మెయిన్ ఫీచర్

తండ్రినే అరెస్ట్ చేయమన్న చిన్నారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడుకు చెందినది హనీఫా జారా.. వయస్సు ఏడు సంవత్సరాలు.. రెండో తరగతి చదువుతోంది.. కానీ ఆ పాప తన తండ్రిని అరెస్ట్ చేయమని పోలీసులకు లేఖ రాసింది.. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని అంబూర్‌లో హనీఫా జారా తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే వారి ఇంట్లో మరుగుదొడ్డి లేదు. ఆ ప్రాంతంలో చాలామంది ఇళ్లలో ఈ సౌకర్యం లేదు. కొంతమంది ఇళ్లలో ఉన్నా వాటిని ఉపయోగించడం లేదు. హనీఫాకు ఆరుబయట మలవిసర్జనకు వెళ్లడం చాలా సిగ్గుగా ఉండేదట.. అందుకే చాలా చిన్నప్పుడు అంటే నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పునే తండ్రిని ఇంట్లోనే మరుగుదొడ్డి కట్టించమని అడిగిందట. అప్పుడు ఆమె తండ్రి క్లాసులో ఫస్టు వస్తే ఇంట్లోనే మరుగుదొడ్డి కట్టిస్తానని హనీఫాకు మాటిచ్చాడట.. అప్పటినుంచి హనీఫా క్లాసులో టాపర్‌గా వస్తూనే ఉంది. పైగా బహిరంగ మలవిసర్జన వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి స్కూల్లో తరచుగా చెప్పడంతో పాప ఇంట్లో కూడా టాయిలెట్ కట్టించమని తండ్రిని చాలాకాలం నుండి కోరుతోంది. ఇప్పుడు హనీఫా రెండో తరగతి చదువుతోంది. ఇప్పటికీ హనీఫా తండ్రి మరుగుదొడ్డి కట్టించలేదట. దాంతో తన తండ్రి మోసం చేస్తున్నాడనుకుని ఆ చిన్నారి పోలీస్ స్టేషన్‌కు ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఆ అమ్మాయి ఈ వివరాలన్నీ తెలుపుతూ.., 3నేను నర్సరీ నుంచి క్లాస్ టాపర్‌గా ఉన్నాను. ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నాను. కానీ ఇంకా మా నాన్న ఇంట్లో టాయిలెట్ కట్టించలేదు. ఇంకా కట్టిస్తాననే చెబుతున్నాడు. మా నాన్న నన్ను మోసం చేస్తున్నాడు.. దయచేసి మా నాన్నను అరెస్టు చేయండి. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే టాయిలెట్ ఎప్పుడు కట్టిస్తాడో చెబుతూ ఆయన సంతకంతో ఒక లేఖ ఇప్పించండి..2 అని కోరింది. ఈ కంప్లైంట్ తన తల్లితో కలిసి స్కూలుకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో అందించింది హనీఫా.. పైగా హనీఫా తనతో పాటు తనకు వచ్చిన ట్రోఫీలు, మెరిట్ సర్ట్ఫికెట్లు తీసుకుని వాటన్నింటినీ పోలీసు అధికారి టేబుల్ మీద పెట్టి.. వీటిని తీసుకుని నాకు టాయిలెట్ కట్టించగలరా? అని అడిగిందట.. ఆమె మాటలకు ఆ పోలీసు అధికారి ఖంగుతిన్నాడట..
