మెయన్ ఫీచర్

కళకళలాడుతున్న కృష్ణా తీరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కృష్ణాతరంగ నిర్ణిద్రరావములోన
శిల్పమ్ము తొలి పూజసేయునాడు’’... అన్నారు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఇక్కడ శిల్పము అంటే అమరావతి అని వారు భావించారు. కృష్ణానది సహ్యాద్రి అనబడే పడమటి కొండలలో మహాబలేశ్వర్ అనే మహారాష్ట్ర ప్రాంతంలో జన్మిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను పునీతం చేస్తూ పులిగడ్డ దాటి హంసలదీవి వద్ద సాగర సంగమం చేస్తుంది. ఈ మొత్తం గమనదూరం 775 మైళ్లు. మధ్యలో అనేక నదీ నదాలను తనలో విలీనం చేసుకుంటూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతుంది. మహారాష్టల్రో సావిత్రి, గాయత్రి, కర్ణాటకలో మలప్రభ, ఘటప్రభ, కుముద్వతి, తెలంగాణలో దుందుభి, ముచికుంద, మునే్నరు, పాలేరు, ఆంధ్ర ప్రాంతంలో తుంగబద్ర, ఇట్లే మరికొన్ని ప్రధాన నదులు కృష్ణవేణిలో కలిసిపోతాయి. మనకు పౌరాణికంగా, చారిత్రకంగా కృష్ణానది పేరు కనబడుతూ ఉంది. ఉదయగిరి కొండలలో నేటికి రెండువేల సంవత్సరాల నాటి హాథిగుంఫ ప్రాకృత శాసనంలో ‘కణ్ణా బెణ్ణా’ అనే మాట ఉంది. దీనికి కృష్ణవేణి అని అర్థం. ఈ శాసనం ఖారవేలుని రాజ్య విస్తరణకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నది. ఈ నదిని కృష్ణ అని కాక ‘కృష్ణవేణి’, అనే పిలువవలసి ఉంటుందని పండితులు వాదిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణలకు సంబంధించినంతవరకు పది జీవనదులున్నప్పటికీ కృష్ణ-గోదావరి నదులకే అధిక ప్రాశస్త్యం లభించింది. 2016, ఆగస్టు 12వ తేదీ రాత్రి 9 గంటల 28 నిముషాలకు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. గురు డు (బృహస్పతి) కన్యారాశిలో ప్రవేశిం చిన సు ముహూర్తం ఇది. ఇది పనె్నండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గత సంవత్సరం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఇలా పనె్నండు రాశులకు సంవత్సరాలు వరుసగా పుష్కరాలు వస్తుంటాయి. ‘పోష’ అనే థాతువునుండి ఈ శబ్దం పుట్టింది కాబట్టి మానవులను పుష్కరుడు పో షించి పుష్టినిస్తాడని ప్రతీతి. ఉత్తర భారతంలో వీటిని కుంభమేళా అనే పేరుతో పిలుస్తుంటారు. హిమాలయాలలోని నాగ సాధువులు ఈ పుష్కరాల్లో శుభ స్నానాలు చేయడానికి వస్తారు. అంటే జాతి కుల మత వర్గ వర్ణ ప్రాంత భాషా భేదాలకు అతీతంగా భారత దేశమంతా ఒకటే అనే సందేశాన్ని సాంస్కృతికంగా అందచేస్తున్నాయి. మాన వుడు ముష్కరుడు కాడు అని పుష్కరాలు చెబుతున్నాయి.
నీరు మనకు ప్రాణాధారం ఇవి తాగునీరు, సాగునీరుగా ఉపయోగపడుతుంటాయి. ఇవి కాక మేధ్వం-యజ్ఞం అనే రెండు శక్తులు నీటిలో ఉన్నాయి. సముద్రంలో బడబాగ్ని ఉన్నట్టే, పుష్కర జలాల్లో అంతర్లీనంగా విద్యుత్ ప్రవహిస్తుంటుంది. ఇది సర్వరోగ నివారిణి. పగలు సూ ర్యుని వలన, రాత్రి చంద్రుని వలన తప్తం కాబ డి గైరికాది థాతువులనుండి ఓషధ వనాలనుండి ప్రవహించడం వలన ఈ నదీ జలాలు దివ్యశక్తిని కలిగి ఉంటాయి. పుష్కర సమయంలో సూ ర్యునికి, త్రిమూర్తులకు, బృహ్పతికి, కృష్ణవేణీ నదీ దేవతకు, అర్ఘ్య సమర్పణ చేయాలి. పుష్కర సమయంలో కృష్ణవేణీ స్నానం కాశిలోని గంగాస్నానంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయతే కృష్ణవేణీ పుష్కర సందర్భంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని అపరిచిత తీరాల్లో స్నానం చేయకూడదు. వరదనీటినుండి, అసాంఘిక శక్తులనుండి జాగ్రత్తలు తీసుకోవాలి. స్ర్తిలు ఆలంకృతలై, బంగారు ఆభరణాలు ధరించి స్నానవిధికి రాకూడదు. గట్టుమీద నగలు, విలువైన వస్తువులు పెట్టి నీళ్లలో దిగరాదు.
