మెయిన్ ఫీచర్

దేహమే శివం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సద్గురు ఉపదేశం...
మీ దేహాన్ని శివంగా మలచుకోండి.
మీ అస్తిత్వంలో అతి ప్రధానమైన అంశం మీ భౌతిక శరీరం. మనం మన శరీరాన్ని ఒక సాధనంగా చూసినప్పుడు వివిధ రకాల కార్యకలాపాల కోసం భిన్న సాధనాలను తయారుచేసి వాటి శక్తిని గణించాలి. శరీర సామర్థం విషయం వచ్చినప్పుడు మానవ శరీరం మరే జంతువుతోనూ సరిపోలదు. మీరేదయినా కీటకాన్నో లేదా ఉదాహరణకు మిడతనో తీసుకున్నారనుకోండి, అది తన శరీరం పొడవుకు 50 నుండి 100 రెట్ల దూరం దూకగలుగుతుంది. అంటే, దానితో పోల్చుకోవాలంటే , మీరు 5అడుగుల ఎత్తో, 6 అడుగుల ఎత్తో ఉన్నారనుకోండి మీరు 500- 600 అడుగులు దూక గలగాలి. ఒక వానపాముతోనో, ఒక చెదపురుగుతోనో, ఒక మిడతతోనో, ఒక పులితోనో, ఒక జింకతోనో, ఒక ఏనుగుతోనో లేదా భూగోళం పై ఉన్న ఏ ప్రాణితోనైనా సరే తీసికొని దానితో ఒలింపిక్స్‌లో పోటీ చేయదలచుకుంటే, మీ సామర్ధం వాటి సామర్ధ్యానికి దరిదాపుల్లో క్కూడా ఉండదు.
శరీర శక్తి, సామర్థ్యాల విషయంలో మనం భూగోళంపై ఏ ప్రాణితోనూ పోటీ చేయలేం. కాని మనం ఒక సామర్థంతో ఈ భూమి మీదికి వచ్చాం. మన సామర్థ్యం కేవలం మనుగడకోసం కాదు. మనుగడని అధిగమించి మరేదో చేయగలిగిన సమర్థత మనలో ఉంది; అది అన్నిటిలోకీ ముఖ్య మైంది. దురదృష్టవశాత్తు మనుగడకు కావలసిన అవసరాలను దాటి ముందుకు చూడడానికి బదులు ఈ లోకంలో చాలా మంది తమ మనుగడ ప్రమాణాలను పెంచుకోవడంలో మునిగి పోయారు. ఒక ప్పుడు మనుగడ అంటే రోజుకు ఒకటి లేదా రెండు పూటల భోజనం. ఇవ్వాళ మనుగడ అంటే బిఎండబ్ల్యు! మానవ యంత్రాంగాన్ని తెలివితక్కువగా ఉపయోగించడం అంటే ఇదే. మానవ శరీరమనే ఈ యంత్రాంగానికి మరో విధమైన సంభావ్యత ఉంది.
యోగ శాస్త్రంలో మానవ దేహంలోని వెనె్నముకను ‘మేరుదండం’ అంటాం. అంటే విశ్వానికే అక్షం అని అర్ధం అన్నమాట. మనిషి వెనె్నముక విశ్వానికే అక్షం ఎలా అవుతుంది? ఈ రోజుల్లో ఆధునిక విజ్ఞానశాస్త్రం ఏం చేబుతోందంటే,
మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఒక ప్రకంపన అని. మీరు మరింత లోతుగా పరిశిలిస్తే, ఒక్కటే శక్తి అనేక విధాలుగా ప్రతిధ్వనిస్తుంది అని తెలుస్తుంది. మనం సృష్టి అంటున్న దానంతటికి కూడా, అనంతమైన విశాలశూన్యం ఆధారభూతంగా ఉన్నదన్న విషయం మనకు నిర్ధరితమైనది - దీనికి శాస్తజ్ఞ్రులు శ్యామ శక్తి (బ్లాక్ ఎనర్జీ)వంటి పేర్లు పెట్టడానికి ప్రయత్ని స్తున్నారు; కాని వీటికి అవతల, విశాలమైన సంపూర్ణ శూన్యస్థలాలు ఉన్నాయని మనకు తెలుసు. అతి ప్రాథమికమైన శారీర తత్వం నుండి, మీరు దివ్యత్వం అని పిలిచే దాని వరకు సర్వానికీ అదే ఆధారం. ఇందుకు ఒక ఉదాహరణ ఏమిటంటే, మనం ఓ బ్రష్ తో పెయింట్ వేస్తున్నప్పుడు - మొదట్లో ఆ పెయింట్ మందంగా ఉంటుంది, క్రమ క్రమంగా పల్చ బడుతుంది, చివరికి అదృశ్యమవుతుంది. సృష్టి ప్రక్రియ కూడా అటువంటిదే. మానవులు, ఆ శూన్యతకు కొంచెం సమీపంగా ఉన్నారు.
