మెయిన్ ఫీచర్

మెరుపులు..మలుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని కష్టాలు.. ఎన్ని అడ్డంకులు.. ఎన్ని త్యాగాలు..
అన్నింటినీ దాటారు.. ఎన్నో ఘనతలు సాధించారు.
కొత్త సంవత్సరంలో మన సంతోషాలు మరింత రెట్టింపు కావాలంటే ఈ సంవత్సరంలో సాధించిన విజయాలను మరొక్కసారి స్మృతి పథంలోకి తెచ్చుకోవాల్సిందే.. ఎందుకంటే వర్తమానికి, భవిష్యత్తుకి పునాది గతమే కదా! అలా ఈ సంవత్సరంలో మహిళలు సాధించిన అభివృద్ధి, వారు పొందిన విజయాలను మరొక్కసారి గుర్తుచేసుకుంటూ అందరికీ వందనాలు చేస్తోంది మాతృభూమి..
శక్తివంతమైన మహిళలు
ప్రపంచంలోని సంపన్నులు, శక్తివంతమైన వ్యక్తుల జాబితాను ఏటా విడుదల చేసే ఫోర్బ్స్ 2018కిగానూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాను విడుదల చేసింది. అందులో నలుగురు భారతీయ మహిళలకు స్థానం దక్కడం విశేషం. ఫోర్బ్స్ జాబితాలో హెచ్‌సీఎల్ సీఈవో రోషిని నాడార్ మల్హోత్రా, ఔత్సాహిక వ్యాపార వేత్త కిరణ్ మజుందార్ షా, నటి ప్రియాంకా చోప్రా, హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్ శోభనా భార్తియాలకు చోటు లభించింది.
1978లో కిరణ్ మజుందార్ షా బయోకాన్‌ను స్థాపించగా, ఇప్పుడా సంస్థ విలువ 3.4 బిలియన్ డాలర్స్ ఉంటుంది. దేశంలోనే అత్యంత పెద్దదైన బయో ఫార్మా సూటికల్ కంపెనీ బయోకాన్. దీంతోనే షా సంపన్నురాళ్ల జాబితాలో చేరింది.
ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక, రోషినిలు పిన్న వయస్సుకలుగా నిలిచారు. ఇక ఆ జాబితాలో టెయిలర్ స్విఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత యుక్త వయస్సు ఉన్న పబ్లిక్ ఫిగర్‌గా నిలిచింది. ఫోర్బ్స్ ప్రకటించిన ఆ జాబితాలో భారతదేశం నుంచి ఉన్న నలుగురిలో రోషిని మొదటిస్థానంలో ఉంది. 2009లో ఈమె హెచ్‌సీ ఎల్ కార్పొరేషన్ సీ ఈవో అయింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఫోర్బ్స్ టాప్ 10 భారతీయ సెలబ్రిటీల జాబితాలో ప్రియాంక గత ఏడాది ఏడో స్థానంలో నిలిచింది. ఆ జాబితాలో ఉన్న ఒకే ఒక మహిళ ఆమే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్ ఈ ఏడాదికి ప్రకటించిన 100 మంది శక్తివంతమైన మహిళల్లో జర్మనీకి చెందిన ఏంజెలా మెర్కెల్ మొదటిస్థానంలో నిలిచింది. ఈమె 2005లో జర్మనీకి మొదటి మహిళా చాన్సలర్ అయింది. అప్పటినుంచి ఆ స్థానంలో ఆమె పనిచేస్తుండగా, ఇప్పుడు ఆమె నాలుగోసారి ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తోంది. ఇక ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయ మహిళలకు చోటు దక్కడం నిజంగా మన దేశానికి గర్వకారణమే.. ఆ నలుగురు ఎంతోమంది మహిళలకు ప్రేరణగా నిలుస్తారనడంలో అతిశయోక్తి లేదు కదూ..

బాక్సింగ్ క్వీన్
ముగ్గురు పిల్లల తల్లి, 35 సంవత్సరాల వయస్సులో ఒక అంతర్జాతీయ టోర్నీలో పోటీపడటమే కష్టం. అలాంటిది మేరీకోమ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ స్వర్ణం సాధించింది. 2008లో మేరీకోమ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం సాధించింది. అప్పుడు మేరీ కెరీర్ పతాక స్థాయిలో ఉంది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాక.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని కూడా అనుకుందామె. కొంత విరామం తీసుకుని మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. జాతీయ స్థాయి టోర్నీల్లోనే గెలవలేకపోయింది. 2016 ఒలింపిక్స్‌లో అర్హత కూడా సాధించలేకపోయింది. ఇలాంటి ఫామ్‌తో, 35 సంవత్సరాల వయస్సులో ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్ పసిడి గెలవగలదని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఈ ఏడాది కఠోరశ్రమతో మళ్లీ ఫామ్ అందుకున్న ఆమె కామనె్వల్త్ క్రీడల్లో పసిడి నెగ్గింది. తరువాత నవంబర్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కఠిన ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో పసిడిని సొంతం చేసుకుంది. ప్రపంచ బాక్సింగ్‌లో అత్యధిక పతకాలు గెలిచిన మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