పుష్కర ముహూర్తంలోనే స్నానం చేస్తే అధిక పుణ్యం వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే..గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా కొందరు పౌరాణికులు పక్కదోవ పట్టించిన కారణంగా గుంపులుగుంపులుగా భక్తులు రాజమహేంద్రవరంలో ఉదయ స్నానాలు ఆచరించడానికి నదిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సారంశమేమంటే ఈ పనె్నండు రోజుల్లో ఎప్పుడు వీలువెంట స్నానాలు చేసినా పుష్కరఫలం లభిస్తుంది. అందుకని ఆగస్టు 12వ తేదీ రాత్రి కృష్ణానదిలోకి గుంపులు గుంపులుగా స్నానానికి పరుగులు తీయవలసిన అవసరం లేదు.
ప్రశ్న: శ్రావణమాసం కృష్ణా పుష్కర ముహూ ర్తం వచ్చింది. కాబట్టి వరలక్ష్మీ వ్రతం మానుకోవాలా?
సమాధానం: అక్కరలేదు. వ్రతం చేసుకొని ఆ తర్వాత ఏరోజులోనైనా వీలు వెంట స్నానం చే యవచ్చు. చాదస్తం కాస్త ఎక్కువ ఉంటే పుష్కరాలు అయిన తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంనాడు వ్రతం చేసుకోవచ్చు. కాక పోతే అది అ మావాస్యకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, 12వ తేదీ శుక్రవారం చేసుకోవడమే శ్రేయస్కరం.
ప్రశ్న : కృష్ణా నదీ పుష్కర సమయంలో తుం గభద్రానదిలో స్నానం చేస్తే పుష్కర ఫలం వస్తుందా?
సమాధానం: తెలంగాణలో అనంతగిరిలో ముచికుంద ఆవిర్భవిస్తున్నది. అది కృష్ణలో సం గమిస్తుంది. అనంతగిరి వద్ద స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. కాని పుష్క ర ఫలం రాదు. అంటే ఉపనదులు కృష్ణానదిలో సంగమించిన తర్వానే అవి కృష్ణవేణిగా పిలువబడతాయి. ఆ కారణంచేత ఉపనదీ స్నానఫలం కృష్ణా పుష్కర స్నానఫలం కాజాలదు. కృష్ణలో ఎప్పుడు స్నా నం చేసినా మంచిదే కాని పుష్కర స్నాన ఫలం కాజాలదు.
ప్రశ్న: పుష్కర విధుల్లో ముఖ్యమైనవి ఏవి?
సమాధానం: పుష్కర సందర్భంగా ప్రధానమైనది నదీస్నానం. ఒకసారి స్నానం చేసి ఘాట్ నుంచి బయటకు రావాలి. స్నానానంతరం తర్పణాలు వదలాలి. ఆ తర్వాత యథాశక్తి దానధర్మా లు చేయాలి. దానాలు శక్తి కొలది పాత్రతనెరిగి దానాలు చేయాలి. అపాత్రదానం ఫలాన్నివ్వదు. యజ్ఞోపవీతం, తాంబూలం, భూమి, నాగలి, ఎ ద్దులు, చందనం, బెల్లం, నెయ్యి, నువ్వులనూ నె, పాలు, పెరుగు, చక్కెర, ఆకుకూరలు, ధా న్యం, ఉప్పు, తేనె, ఔషధాలు, అన్నం, రత్నాలు, కర్పూరం..వంటి ద్రవ్యాలను ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత చేయవచ్చు.
ప్రశ్న: ఆలయ దర్శనం అవసరమేనా?
సమాధానం: కృష్ణా పరివాహక ప్రాంతం అంతా దేవాలయాలున్నాయి. పుష్కర విధుల తర్వాత ఆయా దేవాలయాల్లో దర్శన విధి నిర్వర్తించుకొని తర్వాత భోజనం చేయాలి. ఒకవేళ ఇవేవీ సాధ్యపడకపోతే ఇంటికి కృష్ణాజలం తెప్పించుకొని స్నానపేటికలో ఈ నీళ్లను కలిపి భావాత్మకంగా పుష్కర స్నాన ఫలాన్ని పొందవచ్చు. ఇది వృద్ధులకు అనారోగ్యవంతులకు, పసిపిల్లలకు వర్తిస్తుంది.
ప్రశ్న: పుష్కర సమయంలో నదీ స్నానం చేస్తే అంటు వ్యాధులు వస్తాయని హేతువాదులు ప్ర చారం చేస్తునారు. నిజమేనా?
సమాధానం: అంటువ్యాధులు ఇంట్లో కూర్చు న్న వారికి కూడా వస్తున్నాయి. నదిని పరిశుభ్రం గా ఉంచాలి. అంటే అందులో వ్యర్థాలను విసర్జించకూడదు. సబ్బుపెట్టి బట్టలు ఉతకరాదు. కొబ్బరికాయలు, జంతువుల కళేబరాలు నదీ జలాల్లో పడేయరాదు. పారిశ్రామిక వ్యర్థాలను నదులలో విసర్జింపరాదు. నదులు దేవతాత్మలు గా భావించే దేశం మనది కాబట్టి నదీమతల్లులను కలుషితం చేయరాదు. అంటు వ్యాధులు రాకుండా టీకాలు తీసుకోవడం మంచిది. నదీ స్నానం తర్వాత శుద్ధోదక స్నానం చేయవచ్చు. ముఖ్యంగా ఆహార వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహిస్తే అంతా శుభంగా ఉంటుంది.
