మెయిన్ ఫీచర్

ఆ ప్రదేశం నా కోసమే (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం: భరత్
*
నిజానికి, పాఠాలన్నీ పూర్తిచేసేందుకు ఆరునెలలు చాలు. అనవసరంగా రెండు సంవత్సరాలు వృథా అవుతున్నాయి’’ అన్నారు విద్యార్థులు.
అలా నెలలో మిగిలిన ఇరవై రోజులు ఉప కులపతికి తెలియకుండా దేశాటన చేసేవాడిని. ఎందుకంటే, అన్ని రోజులు సెలవుఇవ్వరు. కాబట్టి, నా పథకం నాకుంది.
ఒకప్పుడు విశ్వవిద్యాలయంలో చాలా అందమైన చెట్లు ఉండేవి. కానీ, ఆశ్చర్యంగా ఒక్క చెట్టు తప్ప మిగిలిన చెట్లన్నీ చనిపోయాయి. తొమ్మిదేళ్ళుగా ఆ చెట్టు నీడలోనే నేను ప్రతి రోజు నా కారును నిలిపేవాడిని. అందుకే ఇతరులెవరూ ఆ చెట్టుకింద తమ వాహనాలను నిలిపేవారు కాదు. అలా ఆ చెట్టుకింద ప్రదేశం నాకోసమే అన్నట్లుగా అయింది. నేను ఊరువెళ్ళినా మా డ్రైవరు ద్వారా నా కారు ఆ చెట్టు కింద కనీసం రెండు గంటలు ఉండేలా ఏర్పాటుచేసుకున్నాను. ప్రతి రోజు ఉపకులపతి తన కిటికీలోంచి నా కారును చూసి నేను వచ్చేనని భావించేవాడు. కానీ, ఎందుకో ఆయన మనసులో నేను తరగతికి సరిగా రావట్లేదనే అనుమానం ఉండేది. ఎందుకంటే, నేను అందరిలా ఆయనను రోజూ కలవట్లేదు. ఒక రోజు ఆయన తరగతుల పనితీరు పరిశీలనలో భాగంగా విశ్వవిద్యాలయం చుట్టూ తిరుగుతూ నా తరగతికి వచ్చారు. కానీ, నా తరగతిలో విద్యార్థులు లేరు. ఆయన అనుమానం నిజమైంది. ఆ రోజు నేను మద్రాసులో ఉన్నాను. వెంటనే ఆయన విద్యార్థులను పిలిచి ‘‘మీ మాస్టారు కారు ఎప్పటిలా అక్కడే ఉంది.
కానీ, ఆయనే ఇక్కడ లేరు. ఆయన విధులకు సరిగా రావట్లేదనే అనుమానం నాకు ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే, ఆయన ఒకరోజు కలకత్తాలో, మొన్న అమృతసర్‌లో, నిన్న మద్రాసులో ఇచ్చిన ఉపన్యాసాలను నేను రోజూ వార్తాపత్రికలలో చదువుతున్నా’’అన్నారు. నేను మద్రాసునుంచి రాగానే ఉపకులపతి నుంచి నాకు పిలుపొచ్చింది. వెంటనే ఆయనను కలిసాను. ఆయన నాతో ‘‘అంతా మీ ఇష్టమేనా? నాతో చెప్పకుండా మీరే సెలవులు తీసుకుంటారా?’’అన్నారు ఆవేశపడుతూ. వెంటనే నేను ఆయనతో ‘‘ఈరోజు నుంచి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఒక తెల్లకాగితమివ్వండి. రాజీనామా రాసి ఇస్తాను’’అన్నాను. ‘‘ఏమిటి మీరనేది?’’అన్నారు ఆయన కంగారుగా. ‘‘నా సమాధానమదే. నేను పాఠాలు సరిగా చెప్పట్లేదని ఎప్పుడైనా విద్యార్థులు నాపై మీకు ఫిర్యాదుచేశారా? పాఠాలన్నీ చెప్పడం నా బాధ్యత. ఎన్ని రోజుల్లో చెప్తాననేది మీకు అనవసరం’’అని చెప్పి వెళ్ళిపోయాను.
ఆరోజు సాయంత్రం ఆయన మా ఇంటికొచ్చి ‘‘రాజీనామా చెయ్యకండి’’ అన్నారు. ‘‘జరిగిందేదో జరిగింది. గతానికి వారధిలా ఉండే యోగ్యతాపత్రాలతో నాకు పని లేదు. అందుకే వాటిని కాల్చేశాను. ఇప్పుడు నేను చదువులేని మనిషిని. అందువల్ల నేను మీ పిలుపును స్వీకరించలేను’’ అన్నాను ఆయనతో.
‘‘మీ యోగ్యతాపత్రాల విషయం ఎవరికీ చెప్పను’’ అన్నారాయన.
‘‘కారణం అది కాదు. నిజంగా, నేనే రాజీనామా చెయ్యాలనుకున్నా’’ అన్నాను ఆయనతో. విద్యార్థులందరూ నా రాజీనామాను వెనక్కి తీసుకోమన్నారు. ‘‘అది అసంభవం. ఇప్పుడు మీకు పాఠాలుచెప్పే అర్హతలు నాకు లేవు’’అన్నాను వారితో. ‘‘అది సరే. రాజీనామా చేసినంత మాత్రాన యోగ్యతాపత్రాలను కాల్చడమెందుకు’’అన్నారు మా నాన్నగారు. ‘‘అవి యోగ్యతాపత్రాలు కావు. అవి గతానికి చెందిన భరించలేని గాయాలు. అందుకే వాటిని వదిలించుకున్నాను’’అన్నాను ఆయనతో.
రెండు సంవత్సరాల తరువాత ఉపకులపతి మళ్ళీ నాతో ‘‘వీలుచూసుకుని ఎప్పుడైనా ఒకసారి విశ్వవిద్యాలయానికి వచ్చి ఉపన్యసించండి’’ అన్నారు.
ఆయన మాట కాదనలేక వెళ్ళాను. ఆయన నన్ను తన గదిలోకి తీసుకెళ్ళి ‘‘నేను రోజూ ఈ కిటికీలోంచి ఆ చెట్టుకింద ఉండే మీ కారును చూసేవాడిని. ఆశ్చర్యమేంటంటే, అన్ని చెట్లు చనిపోయినా ఆ ఒక్క చెట్టే మీకోసం, మీ కారుకు నీడ ఇవ్వడంకోసం పచ్చగా ఉండేది. మీరు వెళ్ళిపోయారు. అది చచ్చిపోయింది’’ అన్నారు బాధపడుతూ.

ఇంకావుంది...
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.