మెయిన్ ఫీచర్

చలికాలంలో చర్మసౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలపు వాతావరణ పరిస్థితుల వల్ల చర్మం సహజమైన నూనెను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిగా, కఠినంగా నిర్జీవంగా మారుతుంది. ఈ కోల్డ్‌మంత్‌లో చర్మం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే తప్ప చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యపడదు. చర్మ సంరక్షణ రొటీన్ విషయంలో, అందం విషయంలో కొన్ని సాధారణ మార్పులు, కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఈ చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవచ్చు.
* చలికాలంలో చాలామంది వేడివేడి నీళ్లతో స్నానం చేయాలనుకుంటున్నారు. ఇలా వేడినీటితో స్నానం చేయడం ద్వారా చర్మంలోని తేమ పోయి కఠినంగా, పొడిగా మారుతుంది. ఉత్తమ ఫలితాలను పొందడానికి గోరువెచ్చటి నీటి ఉపయోగించాలి.
* డిసెంబరు నెలలో ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి ఎక్సఫోలియేషన్ చేయమని చర్మనిపుణులు సలహా ఇస్తారు. ఈ పద్ధతిలో మృతకణాలు, మలినాలు, చర్మంపై ఏర్పడిన టాన్ పూర్తిగా తొలగిపోతుంది. వారం రోజుల పాటు ఎక్సఫోలియేషన్ చేయడం ద్వారా మృదువైన, చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
* శీతాకాలంలో కూడా ఫేస్‌ప్యాక్స్ వేసుకోవచ్చు. మార్కెట్లో కొనే కెమికల్ ఫేస్‌ప్యాక్స్ కాకుండా ఇంటి పదార్థాలతో తయారుచేసుకునే ఫేస్‌ప్యాకులను వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అవకాడో, అరటి, తేనె వంటి పదార్థాలను ఉపయోగించి ఫేస్‌ప్యాక్స్ వేసుకుంటే చర్మం అందంగా నిగనిగలాడుతుంది.
* చలికాలంలోనూ పుష్కలంగా నీరు తాగాలి. లోపలి నుండి హైడ్రేట్ చేయడానికి మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో చల్లటి గాలి వల్ల చర్మం ఉపరితలంపై పొడి పాచెస్ ఏర్పడతాయి. ఇలాంటి వాటికి మంచినీరే పరిష్కారం.
* చర్మానికి విటమిన్ ఇ ఆయిల్‌ను పూయడం వల్ల వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు ఉన్నప్పటికీ చర్మంలోని తేమను నిలిపి ఉంచుకోవచ్చు. ఈ సహజ నూనె చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ నూనె వారానికి మూడుసార్లు తప్పకుండా రాసుకోవాలి.
* రాత్రి పడుకునేముందు చర్మానికి తప్పకుండా మాయిశ్చరైజర్ పూయాలి. ఇది చర్మానికి రక్షణ కలిగిస్తుంది.