మెయిన్ ఫీచర్

సుహాయ్ సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది పాకిస్థాన్‌లోని కరాచీ..
చైనా రాయబార కార్యాలయం..
సమయం ఉదయం తొమ్మిది గంటలా ముప్ఫై నిముషాలు..
ఒక్కసారిగా అలజడి..
కొందరు దుండగులు తుపాకులు, గ్రనేడ్లు, మారణాయుధాలతో చైనా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వారు ఉగ్రవాదులు అని తెలుసుకోవడానికి అక్కడి సిబ్బందికి ఎక్కువ సమయం పట్టలేదు. క్షణాల్లోనే ఆ ముష్కరులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అలాంటి భయానక వాతావరణంలో మామూలు వ్యక్తులెవరైనా అయితే మూర్ఛపోతారు. లేదా భయంతో వణికిపోతారు. కానీ ఆ ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలిచిందో మహిళా పోలీసు. ఆ ఉగ్రవాదులు కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుని ముష్కరుల ఆటకట్టించింది. ఎంతోమంది సిబ్బంది, పౌరుల ప్రాణాలను కాపాడింది. ఆమే సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ సుహాయ్ అజీజ్ తల్పూర్. కరాచీలో జరిగిన ఉగ్రదాడికి అడ్డుకునేందుకు చేపట్టిన భద్రతా ఆపరేషన్‌కు సుహాయ్ నాయకత్వం వహించింది. ఉగ్రవాదుల చర్యతో అప్రమత్తమైన సుహాయ్ వెంటనే రంగంలోకి దిగింది. ముష్కరులను లోపలికి అడుగు పెట్టనివ్వకుండా నిలువరించేందుకు పోలీసులను అప్రమత్తం చేసింది. సుహాయ్ ఆదేశాలతో ఉగ్రవాదులు తలుపు దగ్గరకు రాగానే పోలీసులు కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అలా వారి కుట్రను భగ్నం చేసింది సుహాయ్. ఒకప్పుడు సుహాయ్ బంధువుల బహిష్కరణకు గురైంది.
ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఎంతో తెగువను ప్రదర్శించిన సుహాయ్ చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. సుహాయ్‌ది దిగువ మధ్యతరగతి కుటుంబం. సుహాయ్ తండ్రి అజీజ్ తల్పూర్. సింథ్ ప్రావిన్స్‌లోని టాండో మహ్మద్ ఖాన్ జిల్లా భాయ్ ఖాన్ తల్పూర్ గ్రామంలో పుట్టాడు. అజీజ్ తల్పూర్ ఓ రాజకీయ కార్యకర్త, రచయిత. అజీజ్ సుహాయ్‌ను చిన్నప్పటి నుండి చాలా స్వేచ్ఛగా పెంచాడు. కూతురును గొప్ప స్థాయిలో చూడాలని ఆ తండ్రికి ఆశ. ఆ ఆశతోనే సుహాయ్‌ను స్కూల్లో చేర్పించాడు అజీజ్. అయితే అది వారి కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. కారణం అజీజ్ సుహాయ్‌ను ప్రైవేటు స్కూల్లో చేర్పించడమే.. ఇది బంధువులకు ఇబ్బందిగా మారింది. సుహాయ్ తండ్రి అజీజ్‌ను ఎన్నో మాటలన్నారు. ఆడపిల్లకు చదువెందుకు అని హేళన చేశారు. వారి కుటుంబంతో బంధువులు సంబంధాలను తెంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రామంలో ఉండలేక సుహాయ్ కుటుంబం సమీపంలోని పట్టణానికి వెళ్లిపోయింది. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సుహాయ్ కూడా చదువులో ఎప్పుడూ ముందంజలోనే ఉండేది. హైదరాబాద్ జుబేదా మహిళా కళాశాల నుంచి బీకాం పూర్తిచేసింది. ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ కావాలని అనుకుంది కానీ సామాజిక సేవపై మక్కువతో 2013లో సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్ష రాసింది. తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి పోలీస్ రంగంలోకి అడుగుపెట్టింది. తండ్రి, కుటుంబసభ్యుల అండతోనే తాను నేడు ఈ స్థాయికి చేరానని ఆనందంగా చెబుతుంది సుహాయ్.