టేబుల్ టెన్నిస్‌లో దిట్ట
బ్యాడ్మింటన్‌లో సైనా సింధుల్లా టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా.. కామనె్వల్త్ క్రీడల్లో మనిక ప్రదర్శన అద్భుతం. రెండు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం ఆమె ఖాతాలో వేసుకుంది. వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌లోనూ స్వర్ణాలు సాధించింది మనికా..
ఈ రాకెట్.. రాక్
బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్ వంటి అత్యున్నత టోర్నీలో గెలిచి కోట్లాదిమందికి అభిమాన క్రీడాకారిణిగా మారింది పి.వి. సింధు. ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోలేదన్న అభిప్రాయాన్ని మార్చివేస్తూ.. ఒకహుర వంటి మేటి క్రీడాకారిణిని ఓడించి టైటిల్ అందుకుంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప విజయాల్లో ఒకటి. ఇప్పటిదాకా ఏ షట్లర్ ఈ ఘనత సాధించలేదు.
పరుగుల జింక
అన్ని వసతుల మధ్య, ప్రపంచస్థాయి శిక్షకుల సాయంతో, చిన్నతనం నుంచీ సాధనచేస్తే తప్ప అథ్లెటిక్స్‌లో ప్రపంచస్థాయిని అందుకోవడం కష్టం. అలాంటిది పల్లెటూరికి చెందిన పేదింటి అమ్మాయి, పదహారేళ్ల వయస్సులో పరుగుపై దృష్టిపెట్టి, బూట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో పొలాల మధ్య పరుగులు తీస్తూ సాధన సాగించి, రెండేళ్లు తిరక్కుం డానే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి ఔరా అనిపించింది. ఆమే అసోంకు చెందిన హిమదాస్.. జులైలో జరిగిన అండర్ - 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగులో సంచలన ప్రదర్శనతో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది హిమదాస్.

గన్ గర్ల్
రెండేళ్ల ముందు వరకూ షూటింగ్‌తో పరిచయమే లేని ఈ అమ్మాయి అనుకోకుండా షూటింగ్‌లో అడుగుపెట్టి అద్భుతాలు చేస్తోంది మనూబాకర్. అప్పటిదాకా వేరే ఆటలు ఆడుతూ జాతీయ పతకాలను కూడా గెలుచుకుంది. కానీ ఒకరోజు తండ్రితో కలిసి షూటింగ్ రేంజ్‌కి వెళ్లి తుపాకీపై మనసుపడ్డ మను.. తండ్రిని ఒప్పించి సాధన చేసింది. ఏడాది తిరిగేసరికి ఆటలో నైపుణ్యం సాధించి నిరుడు జాతీయ క్రీడల్లో ఏకంగా తొమ్మిది స్వర్ణాలను పొందింది. ఈ ఏడాది ఆ సంచలనాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల మిక్స్‌డ్ టీం ఎయిర్ పిస్టల్ విభాగాల్లో స్వర్ణాలు సాధించి ఔరా! అనిపించింది.
సివంగి హర్మన్
ఇప్పుడు చాలామంది మహిళలు క్రికెట్లోకి వస్తున్నారు కానీ రెండు దశాబ్దాల కిందటి వరకు అమ్మాయిలు బ్యాట్ పడితే ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అలాంటిరోజుల్లేనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది హర్మన్. పంజాబ్‌లోని దారాపూర్ అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన హర్మన్.. చిన్నప్పటి నుంచీ క్రికెట్ ఆడేది. హర్మన్ చదివిన స్కూల్ యజమానికి క్రికెట్ అకాడమీ ఉండేది. ఆమె ఆసక్తిని గమనించి, ఆమెకు ఉచితంగా వసతి కల్పించి శిక్షణను ఇప్పించాడు స్కూలు యజమాని. 2009 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న హర్మన్ తొలిటోర్నీలోనే సత్తా చాటింది. సివంగిలో క్రీజులో కదిలే హర్మన్ పవర్ హిట్టింగ్‌కు పర్యాయపదంలా మారింది. పిన్నవయస్సులోనే భారత కెప్టెన్ అయిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. విదేశీ టీ20 లీగ్‌లో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయురాలు కూడా హర్మనే..

