మెయన్ ఫీచర్

కొత్త ఆర్థిక శకం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 18 నుంచి మొ దలై, ఆగస్టు 12 వరకు జరిగిన ఉభ య సభలు సుమారు 250 గంటలపాటు ప్రజాసమస్యలపై చర్చించాయి. ఓ పదిశాతం సమయం అంతరాయంతో వృథా అయినా మరో పదిశాతం సమయం అదనంగా కేటాయించి, మొత్తంమీద 14 బిల్లు లు ఆమోదించడంతో ఉభయ సభల సభ్యులు పరిణితి ప్రదర్శించారు. ముఖ్యం గా వస్తుసేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొంద డం భారత ఆర్థికరంగానికి ఊపును, ఉత్సాహాన్నిచ్చే విషయం. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెబుతూనే అంగీకారం తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ తాము బిల్లును వ్యతిరేకిస్తున్నా, ప్రజల సంక్షేమం కోసం మద్దతునిస్తామన్నది. ‘బహుమత్’ (సంఖ్యాబలం) కంటె ‘సహమత్’ (సర్వసమ్మతి)కే ప్రాధాన్యత నిస్తామని మొదటినుంచి మోదీ చెబుతున్నా కాంగ్రెస్‌పార్టీ బిల్లును అడ్డుకుంటూనే ఉంది. బిల్లు తాము తమ పాలనలో తెచ్చామని అప్పుడు భాజపా అడ్డుకుందని, బిల్లు భాజపా హయాంలో ఆమోదం పొందితే రాజకీయంగా తమకు అది దెబ్బ అని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. కాని దేశంలో పెరుగుతున్న భాజపా బలం, కనుమరుగవుతున్న తన ప్రాభవాన్ని చూసి కాంగ్రెస్ తలవంచక తప్పలేదు. జిఎస్‌టి బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం భారత్‌కు సానుకూల పరిణామమని మూ డీస్ ఇనె్వస్టర్ అభిప్రాయపడింది. జిఎస్‌టిని అంగీకరించేందుకు రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి. అస్సాం రాష్ట్రం యిప్పటికే దీన్ని ఆమోదించింది. బిహారు రాష్ట్రం యిందుకోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. జిఎస్‌టి ఎంత ఉండాలనేది నిర్ణయించేందుకు కేంద్రం కూడా కసరత్తుప్రారంభించింది. ద్రవ్యోల్బణాన్ని పది నుంచి ఆరు శాతానికి తగ్గించగలిగిన ఎన్‌డిఎ ప్రభుత్వం జిఎస్‌టిని నిర్ణయించడం విషయంలో జాగరూకతతో వుండే అవకాశముంది. జిఎస్‌టి బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘ఇదో చారిత్రక ఘటన అనీ, సహకార సమా ఖ్య స్ఫూర్తికి ఉదాహరణ అని, 21వ శతాబ్దపు పరోక్ష పన్ను వ్యవస్థలోకి భారత్‌ను నడిపించాలనే విప్లవాత్మక నిర్ణయ’మని అన్నారు. పన్ను రేటు ఎంత ఉండాలని నిర్ణయించేందుకు పాలకమండలిని ఏర్పరచారు. అయితే పెట్రోలు, డీజిల్, మద్యం, విద్యుత్, రియల్ ఎస్టేట్‌లు, జిఎస్‌టి పరిధిలోకి రావు. వస్తు సేవల పన్ను వల్ల భారత జిడిపి రెండుశాతం పెరుగుతుందని అం చనా. 2017 ఏప్రిల్ వరకు దీన్ని అమలు చేసేందుకు సాంకేతిక సమాచార వ్యవస్థను కేంద్రం సిద్ధం చేసింది. దేశం అంతా ఒకే మార్కెట్‌గా ఆవిర్భవించనుంది. అయితే అమలు ప్రారంభమైన మొదటి ఆరునెలల కాలం ప్రభుత్వాలు విమర్శలను ఎదుర్కోక తప్పదు. ఎందుచేతనంటే కొన్ని రంగాల్లో పన్నులు తగ్గుతాయి. మరికొన్ని రంగాల్లో పన్నులు పెరుగుతాయి. వాహన, ఔషధ, ఫాస్ట్‌మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ (ఎఫ్‌ఎమ్‌సిజి), వీడియో, వినోదం, జౌళి, సిమెంట్ రంగాలవారికి పన్ను తగ్గుతుంటే, బ్యాంకింగ్, టెలికాం, ఐటి, వంటి రంగాల్లో పన్ను పెరగనుంది. ఈవిధంగా వివిధ రంగాల్లో వ్యాపారం సమతుల్యం సాధించేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుత పన్ను విధానంలో ముడిసరుకు నుంచి తుది వినియోగదారుడికి వచ్చేసరికి వస్త్ధుర వందశాతం పెరిగితే, జిఎస్‌టి అమలుతో కేవలం 50-60 శాతం మాత్రమే అధికంగా ఉంటుంది. ఆరకంగా వస్తువుల ధరలు తగ్గుతాయి. కారణం పన్నులపై పన్నువేయడం ఇందులో ఉండదు. జిఎస్‌టి వల్ల అనేక పరోక్ష పన్నులు రద్దవుతాయి. కేంద్ర ప్రభుత్వపు పన్ను, కస్టమ్స్‌పై ప్రత్యేక అదనపు డ్యూటీ, కేంద్ర అమ్మకపుపన్ను ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్‌లు రద్దవుతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యాట్, అమ్మకంపన్ను, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రిటాక్స్, కొనుగోలు పన్ను లగ్జరీ పన్ను, లాటరీ బెట్టింగ్- గ్యాంబ్లింగ్‌పై విధించే పన్నులు రద్దవుతాయి.
జిఎస్‌టి ఆమోదంకోసం బిజెపి కొంత పరిపక్వత ప్రదర్శించింది. పట్టువిడుపులతో అన్ని పక్షాలను మచ్చిక చేసుకుంది. విస్తృతంగా అందరితో చర్చించింది. జిఎస్‌టి ఆమోదంపై లోక్‌సభలో ప్రసంగించిన మోదీ జిఎస్‌టిని ‘‘గ్రేట్ స్టెప్ బై టీమ్ ఇండియా’’ అని వర్ణించారు. వస్తువు ముడి సరకు స్థాయినుండి వినియోగదారుడి వరకు, వినియోగదారుడే అంతిమ విజేత. ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని స్మరిస్తూ భారత్‌కు పన్ను తీవ్రతనుండి విముక్తి లభించిందన్నారు మోదీ. తొంబయి రాజకీయ పక్షాలతో చర్చించిన తరువాత జిఎస్‌టికి ఆమోదం లభించిందన్నారు. ‘ఒకే భారతం, శ్రేష్ఠ భారత’ విజ యం అన్నారు. ఏకాభిప్రాయంతో చేసిన ఈ నిర్ణయం వల్ల శక్తి వస్తుందన్నారు. సభ్యులంతా ఈ సభను రాజ్యాంగ వేదికగా కాక, జాతీయ అజెండా వేదికగా ఉపయోగించడం సంతోషకరం అన్నారు. ఏకాభిప్రాయంతో చేసిన ఈ నిర్ణయం వల్ల శక్తి వస్తుందన్నారు. సభ్యులంతా ఈ సభను రాజకీయ వేదికగా కాక, జాతీయ వేదికగా ఉపయోగించడం సంతోషకరం అన్నారు. ఆర్థిక రంగాన్ని పరిపుష్ఠంగా ఉంచేందుకు కావాల్సిన ఐదు విషయాలైన మానవవనరులు, ధనం, సరుకు, యంత్రం, సమయం వీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకునే వీలవుతుందన్నారు మోదీ. ఒక ఆర్థిక సర్వే ప్రకారం ఐటిని సదుపయోగం చేసుకోలేని కారణంగా దేశంలో లక్షా నలభైవేల కోట్ల నష్టం జరుగుతోంది. దాన్ని ఆపవచ్చు అన్నారు మోదీ. పారదర్శకత పెరుగుతుందనీ పన్నుల్లో రాష్ట్రాల వాటా, కేంద్రం వాటా గణాంకాలతో తేటతెల్లమవుతుందని, అంతా ఆన్‌లైన్‌లో జరగడం వల్ల పరస్పర విశ్వాసం పెరుగుతుందన్నారు. జిఎస్‌టి వల్ల లావాదేవీలు పెరుగుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. తయారీరంగం బలపడుతుంది. ధనం చలామణిలో వుండడంతో ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడుతుంది. ఎఫ్‌డిఐల రూపంలో పెట్టుబడులు తరలివస్తాయి. అయితే సామాన్యుడిని