శ్రాద్ధవిధి : దేవతలకు తర్పణాలు సమర్పించి తొలినాడు హిరణ్య శ్రార్థం, తొమ్మిదవ నాడు అన్నశ్రార్థం, పనె్నండవరోజు ఆమ శ్రార్ధం పెటా టలి. అన్ని రోజులూ పిండాలను విసర్జించవచ్చు. తండ్రిపక్షం వారికి, తల్లి పక్షం వారికి ఇతర బం ధువులకు పిండ ప్రదానం చేయవచ్చు.
ఆలయ సంస్కృతి
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కొన్ని పెద్దపెద్ద దేవాలయాలు కొన్ని సామాన్య దేవాలయ కేంద్రాలున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం అన్నింటికన్నా పెద్ద దేవాలయం. అత్యంత ప్రా చీన మైనది కూడా. ఇక్కడ తీర్థము, క్షేత్రము, గి రి, వనము అన్నీ ఉన్నాయి. వీటితోబాటు ఇక్కడ శక్తిపీఠం, జ్యోతిర్లింగమూ ఉన్నాయి. అందువల్ల శ్రీశైల సమీపంలోని కృష్ణవేణిస్నానం అన్నింటికన్నా శ్రేష్ఠమైనది.
సోమేశ్వరాలయం: ఇది మహారాష్టల్రో ఉన్నది. ఇక్కడ వృద్ధ సంగమేశ్వరాలయం కృష్ణలో (వర్షా కాలం కనుక) మునిగి వుంటుంది. కొల్హాపూర్‌కు సమీపంలో ఈ తీర్థం ఉన్నది.
కూడల సంగమేశ్వరం : ఈ పేరుతోనే కర్ణాటకలో కృష్ణాతీరంలో ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. ఇ క్కడ కృష్ణానదిలో మలప్రభ- ఘటప్రభ నదులు కలుస్తాయి. ఇక్కడ బసవన్నగారు లింగైక్యం చెందారు కాబట్టి వీర శైవులకు ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన పుణ్యస్థలి.
వాడపల్లి: ముచికుంద ఇక్కడ కృష్ణానదితో సంగమిస్తుంది. ఇక్కడ నరసింహాలయం, అగస్తీశ్వరాలయం ఉన్నాయి.
బీచుపల్లి: ఇది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది, ఇక్కడ ఆంజనేయ క్షేత్రం ఉన్నది. స్నానానికి వసతులు కల్పించారు.
అలంపురం: ఇది మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ఇక్కడ బాల బ్రహ్మేంద్రస్వామి, జోగులాంబ దేవతలున్నారు. ఇది శక్తిపీఠం కూడా. ఇక్కడికి 15 కిలోమీటర్ల ఎగువన కూడల సంగమేశ్వరం అనే క్షేత్రం ఉన్నది. ఇక్కడ కృష్ణ- తుం గభద్రల సంగమం జరుగుతుంది కాబట్టి స్నా నం చేయవచ్చు.
విజయపురి: ఇది ఇక్ష్వాకుల రాజధాని. ప్రస్తు తం నాగార్జునసాగర్ డ్యాం సమీపంలో ఉంది. ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేయవచ్చు. బోటుమీద వెళ్లి పురావస్తుశాలలను సందర్శించుకోవచ్చు.
అమరావతి : దీనికి ధాన్యకటకం లేక ధరణికోట అని ప్రాచీననామాలున్నాయి. ఇక్క డ బా ల చాముండేశ్వరీ క్రౌంచామరేంద్రస్వామి కొలువుదీరి ఉన్నారు. తొలి తెలుగు రాజులు శాతవాహనుల రాజధాని ఇది. క్రీ.శ. 1760 నుంచి 1816 వరకు జీవించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టారు.
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అన్ని రక్షణలతో కూడిన స్నానఘట్టాలున్నాయి. కాబట్టి పుష్కర స్నానం చేసి ఇంద్రకీలాద్రిపై వెలసిన మల్లేశ్వర కనకదుర్గ దర్శనం చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది ఎదురైతే ఇబ్ర హీంపట్నం వెళ్లి స్నాన కర్మలు నిర్వహించు కోవ చ్చు.
పెద్ద కళ్లేపల్లి: ఇది కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ స్నానఘట్టాలు సురక్షితంగా ఉన్నా యి.
హంసలదీవి: ఇక్కడ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. ఇవే కాకుండా వాకపల్లి, వేదాద్రి, వైకుంఠపురం వంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయ.

చిత్రం..మహాబలేశ్వర్ దేవాలయంలో కృష్ణమ్మ ఆవిర్భవించిన చోటు

- ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 04027425668