మెయిన్ ఫీచర్

మోక్షమార్గం వైకుంఠ ద్వారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుం ఠ ఏకాదశి అని అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడు. ఆయనను దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటా రు. అందుకే దీన్ని ము క్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఇక కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, రుషులను క్రూరంగా హింసించేవాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు శ్రీహరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఆ నారాయణుడు మురాసురుడిని వధించడానికి బయలుదేరతాడు. ఈ విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. దీంతో అతన్ని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ఉత్తర ద్వారం గుండా వచ్చి.. మహావిష్ణువును వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఈవిధంగా దేవతలను సంరక్షించిన ఈ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. అందుకే ఈ రోజు ఉత్తర ద్వారం గుండా భక్తులకి ఆ శ్రీమహావిష్ణువు దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
మామూలుగా అన్ని దేవాలయాల్లో ఏడాదిలో అన్ని రోజులు ఉత్తర ద్వారాన్ని మూసి ఉంచుతారు. కేవలం వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగానూ, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీనే్న హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేనివారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి.