మెయిన్ ఫీచర్

మానసిక సౌందర్యం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం అయస్కాంతం వంటిది. అది మంచి మానవ సంబంధాలకు ప్రాతిపదిక. అందం అంటే కేవలం కంటికి కనిపించే శారీరక సౌందర్యం మాత్రమే కాదు.. మేలైన గుణాలు, విశిష్ట వ్యక్తిత్వ శోభతో పొందే మానసిక సౌందర్యం కూడా మనిషికి ముఖ్యమే.. కంటికి కనిపించే అందం కాలంతో కరిగిపోతుంది కానీ మానసిక సౌందర్యం మాత్రం వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటుంది.
మానసిక సౌందర్యం పొందాలంటే..
* దాపరికం లేకుండా మాట్లాడాలి.
* చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా వెల్లడించాలి.
* పెదవులపై చిరునవ్వును ఎప్పుడూ చెరగనీయకూడదు.
* అందరితో స్నేహంగా ఉండాలి.
* డిజైనింగ్ దుస్తులు వాడలేకపోయినా శుభ్రంగా ఉన్న దుస్తులు ధరిస్తే చాలు.
* మాట్లాడే వ్యక్తి కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.
* ఎదుటివారు చెప్పేదాన్ని పూర్తిగా విని, తర్వాత మనోభావాలను వ్యక్తీకరించాలి.
* ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరొకరిని పొగడకూడదు, నిందించకూడదు.
* మాటల్లో వ్యక్తం కాని విషయాలను సున్నితమైన బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పాలి.
* చిన్న, పెద్దా తేడా లేకుండా అందరిపట్లా గౌరవ మర్యాదలు ప్రదర్శించాలి.
* పని విషయంలో క్రమశిక్షణను పాటించాలి.
* అవసరమైనప్పుడు మృదు భాషణతో ఎదుటివారి స్పందనను అంచనా వేసి దాన్ని బట్టి మనసులోని భావాలను వెల్లడించాలి.
* అవతలివారు మనతో మాట్లాడటం ఓ ఆనందకరమైన విషయంగా పరిగణించేలా నడుచుకోవాలి.
* ఉన్నంతలో పోషకాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయాలి.
మానసిక సౌందర్యం పొందాలంటే ప్రతికూల ఆలోచనలను తరిమేయాలి.. అదెలాగంటే..
* మనసులోని ప్రతికూల ఆలోచనలను తరిమేయాలి. మన ఆలోచనలు, ఊహలు, నమ్మకాలు అన్నీ ప్రతికూలంగా ఉంటే అధిక ఒత్తిడి తప్పదు. దానివల్ల వైఫల్యం కూడా తప్పదు. కాబట్టి ఈ ప్రతికూల ఆలోచనలను అధిగమించాలి.
* ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. కొత్తవిషయాలు, పనులూ నేర్చుకునే క్రమంలో అప్పుడప్పుడూ పొరపాట్లు సహజం. అలాగని 3నేను ఈ పని చేయలేను. అందరూ నన్ను తప్పుపడతారు2 అనుకోకుండా.. చేసిన పొరపాటు మరోసారి జరగకుండా చూసుకోవాలి. శక్తిసామర్థ్యాలను పెంచుకోవాలి.
* పట్టుదల సడలనీయకూడదు. ఎంచుకున్న వృత్తి, వ్యాపారం ఏదైనా సరే కష్టపడి పనిచేయాలి. ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫలితం రాకపోవచ్చు. దాంతో ఒత్తిడి పెరగవచ్చు. అయినా నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా.. పొరపాటు ఎక్కడ జరిగిందో సరిదిద్దుకోవాలి. పట్టువదలకుండా ప్రయత్నం చేయాలి.
* సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకుని తదననుగుణంగా మార్పులు చేసుకోవాలి.
* ఎలాంటి పని చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదు. ఈ పని నేను ఎందుకు చేయలేను.. అనుకుంటూ ముందుకు సాగాలి.
* 3నేను వాళ్లలా ఉండాలి2 అని ఎప్పుడూ అనుకోకూడదు. దీనివల్ల సమస్యలే వస్తాయి. కుంగుబాటు కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉండదు. ఎవరి శక్తిసామర్థ్యాలు వారివి.. కాబట్టి మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఇది నిరంతర సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కష్టమైనది మాత్రం కాదు.
ఇలా మానసిక సౌందర్యాన్ని పెంపొందించుకుంటే.. ఒత్తిడి దరిచేరకుండా ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు.