మెయిన్ ఫీచర్

తృప్తి ఉన్నపుడే ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధోరణి మార్చడం అంటే మీరు ఒకరకంగా నాటకం ఆడుతున్నారు అని అర్ధం.
మీరు ఈ నాటకాన్ని ప్రపంచం ముందర ఆడవచ్చు. కానీ ఎప్పటికీ అలానే ఉండిపోలేరు. మీరు ఈ నాటకాన్ని మిగతా ప్రపంచ మంతటి ముందర సాగించ గలుగుతున్నా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీకు ఇది తెలిసిపోతుంది కదా. బయటకు ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా, కనిపించే అద్భుతమైన మనుషులు ఉన్నా, అంతర్గాతంలో వారిపరిస్థితి ఘోరంగా ఉంటుంది. పైగా ఇటువంటి వాళ్లకి వచ్చే ప్రశ్న ఏంటంటే ‘‘ఎందుకు ఈ చెడ్డవారందరూ ఇంత హాయిగా ఉంటున్నారు? వీరందరికి ఇంత హాయిగా ఎలా ఉంది’’ అని. ఇది ఎందుకని అంటే మీరు కేవలం మీ ధోరణిలో మాత్రమే బాగా ఉంటే సరిపోదు. మీరు ఈ సృష్టితో అనుసంధానమై ఉండాలి. ఈ సృష్టి మూలంతో అనుసంధానమై ఉండాలి. అంతే. ఎంతో అద్భుతమైన ఈ బ్రహ్మండంతో కూడా అనుసంధానమై ఉండాలి.
కానీ ఈ మంచితనంలో మీరు మంచివారు అనుకుంటూ మీ చుట్టూ ఓ గోడ కట్టేసుకుని అందులో మీరు మరో ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరైతే ఇలా సృష్టిలో ఓ భాగంగా కాకుండా ఉన్నారో, వారు బాధకి గురి అవ్వాల్సిందే, బాధ పడవలసిందే. ఎందుకంటే ఇలాంటి వారికి బాధ కలిగేంత వరకు వీరింకా వాళళు సృష్టించుకున్న ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటారు. అందుకని ప్రకృతికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అది ఇటువంటి వారిని కిందకు తీసుకువస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మిమల్ని కిందకు దింపుతుంది. ఎందుకంటే వీళ్ళ కాళళు ఈ భూమి మీద ఆనట్లేదు కదా.
వ్యవస్థను హాయిగా ఉంచడం ముఖ్యం ఈ సమయంలో అత్యాధికంగా నీరు ఈ భూమండలం మీద కిందకు దిగి వచ్చి ఉన్న సమయం. మీలో ఉన్నది 70శాతం నీరే. మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఇది మీ శరీరానికి ఈ విషయం తెలుసు. ఈ సమయంలో భూమండలం మీద అధికంగా నీరు ఉంది అన్న విషయం మీ శరీరానికి తెలుసు. ఇలా ఎండాకాలపు వేడి మొదలై అది ఎక్కువైన కొద్దీ, ఈ నీరు ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు చూడండి శారీరకంగా అంత హాయిగా ఉండదు. అదే వసంతంలో మీ శరీరంలో ఎలా ఉంటుంది..? హాయిగా ఉంటుంది. మీ శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. హాయిగా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో చాలా మంది మానవాళి ఇది ఏమిటి అన్న అనుభూతి కూడా చెందడంలేదు. హాయిగా ఉండడం అంటే ఏమిటి అన్న అనుభూతి కూడా చెందడం లేదు. ఓ చిన్న పురుగయినా సరే మిమల్ని, మీ ప్రశాంతతని భంగం చేసేయగలదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఓ ఎండుటాకు మీ మీద పడిందనుకోండి హమ్మో అంటారు. అది మీ ప్రశాంతతని కోల్పోయేలా చేయగలదు. ఎందుకంటే మీలో ఒక రకమైన హాయి లేదు. అలా హాయిగా ఉండడం అన్నది తేలికయినా విషయం కాదు. అలా హాయిగా ఉండడం అంటే మీరు ఈ సృష్టితో పూర్తిగా అనుసంధానమై ఉన్నట్టు లెక్క.
అందుకని మీ వ్యవస్థలో ఇలా ఒకరకమైన హాయిని తీసుకురావడానికి, మీ శరీరం అది ఈ భూమండలంలో ఒక భాగమే అని అర్ధం చేసుకుంటుంది. ఒకసారి మీ శరీరం కనుక ఈ గ్రహంలో భాగమే అన్న విషయం అర్ధం చేసుకున్న తరువాత మీరు అలా భూమీద కూర్చున్నారనుకోండి, మీ శరీరానికి ‘అది ఈ భూమిలో భాగమే’ అని అర్ధమవుతుంది. కానీ మీరు మీ గురించి మరేదో ఉహించుకుంటుంటారు...అదే సమస్య. కానీ శరీరానికి అది ఈ భూమిలో ఒక భాగమే అని తెలుస్తుంది. ఇది తెలుసుకున్నప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రక్రియ ఎంతో తేలికైపోతుంది. మీకు నేను ఇదే అన్న విషయం అర్ధంకాకపోయినా సరే మీ శరీరరానికి అర్ధమవుతుంది. అప్పుడు మీ వ్యవస్థలో ఒకరకమైన హాయి వస్తుంది.
ఇంకావుంది...