Others

ఆధ్యాత్మికమే నిజమైన స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు

అనువాదం: భరత్
*
ఆ పసివాడి సామర్థ్యం ఎదగనంతవరకు వాడు విచారంగానే ఉంటాడు. తమ పిల్లలు విచారంగా ఉండడం ఏ తల్లిదండ్రులకు ఇష్టముండదు. పిల్లల సంతోషమే వారికి ముఖ్యం. అది వాస్తవమే అయినా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు సాధారణంగా తప్పుగానే ఆలోచిస్తారు. తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు అవాలని కోరుకుంటారు. అంతేకానీ, పిల్లల కోరిక వారు తెలుసుకోరు. పిల్లలు ఎలా అవాలని ఇక్కడికి వచ్చారో వారు అదే అవుతారు. ఆ విత్తనమే వారిలో ఉంటుంది. అందువల్ల అలా అవడంలోనే వారికి ఆనందముంటుంది. కాబట్టి, అవకాశమున్నంతవరకు పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని విధాలుగా వారికి సహకరించండి. మామూలుగా, పిల్లలు ఏది అడిగినా వారి మాటలు పూర్తిగా వినకుండా వెంటనే ‘వద్దు’ అంటారు తల్లిదండ్రులు. ‘వద్దు’ అనే పదం అధికారాన్ని తెలిపే పదం. ‘అవును’ అనే పదం అలాంటిది కాదు. కాబట్టి, తల్లిదండ్రులు లేదా అధికారంలో వున్న ఎవరైనా సాధారణ విషయానికి కూడా ‘అవును’ అని చెప్పాలనుకోరు. పిల్లలు బయట ఆడుకుంటామంటే వెంటనే ‘వద్దు’ అంటాం. అలాగే వానలో సరదాగా తడుస్తామంటే వెంటనే ‘జలుబు చేస్తుంది, వద్దు’ అంటాం. అది ఆలోచించవలసిన విషయమే అయినా జలుబు కేన్సర్‌కాదు. పైగా, అది ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. నిజానికి పిల్లలను మీరు మరీ ఎక్కువగా సంరక్షిస్తే వారు మరీ బలహీనులుగా తయారవుతారు. అలాగే వారిని మీరు ఎంత స్వేచ్ఛగా వదిలేస్తే వారు అంత రోగ నిరోధకులవుతారు.
తల్లిదండ్రులు తమ అధికారాన్ని ప్రదర్శించేందుకు నూటికి తొంభై తొమ్మిది సార్లు ‘వద్దు’ అంటారు తప్ప, అందుకు వేరే కారణం ఏదీ ఉండదు. కాబట్టి, వారు ‘అవును’ అని చెప్పడం నేర్చుకోవాలి. అందరూ అధికారాన్ని ప్రదర్శించగల దేశ ప్రధానులు. రాష్టప్రతులు కాలేరు. కానీ, ప్రతి ఒక్కరూ భార్యపై అధికారాన్ని ప్రదర్శించగల భర్తగా, ప్రతి భార్య పిల్లలపై అధికారాన్ని ప్రదర్శించగల తల్లిగా అవగలరు. అలాగే ప్రతి పసివాడి దగ్గర ఒక ‘టెడ్డీబేర్’ ఉంటుంది. దానిని వాడు తన ఇష్టమొచ్చినట్లు కొడతారు. అలా తన అధికారాన్ని, తల్లిదండ్రులపై తనకున్న కోపాన్ని దానిపై ప్రదర్శిస్తారు. ఇది అధికారవాదులతో నిండిన నిరంకుశ సమాజం. ఎప్పుడూ ‘అవును’ అని, చాలా అరుదుగా ‘కాదు’ అని విన్న సంపూర్ణ స్వేచ్ఛగల పిల్లలను సృష్టించినపుడే అధికారవాదులతో నిండిన నిరంకుశ సమాజం నశిస్తుంది. సంపూర్ణ మానవత్వంతో నిండిన సమాజం మనకు ఉండాలి. కాబట్టి, ఇది పిల్లలకు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు, వారే రేపటి సమాజమవుతారు. నేటి పసివాడే రేపటి మనిషికి తండ్రి అవుతాడు.
నిజమైన స్వేచ్ఛకు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. అది రాజకీయపరమైనది కాదు. ఆర్థికపరమైనది కాదు. ఆర్థికపరమైన స్వేచ్ఛలు ఏ క్షణంలోనైనా అంతరించేవే. ఎందుకంటే, అవి మీ చేతుల్లో లేనివి. మీ చేతుల్లో లేని వాటిని ‘‘నిజమైన స్వేచ్ఛ’’ అనలేము.
నిజమైన స్వేచ్ఛ ఎప్పుడూ ఆధ్యాత్మికమే. సంకెళ్ళతో బంధించలేని, బందిఖానాలో పెట్టలేని మీ అంతరంగంతోనే దానికి సంబంధం. అవును, వాటితో మీ శరీరం బాధపడుతుందే కానీ, మీ ఆత్మకు ఏమీకాదు. అది ఎప్పుడూ సహజమైన స్వేచ్ఛతోనే ఉంటుంది. దానిని మీరు అడగక్కర్లేదు. దానికోసం మీరు పోరాడక్కర్లేదు. ఎందుకంటే, అది ఎప్పుడూ మీకోసం అక్కడ సిద్ధంగానే ఉంది. మీరు మీ అంతర్గతంలోకి వెళ్తే అన్నిరకాల బంధనాలు, బందిఖానాలు, బానిసత్వాలు అదృశ్యమవుతాయి.సత్యం ఎప్పుడూ ఒక్కటే, అసత్యాలే అనేకం.
అలాగే స్వేచ్ఛ ఎప్పుడూ ఒక్కటే, బానిసత్వాలే అనేకం.స్వేచ్ఛ అంతర్గతంలో వాస్తవంగా ఉండేదేమిటి? అక్కడ గతం, భవిష్యత్తులు ఉండవు. అందువల్ల వాటికి సంబంధించిన ఆశలు, కోరికలు, ఊహలు, జ్ఞాపకాల ప్రభావాలు- అస్తిత్వానికి వ్యతిరేకమైన ఊగిసలాటలు- అక్కడ ఉండవు. కాబట్టి, అక్కడ మీరు వాటినుంచి పూర్తి స్వేచ్ఛగా ఉంటారు. అక్కడ మీ చేతుల్లో ఉండేది కేవలం వర్తమానం మాత్రమే. గతం, భవిష్యత్తుల బాధలు లేకుండా కేవలం వర్తమానంలో జీవించేవారికే అసలైన ‘‘స్వేచ్ఛ రుచి’’ తెలుస్తుంది. అలాంటి వారికి కోరికలు, జ్ఞాపకాల బంధనాలు ఉండవు.
*
ఇంకావుంది...
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.