా నిద్రపోయి తెల్లారకముందే లేస్తే చాలా జ్ఞానం వస్తుంది’అని నా చిన్నితనంలోనే మా నాన్న నాకు బోధించాడు. నాకే కాదు, పిల్లలందరికీ వాళ్ళ నాన్నలు అలాగే బోధించడం అనేక శతాబ్దాలుగా జరిగింది. ముఖ్యంగా జైనులు రాత్రి భోజనాన్ని సాయంత్రం ఆరుగంటల లోపే ముగించి తర్వాత నిద్రపోతారు.
‘సాయంత్రం నిద్ర రాని సమయంలో బలవంతంగా పడుకోమంటున్నారు. తెల్లవారగట్ల మత్తుగా నిద్రపోతున్నప్పుడు బలవంతంగా లెమ్మంటున్నారు. అలాచేస్తే చాలా జ్ఞానం వస్తుందంటున్నారు. ఇది మరీ వింతగా ఉంది. అలా జ్ఞానం సంపాదించినవారు నాకు ఒక్కరూ కనిపించలేదు.
ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్