వెంటనే పోలీసు అధికారి హనీఫా తండ్రి ఎహ్సానుల్లాను పిలిపించాడు. పోలీసు అధికారి పిలుపుతో తన కూతురికి, భార్యకు ఏమైనా అయ్యిందేమో అనుకుంటూ అతను పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడట. అక్కడికి వచ్చాక తన కూతురు తనపై ఫిర్యాదు ఇచ్చిందని తెలిసి అతను ఆశ్చర్యపోయాడట.. కాసేపు ఏం మాట్లాడాలో తెలీని ఆ తండ్రి కొద్దిసేపటికి కోలుకుని.. 3టాయిలెట్ కట్టడం ప్రారంభించాను. కానీ దాన్ని పూర్తిచేయడానికి డబ్బు సరిపోలేదని, అందుకే ఆపేశాను. అందుకే హనీఫాతో నాకు కాస్త సమయం ఇవ్వు అని అడిగాను. కానీ హనీఫా వినలేదు. నేను ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, తను నాతో మాట్లాడ్డమే మానేసింది. కొద్దిరోజులుగా హనీఫా నాతో మాట్లాడటం లేదు2 అని చెబుతున్నాడు హనీఫా తండ్రి ఎహ్సానుల్లా.. అలాగే తన కూతురు రాసిన ఉత్తరం చూసిన ఆ తండ్రి.. 3అధికారులకు లేఖలు ఎలా రాయాలో.. హనీఫా నన్ను చూసే నేర్చుకుంది.. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అధికారులకు, రాజకీయ నేతలకు తానే లేఖలు రాస్తుంటానని, అది చూసిన పాప ఇప్పుడు తనపైనే ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది..2 అని నవ్వుతూ ఆ తండ్రి పోలీసు అధికారులతో చెప్పాడు. ప్రస్తుతానికి ఎహ్సానుల్లా ఎలాంటి ఉద్యోగం, ఉపాధి లేకుండా ఉన్నాడు.
కానీ హనీఫా మాత్రం ఈ విషయంలో చాలా విసిగిపోయింది. 3ఎంతకాలం నేను ఒకేదాని కోసం నేను ఎంత కాలం అడగాలి? ఎప్పుడడిగినా డబ్బులు లేవనే చెబుతున్నాడు.. అందుకే పోలీసులకు లేఖ రాశాను2 అంటుంది ఆ చిన్నారి. హనీఫా అన్నింట్లోనూ ఫస్టే.. ఆటల్లోనూ, పాటల్లోనూ, చదువులోనూ ఎప్పుడూ ముందుంటుంది.
పాప వివరంగా రాసిన ఆ లేఖ చదివిన తర్వాత, అందరికీ ఆ చిన్నారిపై సానుభూతి పెరిగింది. పోలీసులు కూడా ఆ చిన్నారికి అండగా నిలిచారు. ఆమె ఫిర్యాదులో నిజాయితీకి వారు చలించిపోయారు. అందుకే ఆ చిన్నారి సమస్యకు వారు పరిష్కారం చూపించాలని అనుకున్నారు.
అధికారులు
హనీఫా నిజాయితీగా రాసిన లేఖ జిల్లా అధికారులను కూడా స్పందింపచేసింది. వెంటనే వారు హనీఫా ఉంటున్న గ్రామంలో 500 టాయిలెట్లు కట్టడానికి నిధులు మంజూరు చేశారు. సిటీ కమీషనర్ మాట్లాడుతూ.. 3పాప ఫిర్యాదు చూసి చాలా సంతోషం వేసింది. స్కూళ్లలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసిన టాయిలెట్ లేనివారు.. వాటి గురించి వారి తల్లిదండ్రులను గట్టిగా అడగాలని మేం విద్యార్థులను ప్రోత్సహించాం.. ఆ ఫలితమే ఇది.. విద్యార్థులు స్వచ్ఛ భారత్ దిశగా ఇలా సాగుతే ఇక దేశానికి కావలసిదేం ఉంది.. ఇక జాతీయ స్వచ్ఛ భారత్ కోసం ఈ చిన్నారి(హనీఫా)తోనే స్థానికంగా ప్రచారం చేయించాలని అనుకుంటున్నాం2 అని చెప్పారు.
ఏది ఏమైనా తన లేఖకు ఇంత స్పందన వచ్చినందుకు చాలా సంతోషపడుతోంది హనీఫా. ముఖ్యంగా ఆరుబయట మలవిసర్జనకు వెళ్లకుండా తన ఇంటికే టాయిలెట్ వచ్చినందుకు మరింత ఆనందపడుతోంది. గత కొన్ని రోజులుగా ఎహ్సానుల్లాతో మాట్లాడని హనీఫా.. పోలీసులు నచ్చజెప్పడంతో చివరికి తన తండ్రిపై కోపం వీడింది. ఇప్పుడు తండ్రితో మాట్లాడుతోంది హనీఫా..
*

చిత్రాలు.. హనీఫా జారా *హనీఫా పోలీసులకు రాసిన లేఖ
*స్టేషన్‌లో పోలీసు అధికారులతో హనీఫా జారా