మనిషిలోని అన్ని ప్రకంపనలు వెనె్నముక నుండి ఉద్భవిస్తాయి. ఈ ప్రకంపన ఎంత సుక్ష్మంగా ఉంటే, మనిషిలోని అవగాహన శక్తి అంత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రకంపనలు స్థూలంగా ఉంటే మీ అవగాహన శక్తి కొంతవరకే వ్యాప్తి చెందగలదు. ఈ ప్రకంపనలు అతి సుక్ష్మంగా ఉంటే మీ అవగాహన శక్తి చుట్టూ ఉన్న ప్రదేశమంతా వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడైతే మీ ప్రకంపనలు అతి సుక్ష్మంగా ఉంటాయో, అప్పుడు మీ అవగాహన శక్తి కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. మీరిప్పుడు ‘నేను’ అని పిలుచుకునేది, మీ పరిమిత అస్తిత్వానికి సంబంధించినది - ఇది మీ అనుభూతి సరిహద్దులలోపలే ఉంటుంది. మీ అనుభవాల సరిహద్దుల లోపల ఉండేదే ‘మీరు’. మీ అనుభూతుల సరిహద్దులకు వెలుపల ఉండేది అంతా మరొకరు లేదా మరొకటి. మీలోని ప్రకంపనులను మీరు శుద్ధి చేసుకుంటే మీ అనుభూతి చెందగలదాన్ని అనంతంగా పెంచుకోవచ్చు. శివుడు తన ‘మూడో కన్ను తెరిచాడు’ అన్నప్పుడు ఆయన తను అనుభూతి చెందగలదాన్ని అపరిమితమైన పద్ధతుల్లో విస్తరించుకున్నాడని అర్థం. అప్పుడు మొత్తం సృష్టి అంతా కూడా ఆయనలో ఒక భాగమై పోతుంది అన్నమాట. అప్పుడు సహజంగా సృష్టి అంతటికీ ఆయనే కేంద్రం అవుతాడు కదా..! కాని ఆయనే కేంద్రమని తెలుసుకోవడమెలా అన్నది మీ ప్రశ్న.
కాల, స్థల భ్రాంతి
కాలం, స్థలం గురించిన మీ భావనలు చాలా భ్రాంతి పూరితమైనవని, ఇప్పుడు ఆధునిక విజ్ఞానశాస్త్రం నిస్సందేహంగా నిరూపిస్తూ ఉంది. కాలం, స్థలం రెండిటినీ కూడా సాగదీయ గలం. వాటిని మీరు మీ ఇష్టం వచ్చినట్లు మార్చగలరు. మీరు 1000 కాంతి సంవత్సరాల దూరాన్ని ఇక్కడే ఉన్నట్టు చేయవచ్చు. 10,000 సంవత్సరాల కిందట ఉన్నదాన్ని, 10,000 సంవత్సరాల తర్వాత ఉండేదాన్ని ఇప్పుడే ఉన్నట్టు చేయవచ్చు; ఎందుకంటే ఉన్నదంతా కూడా ‘ఇక్కడే, ఇప్పుడే’ ఉంది. నేను మార్మికంగా మాట్లాడడం లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కాలం, స్థలం అన్నవి ఒక పెద్ద భ్రాంతి. మీరు వాటిని ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. వాస్తవానికి, ఇప్పుడు శాస్త్ర వేత్తలలో ఒక వర్గం కాలం అనేది, స్థలం అనేది లేనేలేదని వాదించడం ప్రారం భించారు. వాళలు సరిగానే చెప్తున్నారు. ఈ అవగాహన నుండే మీ వెనె్నముక ‘మేరుదండ’ మని మేం చెప్తున్నాం; అది విశ్వాసానికే అక్షం.. ఇప్పుడు మీకది అనుభవంలో లేకపోయినా, కనీసం మీరు నిర్దిష్టమైన పద్ధతిలో ప్రకంపించినట్లయితే అది విశ్వానికి అక్షం అవుతుంది.
శరీరం ఒక సాధనం. దాన్ని మీరు కేవలం మీకోసం ఆహరం, వస్తువులు సేకరించడానికే ఉపయోగిస్తారా? దాన్ని ఫీట్లు చేయడానికి ఉపయోగిస్తారా? లేదా పరమోత్కృష్టమైన దాన్ని సాధ్యం చేసుకోవడాని కోసం ఉపయోగిస్తారా? దాన్ని మీరు ఒక సాధనంగా ఉపయోగిం చదలచుకుంటే మీరు మొట్టమొదట చేయవలసింది ఈ శరీరంతో మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం మానేయాలి. ఈ శరీరాన్ని మీరు సేకరించు కున్నారని మీకు తెలుసు - అది కేవలం మీరు పోగుచేసుకున్న ఆహారం. మీరు సేకరించుకున్న దాన్ని మీరు ‘నేను’ అని ఎట్లా చెప్పగలగుతారు. మీరు సేకరించింది కొంతకాలంపాటు మీది కావచ్చు, కాని అదే మీరు కాదు కదా..! అద్భుతమైన సాధనం మానవ శరీరం అద్భుతమైన సాధనం.
ఇంకావుంది...