అరుదైన రికార్డు ‘వేదాంగి’ సొంతం
సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేసి వచ్చిన ఆసియా వ్యక్తిగా వేదాంగి కులకర్ణి రికార్డు నెలకొల్పింది. వీసా జారీలో జాప్యం, ఎముకలు కొరికే చలి.. వంటి అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసంతో ఈ సాహసయాత్రను పూర్తిచేసుకుంది. మగవాళ్లకు సైతం అందని రీతిలో ఇరవై ఏళ్లు కూడా నిండని వేదాంగి ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. *
కన్నుగీటి..
ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో రాత్రికి రాత్రే క్రేజీస్టార్ అయిపోయింది ప్రియా వారియర్. అలాగే గూగుల్‌లో ఇప్పటివరకు మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రెటీల లిస్టులో సన్నిలియోన్ అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు సన్నీని వెనక్కి నెట్టేసి ప్రియా వారియర్ మొదటి స్థానంలో నిలిచింది. కోట్లాది మంది ఫ్యాన్స్ ‘ఓరు అడార్ లవ్’ సినిమాలోని ప్రమోషన్ సీన్‌లో ఆమె కన్ను కొడుతున్న షాట్ సంచలనం అయ్యింది. ప్రియావారియర్ తన ప్రియుడిపైకి ప్రేమ తుపాకీ ఎక్కుపెట్టింది. ముద్దులనే బుల్లెట్లుగా మార్చి అతని గుండెల్లో కసిగా దించేసింది. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో వైరల్ అవ్వడంతో పాటు ట్రెండింగ్ లిస్టులో మొదటిస్థానంలో నిలిచింది. కళ్లతో ఆమె పలికించిన హావభావాల్లో ఒకలాంటి మత్తు ఉండటంతో అంతా ఫ్లాట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెకు కోట్లాదిమంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.

దీపిక, రణవీర్‌ల వివాహం..
ఈ ఏడాది నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలోని ఓ విల్లాలో రణవీర్, దీపికల వివాహం అంగరంగవైభోగంగా జరిగింది. ఈ విల్లాలో ఎక్కువగా రాజపరివారాల పెళ్లిళ్లు, సినిమా షూటింగ్‌లు జరుగుతాయి.
ప్రియాంక, నిక్‌ల వివాహం
రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్‌ల వివాహం డిసెంబర్ రెండున ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వధూవరుల స్నేహితులు, బంధువులు హాజరయ్యారు.
ఆదర్శ వివాహం
భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల వివాహం డిసెంబరు 16న, హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓరియాన్ విల్లాస్‌లో ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా ఇరు కుటుంబాలు, వారి సమీప బంధువులు, అతి కొద్దిమంది సన్నిహిత మిత్రుల మధ్య అత్యంత సాధారణంగా జరిగింది. బాడ్మింటర్ క్రీడాకారులైన ఈ ఇద్దరికీ స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ ఎటువంటి హడావుడీ లేకుండా అత్యంత సాదాసీదాగా పెళ్లివేడుక ముగించుకుని నలుగురికీ ఆదర్శంగా నిలిచిందీ జంట.
ఐదురోజుల పెళ్లి..
అంగరంగ వైభోగంగా జరిగే పెళ్లి అంటే వినడమే కానీ చూడం.. అయినా ఈ రోజుల్లో అంత భారీగా, ఆడంబరంగా పెళ్లిళ్లు జరగడం వింతే.. అదీకాక పాత పద్ధతులు మళ్లీ వెలుగులోకి వచ్చినట్లు ముకేశ్, నీతా అంబానీల గారాల తనయ ఈషా పెళ్లి చూస్తుంటే.. ఐదు రోజుల పెళ్లి సందడి, పచ్చని పందిరి, చీరలు, సారెలు, చుట్టాలు పక్కాలతో సందడే సందడి.. అదీకాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇది. ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనికుడు. అందుకే కూతురి పెళ్లిని అంత ఆడంబరంగా జరుపుతున్నాడు. ఒక్కగానొక్క కూతురైన ఇషా- ఆనంద్ పిరమాల్‌ల పెళ్లికి దాదాపు 100 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారని అంచనా.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 718 కోట్లు అన్నమాట.. 37 సంవత్సరాల క్రితం ప్రిన్స్ చార్లెస్-ప్రినె్సస్ డయానా పెళ్లి కూడా ఇంతే ఘనంగా జరిగింది. ఇప్పటి డాలర్ విలువ ప్రకారం.. వారి పెళ్లికి 110 మిలియన్ డాలర్లు ఖర్చయింది. మళ్లీ ఆ స్థాయి ఖర్చుతో జరుగుతున్న పెళ్లి మాత్రం
ఇషా- ఆనంద్ పిరమాల్‌లదే..

ఉమామహేశ్వరి