ఇబ్బంది పెట్టే విషయం కాదిది. సామాన్యుడి అవసరాలేవీ ఈ పన్ను పరిథిలోకి రావు. ద్రవ్యోల్బణం విషయమై ప్రభుత్వం ఆర్‌బిఐతో మాట్లాడి నాలుగు నుంచి ఆరుశాతం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పరిస్థితి 2021 వరకు కొనసాగనుంది. పన్నుల వసూళ్ల విషయమై చాలామంది అధికారులు తిరుగుతుంటారు. ఇందుకోసం కొంత ఖర్చు అవుతోంది. అయితే అంతా ఆన్‌లైన్‌లో జరగడం వల్ల పన్నుల ఎగవేత కుదరదు. పన్ను వసూళ్లు పెరుగుతాయి. కనుక పన్ను వసూళ్లపై పరోక్ష ఖర్చు తగ్గుతుంది. అంతా ఆన్‌లైన్‌లో జరగడం వల్ల రెండు రకాల లెక్కలు చూపే అవకాశం వ్యాపారులకు లేదు. దానివల్ల అవినీతి అంతమవుతుంది. నల్లధనం కనుమరుగవుతుంది.
కనీస ఆచరణాత్మక పన్ను రేటుకై జిఎస్ టి మండలి ప్రయత్నిస్తుందని అరుణ్ జైట్లీ అన్నారు. కొన్ని దేశాలలో ఇది గరిష్టంగా 19.6 శాతం (ఫ్రాన్స్), 25 శాతం (స్వీడన్), కనిష్టంగా 5 శాతం (కెనడా)గా ఉంది. ఈ మండలి అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఆర్థికశాఖ నుంచి నియమితులైన ఓ మంత్రి సభ్యుడి గా ఉంటారు. కనీసం 16 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. బిల్లువల్ల నష్టపోయే తయారీరంగ రాష్ట్రాలకు ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించనుంది. పన్నుల నిర్ణయంలో పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు సమాన ప్రా ధాన్యం వుంటుంది. రాష్ట్రాలు చేసిన బిల్లు ను పార్లమెంటు అతిక్రమించదు. అంతర్ రాష్ట్రాల వ్యాపారం, దిగుమతులు వంటి సందర్భాల్లో కేంద్రం పన్నులు విధించేందుకు, మినహాయించేందుకు విశేష అధికారం కలిగివుంటుంది.
ఆరునెలల క్రితం మోదీ ప్రభుత్వం ఆధార్ బిల్లును కూడా ఆర్థిక బిల్లుగా పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. లోక్‌సభ దాన్ని ఆమోదించింది. రాజ్యసభలో ఆమో దం పొందినా లేకపోయినా ఇది అమలయిపోతుంది. దీన్ని ‘‘ఆధార్, టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్సియల్ అండ్ అదర్ సబ్సిడీస్, బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్-2016’’ బిల్లు అన్నారు. ఇప్పటికే 70 కోట్ల మంది దేశంలో ఆధార్ కార్డులను కలిగివున్నారు. జన్‌థన్, ఆధార్, మొబైల్ (జామ్) యోజన కింద యిందులో 90 శాతం మంది ప్రభుత్వ పరంగా సంక్రమించే సబ్సిడీలు, పింఛన్లు వంటి సౌకర్యాలు ఉపయోగించుకుంటున్నారు. లబ్ది పొందుతున్నారు. దీనికి చట్టబద్ధత కల్పించారు మోదీ. అధిక సంఖ్యాబలం కలిగిన పార్టీగా భాజపా గత అరునెలల్లో ఆధార్, జిఎస్‌టి వంటి కీలక బిల్లులను ఆమోదింపజేసుకోగలగడం ఆపార్టీ సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చు. మోదీ నేతృత్వంలో కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకోవడం ఆర్థిక నిపుణు లను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నది. భారత్‌లో కొత్త ఆర్థిక శకం ప్రారంభానికి సన్నాహాలు జరగడం శుభదాయం.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్: 9676190888