మెయిన్ ఫీచర్

పరిమళాలు వాడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు. నాడీవ్యవస్థను ఉత్తేజ పరిచి ఎంతటి మానసిక ఒత్తిడినైనా దూరం చేయడం, ఎదుటివారి దృష్టిని ఆకర్షించడం, మనపట్ల మనకు ఒక సానుకూల భావన కలిగేందుకు పరిమళాలు దోహదపడుతాయి. అయితే వీటి వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని సమస్యలూ ఎదురు కావచ్చు. పరిమళాల్లోని రకాలు, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
పరిమళాల తయారీ, సువాసనలను బట్టి వీటిని ఆయా పేర్లతో పిలుస్తారు.
ఫ్లోరల్.. అంటే పూలతో చేసేవి. వీటిని మహిళలు ఎక్కువగా వాడతారు.
ఫ్రూటీ.. అంటే తాజా పండ్లతో తయారుచేసేవి. ఆ సువాసనలనిచ్చేవి.
ఓషనిక్.. రసాయనాలతో చేసే ఈ రకం వాడితే సముద్రం, దాని చుట్టుపక్కల వాతావరణం గుర్తొస్తాయి.
గ్రీన్.. ఇది వాడితే ప్రకృతిలో లీనమైన భావన కలిగి కొత్త శక్తి వచ్చినట్లవుతుంది. గాఢత ఎక్కువగా ఉండి అడవుల్లోని చెట్ల బెరడుల వాసనలను కలిగి ఉంటుంది ఈ రకం. ఇలా మరెన్నో పరిమళాలు ఉన్నాయి.
సీజన్‌ను బట్టి..
బద్ధకంగా ఉండే చలికాలంలో ఉత్సాహాన్నిచ్చే ఊడీ రకం నప్పుతుంది.
ప్రేమ భావనలు పొంగి పొరలే వసంత రుతువులో ఫ్లోరల్ సెంట్లు వాడాలి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పరిమళాల తీవ్రత ఎక్కువ గనుక తక్కువ గాఢత గల, చల్లదనాన్నిచ్చే సిట్రస్ పరిమళాలు బాగుంటాయి.
ఆకురాలే కాలంలో ఫ్రూటీ, ఊడీ పరిమళాలు ఉల్లాసాన్నిస్తాయి.
జాగ్రత్తలు
* పరిమళాలు కొనేటప్పుడు తప్పనిసరిగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏవైనా ఎలర్జీలు వస్తాయేమో ముందుగానే తెలుసుకోవచ్చు.
* నాణ్యమైన పరిమళాలు చేతికి రాసుకున్న పదిహేను నిముషాల తర్వాత మంచి వాసన వస్తుంది. లేకుంటే కల్తీ అని అర్థం.
* పరిమళాలు వాడే ప్రతిసారీ బాటిల్‌ను షేక్ చేయాలి. అప్పుడే సమాన గాఢతతో వస్తుంది.
* గతంలో పరిమళాల వినియోగంతో అలర్జీ, చర్మసమస్యలు, మైగ్రేన్ తలనొప్పి ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.
* పరిమళాలను నేరుగా చర్మంపైన వేసుకోకూడదు. ఒక్కోసారి చర్మంపై దద్దుర్లు, రాషెస్ వచ్చే ప్రమాదం ఉంది.
* పరిమళాలను నేరుగా మృదువైన ప్రదేశాల్లో ముఖ్యంగా గజ్జల్లో వంటి చోట వాడకూడదు. *