మెయిన్ ఫీచర్

నువ్వు చెప్పింది నిజమే కావచ్చు( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా వాదన విన్న మా తాతయ్య ‘‘నువ్వు చెప్పిందే నిజం. చిన్నప్పటినుంచి నేను సాయంత్రం తొందరగా నిద్రపోయి తెల్లారకముందే లేస్తున్నా. అయినా ఇంతవరకు నాకు జ్ఞానం రాలేదు. జ్ఞానం అలా రాదు. అది వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే, ఇప్పుడు నాకు డెబ్భై ఏళ్ళు. ఇది మరణం వచ్చే సమయం తప్ప జ్ఞానం వచ్చే సమయం కాదు. పాత సిద్ధాంతాలు పరమచెత్త. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా నీకు తోచిన విధంగా జీవించు’’ అన్నారు నాతో.
మా కుటుంబంలో అందరికన్నా నిజాయితీగా, ఎక్కడా ఏమాత్రం రాజీ పడకుండా, ఎవరికీ భయపడకుండా మాట్లాడే వ్యక్తి మా తాతయ్య ఒకడే. ఆయన నాతో మాట్లాడిన మాటలు విన్న మా నాన్న రాత్రంతా బాగా ఆలోచించి మరునాడు నాతో ‘‘ఇక నీ జోలికి రాను. బహుశా, నువ్వు చెప్పింది నిజమేకావచ్చు. నా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నీ మనసు, నీ శరీరం చెప్పినట్లు, నీకు తోచిన విధంగా నువ్వు జీవించు’’ అన్నారు నాతో.
ఇలా తల్లిదండ్రులందరూ పిల్లల అవసరాలను గమనించి, వారు తప్పుదారి పట్టకుండా ఒక కంట కనిపెడుతూనే, వారికి సహకరించాలి. ఎందుకంటే, పిల్లలు ప్రతికూలమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు. ఎంతైనా పిల్లలు పిల్లలే కదా! అందువల్ల వారు తప్పుచేసే అవకాశమే ఎక్కువ. అప్పుడు కూడా మీరు వారిని అడ్డుకోకుండా ‘‘పరిస్థితిని, దాని పరిణామాలను’’ వారికి వివరించి చెప్పి, ఏది చెయ్యాలో వారినే నిర్ణయంచుకోనివ్వండి.
పిల్లలు ప్రతి విషయాన్నీ చాలా తొందరగా గ్రహిస్తారు. వారిని మీరు గౌరవిస్తే, మీ మాటలు వినేందుకు, వాటిని అర్థం చేసుకునేందుకు వారు సిద్ధంగా ఉంటారు. అలావారి అవగాహనకు వారిని విడిచిపెట్టండి. ఇది ముందు కొంత ఇబ్బందిపెట్టినా, త్వరలోనే వారు సొంత తెలివితో ముందుకెళ్ళడం ప్రారంభిస్తారు. అప్పుడు వారికి మీ కాపలా అవసరముండదు.
తల్లిదండ్రుల భయాలను నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే, మీకు నచ్చని మార్గాన్ని మీ పిల్లలు ఎంచుకోవచ్చని మీ భయం. కానీ, అది మీ సమస్య. మీ పిల్లలు మీ ఇష్టాయిష్టాలు తీర్చేందుకు పుట్టలేదు. అది ఎలాంటి జీవితమైనా వారి జీవితాన్నివారే అనుభవించాలి. వారు అలా అనుభవిస్తుంటే చూసి మీరు ఆనందించాలి. వారు కేవలం చిన్న సంగీతకారులుగా అయినా తప్పులేదు.
నాకు బాగా పరిచయమున్న ఒక ధనికుడు తన కొడుకును వైద్య విద్య చదివించి గొప్ప వైద్యునిగా చెయ్యాలనుకున్నాడు. కానీ, అతనికి సంగీతమంటే చాలా ఇష్టం. అతడు అప్పటికే సంగీతంలో చాలా ప్రావీణ్యాన్ని, ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు. ఎక్కడ ఏ వేడుక జరిగినా అక్కడ అతని సితార కచేరి ఉండేది. సంగీత విశ్వవిద్యాలయంలో చేరి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని అతనికి ఉండేది. కానీ, అతని తండ్రికి అది ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు ఆయన ‘‘ఎన్ని చెప్పినా నా కొడుకు సంగీతం పిచ్చిలోపడి వైద్య విద్య చదవనంటున్నాడు. ఆ సంగీతం వల్ల ఏమొస్తుంది. మహాఅయితే, ఏదో ఒక సంగీత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఉద్యోగమొస్తుంది. అదేమి సంపాదన? మా ఇంట్లో పనిచేసే సేవకులకే అంత జీతం ఇస్తున్నాం. ముఖ్యంగా, భారతదేశంలో సంగీతానికి, వ్యభిచారానికి అత్యంత సన్నిహిత సంబంధం ఆదినుంచీ ఉంది. వాడు చెడ్డవాళ్ళతో చేరి చెడిపోతున్నాడు’’అని తన బాధను నాతో చెప్పుకున్నాడు.
భారతీయ వేశ్య ప్రపంచంలోని ఇతర వేశ్యలకన్నా విభిన్నమైనది. ‘‘వేశ్య’’ అనే పదం భారతీయ వేశ్యలకు పూర్తి న్యాయం చెయ్యలేదు. ఎందుకంటే, భారతీయ వేశ్యలందరూ వైవిధ్యభరితమైన సంగీతం, నాట్య కళాకోవిదులే. మీరు నిజంగా సంగీత, నాట్యశాస్త్రాల లోతుపాతుల వైవిధ్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ప్రముఖ వేశ్య దగ్గర చేరి నేర్చుకోవాల్సిందే.
అలాంటి వేశ్యల కుటుంబాలను ‘‘ఘరానాస్’’అంటారు. ‘‘ఘరానా’’ అంటే ‘‘కుటుంబం’’అని అర్థం. అది మామూలు కుటుంబం లాంటిది కాదు. ఆ కుటుంబంలోని బంధాలన్నీ గురు, శిష్య సంబంధాలే. తమదైన శైలితో కూడిన అలాంటి ప్రముఖ ‘‘ఘరానాస్’’ చాలా ఉన్నాయి.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.