మెయిన్ ఫీచర్

అద్దె‘అమ్మ’లకు న్యాయం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు లేని తల్లులు మరో స్ర్తి ద్వారా పిల్లల్ని కనడాన్ని అద్దెగర్భం లేదా సరొగేసి అంటారు. అయితే ఈ విధానం ద్వారా జరిగే కాన్పుల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. పిల్లలు లేని వాళ్లే కాకుండా.. కోటీశ్వరులు, సెలబ్రెటీ మహిళల్లో ఎక్కువమంది ఈ విధానం ద్వారా తల్లులు అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లో ఈ విధానానికి లక్షల్లో ఖర్చు అవుతుండటంతో చాలామంది తెలుగు రాష్ట్రాల్లోని నగరాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్క అయితే రూ. 10 లక్షలలోపలే సరొగేసి ద్వారా పిల్లలను పొందే అవకాశం ఉండటంతో వివిధ దేశాల నుంచి చాలామంది ఇక్కడకి పిల్లలకోసం వస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చే మహిళలకు రూ. లక్ష, రెండు లక్షలు ఇస్తామని ఆశచూపి పిల్లల్ని కనేందుకు ఒప్పిస్తున్నారు. చేసేదేమీ లేక డబ్బులు వస్తాయన్న ఆశతో చాలామంది మహిళలు ఇందుకు అంగీకరిస్తున్నారు. ప్రసవానంతరం పిల్లల్ని తీసుకుని, గర్భం ఇచ్చిన తల్లుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలించేసుకుంటున్నారు. ఫలితంగా గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళలందరూ రక్తహీనత వంటి సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాకుండా అన్ని నెలలు కడుపులో మోసిన బిడ్డను కనీసం ఒక్కసారైనా చూడకుండా తీసుకుని పోతుంటే ఆ తల్లులు తట్టుకోలేకపోతున్నారు. ముందుగానే డబ్బుల కోసం బిడ్డను కనేట్లు మాట్లాడుకున్నా.. అన్ని నెలలు మోసిన బిడ్డను కనీసం ఒక్కసారి కూడా ఎత్తుకోకుండా.. ఆలోచిస్తే ఇది చాలా పెద్ద మానసిక సంఘర్షణే.. పేదరికం, అసహాయతల కారణంగా నిరుపేద మహిళలకు డబ్బు ఎరవేసి.., అనుమతుల్లేకుండా, నిబంధనలను తోసిరాజని, అక్రమంగా అద్దెగర్భాల పేరుతో జరిగే వ్యాపారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. భారతదేశం అద్దెగర్భాల వ్యాపారానికి అడ్డాగా మారిందని.. దాన్ని అరికట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారు. మహిళలు, పిల్లల గౌరవంతో పాటు కుటుంబాలను కాపాడటమే ఈ బిల్లు లక్ష్యమని.., వ్యాపారధోరణిలో జరుగుతున్న అద్దెగర్భాల ప్రక్రియను నిరోధించి, ఎటువంటి ప్రతిఫలాపేక్షలేని విధానాన్ని ప్రోత్సహించడమే దీని ఆశయం. 2016లో రూపొందించిన ఈ బిల్లుకు 23 సవరణలు చేశారు. అవేంటో చూద్దామా..
అర్హతలు
* అద్దె గర్భాల ప్రక్రియను ఎంచుకోవడానికి చట్టబద్ధంగా వివాహితులైన భార్యాభర్తలే అర్హులు..
* సరొగేసి కోసం 23 నుంచి 50 సంవత్సరాల మహిళలు, 26 నుంచి 55 మధ్య వయస్సు కలిగిన పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి.
* వివాహం జరిగి కనీసము అయిదేళ్లయి ఉండాలి..
* దంపతుల్లోని ఒకరికి సంతానలేమి సమస్య ఉన్నవారు..
* బిడ్డకు జన్మ ఇవ్వలేరని డాక్టరు నిర్ధారణ చేసి ఉన్నవారు..
అనర్హులు
* విదేశీయులు, ఎన్నారైలకు అనుమతి లేదు.
* సహజీవనం చేసేవారు, హోమో సెక్సువల్స్, ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు ఇందుకు అనర్హులు. మునుపు ఒక సంతానం కలిగినవారు మరో బిడ్డను ఈ ప్రక్రియ ద్వారా పొందలేరు.
గర్భాన్ని అద్దెకు ఇచ్చేవారు..
* దంపతులు సంతానం కోసం సన్నిహిత బంధువుసరొగేసికి అర్హులు.
* గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ వివాహిత అయి ఉండాలి. ముందు కనీసం ఒక బిడ్డను అయినా కని ఉండాలి.
* గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు వైద్య ఖర్చులు మినహా.. ఇంకే ప్రతి ఫలమూ సంతానం పొందే దంపతుల నుంచి ఆశించకూడదు.
* ఈ సూచనలన్నీ పాటించి, సరొగేసి ద్వారా కలిగిన సంతానం అద్దె గర్భాన్ని ప్రతిపాదించిన దంపతుల కన్నబిడ్డగా గుర్తింపు పొందుతుంది.
పర్యవేక్షణ
* ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తాయి.
* అర్హత ఉన్న తల్లిదండ్రులకు, గర్భాన్ని అద్దెకు ఇవ్వదలచిన మహిళకు ఈ సంస్థ ధ్రువపత్రాలు అందజేస్తుంది.
* ప్రాధికార సంస్థ ఇలాంటి చికిత్సలు చేసే ఆసుపత్రులను పర్యవేక్షిస్తుంది.
ఈ నిబంధనలు ఉల్లంఘించి గర్భాన్ని అద్దెకు ఇవ్వాలని మహిళను ప్రలోభ పెడితే రూ. 10 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఈ విషయం గురించి ఎటువంటి ప్రకటనలు విడుదల చేసినా ఇదే శిక్ష వర్తిస్తుంది. రుసుములు తీసుకుని గర్భాలను అద్దెకు ఇస్తామన్నా కూడా ఇవే శిక్షలు.. కానీ ఈ బిల్లులో సమీప బంధువులు అంటే ఎవరో నిర్వచించలేదు. అలాగే ప్రాధికార సంస్థ ధ్రువపత్రం ఇవ్వడానికి కాలపరిమితి విధించలేదు. ఒకవేళ ఆ సంస్థ ధ్రువపత్రం ఇవ్వకుంటే ఎవరికి అప్పీలు చేయాలో కూడా ఈ బిల్లులో ప్రస్తావించలేదు. ఈ లోపాలను సవరించుకుంటే చాలా బాగుంటుంది. ఏది ఏమైనా అమ్మతనం వ్యాపారంగా మారిన నేటి సమాజంలో ఇలాంటి బిల్లుల వల్ల కొందరి మహిళలైనా ఇలాంటి వ్యాపారం బారిన పడి మోసపోకుండా, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆశిద్దాం..