మెయిన్ ఫీచర్

బిరబిరా కృష్ణమ్మ కదలివస్తుంటేను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణకు పుష్కరశోభ వచ్చేసింది. శ్రావణ శుక్రవారం దానికి తోడైంది. పుష్కరుడు ఏతెంచే ముహూర్తానికి భక్తిప్రపత్తులతో శుభాహ్వానం పలికేందుకు అధికార యంత్రాంగం అలంపూర్ చేరుకుంది. వారికన్నా ముందుగానే కృష్ణవేణి అనుగ్రహించింది. పవిత్ర స్నానాలకోసం భక్తులు తీరం చెంతకు చేరుకునేలోగానే..వారి భక్తి పారవశ్యానికి తగ్గట్టుగా... ఉరకలెత్తుతూ బిరబిరా పరుగులిడుతూ వచ్చేసింది. కదంతొక్కే తురంగంలా లేచిపడుతున్న కృష్ణా తరంగాలు భక్తులకు కొత్తశక్తినిస్తున్నాయి. తెలంగాణలో తంగిడినుంచి సాగర్ వరకు రెండు జిల్లాల్లో దాదాపు 90 శాతం ఘాట్లవద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రతిఘాట్‌లో సగటున ఎనిమిది మెట్లుంటే ఇప్పటికే మూడు, నాలుగు మెట్లమీదవరకు కృష్ణమ్మ చొచ్చుకువచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ పుష్కరాలను ప్రారంభించే గుందిమళ్ల ఘాట్‌లో కృష్ణమ్మ సందడి సంభ్రమం కలిగిస్తోంది. నాగార్జునసాగర్ దిగువ ప్రాంతంలోను, మేళ్లచెర్వు, చందంపేట, మఠంపల్లి మండలాల్లోని ఎనిమిది ఘాట్‌లకు మాత్రం ఇంకా నీరు చేరలేదు. ఒకటి రెండు రోజుల్లో అక్కడకు నీరు చేరే అవకాశం ఉంది. ఘాట్లవరకు నీరు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో దాదాపు 81 ఘాట్లలో 3.5 కోట్లమంది భక్తులు పుష్కరస్నానమాచరించనున్నారు. సాధారణ పౌరులకు తోడు ఆధ్యాత్మిక తపోధనులు, ఘనులు, స్వామీజీలు కృష్ణాబాట పట్టారు. కృష్ణాతీరానికి దగ్గరగా ఉండేవారు తమ బంధుపరివారాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు... కృష్ణమ్మ పుష్కరశోభను తిలకించేందుకు..

చిత్రాలు.. నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు
మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వద్ద గుందిమళ్ల ఘాట్

-ఆంధ్రభూమి బృందం - మహబూబ్‌నగర్/నల్గొండ/నాగార్జునసాగర్