మెయిన్ ఫీచర్

క్రిస్‌మస్ స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ.. మరి ఆ పండుగరోజు ఎలా మెరవాలి? పండుగరోజు ఆధునిక దుస్తులతోనే సంప్రదాయంగా, కొత్తగా కనిపించడం సాధ్యం కాదా..? అనుకునే వారికి ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి. అవేంటో చూద్దాం..
కుర్తీలు
పండుగల సీజన్ కాబట్టి షిఫాన్, జార్జెట్ వంటి వస్త్రాలు కాకుండా రాసిల్క్, ప్యూర్ సిల్క్‌లతో పాటు ఫ్యాన్సీ రకాలైన బ్రాసో, నెట్ వంటి వస్త్రాలతో కుర్తీలను కుట్టించుకుంటే బాగుంటుంది. చేతులు పొట్టిగా కాకుండా పొడవుగా, మోచేతి కిందివరకూ ఉండేలా చూసుకోవాలి. సిల్క్, రాసిల్క్ కుర్తీలపై చిన్న బూటీల్లా మగ్గం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. అలానే వీటిపై ఆప్లిక్ వర్క్, అద్దాల వంటి హంగులు చేరిస్తే చమక్కుమనిపించొచ్చు. ట్యూనిక్‌లకు బెనారస్, జార్జెట్, సిల్క్, మంగళగిరి రకాలు బాగుంటాయి. కుర్తీ సాదాగా ఉన్నప్పుడు దాన్ని కొత్తగా కనిపించేలా చేయాలంటే పైన ఎంబ్రాయిడరీ కేప్ ఎంచుకోవచ్చు. వీటికి జతగా పటోలా వస్త్రంతో స్ట్రెయిట్ కట్ ప్యాంట్లు చాలా బాగుంటాయి. వీటిపై కాస్త ఆధునికంగా ఎంబ్రాయిడరీ చేస్తే.. వీటిని అనార్కలీ, లేయర్డ్, ట్యూనిక్‌లకు జతగా వేసుకోవచ్చు. అలానే ఏ లైన్‌కు జతగా పలాజో చాలా బాగుంటుంది. సిల్క్ వంటి జాలువారే రకాల్లో ధోతీస్టైల్, పటియాలా ప్యాంటులను కుట్టించుకున్నా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచింగ్‌లకు దుపట్టా కూడా భారీగానే ఉండాలి. పొడవాటి గౌన్లూ, అనార్కలీలు, పరికిణీలకు దుపట్టా కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది. కలంకారీ, బాందినీ, బెనారస్, పట్టు దుపట్టాలు ఇప్పుడు చాలా ప్రత్యేకం. వీటిని ప్లెయిన్ సిల్క్, రాసిల్క్ వంటివాటికి జత చేసుకుంటే సంప్రదాయసిద్ధంగానూ, అందంగానూ కనిపించవచ్చు. ఇంకాస్త భిన్నంగా కనిపించాలనుకుంటే వీటిపైన ఏనుగులు, పక్షుల మోటిఫ్‌లను ప్రయత్నించవచ్చు. గాగ్రా, పరికిణీలపైకి ధూపియాన్ సిల్క్‌పై బ్లాక్ ప్రింటింగ్ లేదా త్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చక్కగా నప్పుతుంది.
స్కర్టులు
ఈ తరం అమ్మాయిలు తమ వస్త్రశ్రేణిలో తప్పనిసరిగా ఉండాలని భావిస్తున్న రకాల్లో స్కర్టులు ముందుంటాయి. సంప్రదాయ వేడుకలకు పొడవు స్కర్టులే బాగుంటాయి. వీటి తయారీకి రాసిల్క్, బెనారస్, పట్టు వంటి వస్త్రాలను వాడితేనే నిండుదనం. స్కర్టుకి జతగా క్రాప్‌టాప్, ఆ పైన జాకెట్ వేసుకుంటే కొత్తలుక్ వచ్చేస్తుంది. అలానే గద్వాల్ పట్టు స్కర్టులపై చిలుకలూ, నెమళ్లు, ఏనుగులు వంటి వాటిని మోటిఫ్‌లుగా వేసుకుంటే ఆ అందమే వేరు. వీటిపైకి లెహేరియా కోటా, బాందినీ తరహా దుపట్టాలు ట్రెండీగా ఉంటాయి.
గౌనులు
సందర్భం ఏదైనా గౌనులు చక్కగా కనిపించేలా చేస్తాయి. అందుకేనేమో కాలేజీ అమ్మాయిలు ఈ శైలికి ఫిదా అవుతుంటారు. సంప్రదాయ వేడుకల్లో పెళ్లికూతురితో పాటు అతిథులూ గౌనుకే ఓటేస్తున్నారు. కలంకారీ, ఇకత్ వంటి డిజైన్లతో, ప్యూర్ సిల్క్, రాసిల్క్, బెనారస్ వంటి వస్తర్రకాలతో వీటిని కుట్టించుకుంటే బాగుంటుంది. ఆధునికంగా కనిపించేందుకు దానికి దుపట్టాలు జతచేయడం, లేయర్డ్, ఎసెమెట్రికల్ కట్‌లతో, కోల్డ్‌షోల్డర్, షోల్డర్‌లతో డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. లెహెంగాలు
వీటిని కూడా అసెమెట్రికల్, బాక్స్‌ప్లీటెడ్, లేయర్డ్, హైవెయిస్టెడ్ వంటి రకాల్లో కుట్టించుకుంటే ఆధునికంగా మెరిసిపోవచ్చు. నెట్, జార్జెట్ వంటి వాటికి బదులుగా చేనేత రకాలైన ఇకత్, కలంకారీ, ప్యూర్ సిల్క్, ఖాదీ ఆర్గాంజా, చందేరీ వంటి వస్త్రాలను ప్రయత్నించొచ్చు.