Others

వినియోగదారుల రక్షణకు దీక్షా కంకణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఎన్నో చట్టాలను, బిల్లులను తీసుకువచ్చినా- పటిష్టమైన బిల్లు ఏదైనా ఉందంటే అది వినియోగదారుల పరిరక్షణ బిల్లు మాత్రమే. స్పష్టమైన విధి విధానాలతో పాటు తీవ్ర శిక్షలతో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్రం పూనుకుంది. 1962 లోనే అమెరికా ప్రభుత్వం వినియోగదారుల హక్కుల రక్షణకు నడుం బిగించగా, భారత్ ఆ స్థాయిలో చట్టాలను తీసుకురావడానికి 56 ఏళ్లు పట్టింది. అమెరికాలో రాల్ఫ్ నాడర్‌ను వినియోగదారుల ఉద్యమానికి మూలపురుషుడిగా చెబుతారు. ఓ సంస్థ తయారుచేసిన కార్ల నాణ్యతాలోపంపై ఆయన ఉద్యమించాడు. ఆ తర్వాత వస్తువుల తయారీ, అమ్మకాల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 1962 మార్చి 14న అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ వినియోగదారుల హక్కుల బిల్లును అమెరికా అధ్యక్ష సభలో ప్రవేశపెట్టారు. మన దేశానికి వచ్చేసరికి 1949లో మద్రాస్‌లోని గాంధేయవాది ఆర్ ఆర్ దళవాయి వినియోగదారుల సంఘాన్ని ప్రారంభించడంతో వినియోగ ఉద్యమం మొదలైందని చెప్పవచ్చు.
భారత్‌లో వినియోగదారుల హక్కుల రక్షణకు అప్పటికే దాదాపు 46 చట్టాల్లో వేర్వేరు క్లాజులు కింద రక్షణ కల్పించారు. వాటన్నింటినీ క్రోడీకరించి 1986లో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు. దీనినే ‘వినియోగదారుల హక్కుల పత్రం’గా ప్రచారంలోకి తీసుకువచ్చారు. గుర్తింపు, సమాచారం, ఇష్టం, ప్రాతినిధ్యం, సరిదిద్దడం, చైతన్యం వంటి అంశాలను ఇందులో చే ర్చారు. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి గరిష్టంగా 150 రోజుల వ్యవధిని ఇచ్చారు. టెక్నాలజీ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, ప్రచార మోసాలు అంతగా అప్పట్లో లేకపోవడంతో ఆ బిల్లు కొన్ని అంశాలకు మా త్రమే పరిమితమైంది. వౌలిక అవసరాలకు సంబంధించిన హక్కులను, ఆరోగ్యకరమైన పర్యావరణంలో సమస్యల పరిష్కారాన్ని ఆవిష్కరించడంలో ఆ చట్టం విఫలమైంది. ఎందుకంటే ఇది పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీక కాకపోవడం, ధర చెల్లించని వ్యవహారాలకు ఈ చట్టం వర్తించకపోవడం ఒక పెద్ద లోపంగా మారింది. 1986లోనే ‘వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని’ రూపొందించి శాసనరూపం ఇచ్చినా, ఈ చట్టం ముఖ్య ఉద్దేశమైన- ‘తక్కువ ఖర్చులో,సులభ రీతిలో సత్వర న్యాయాన్ని అందించడమ’నే పరమార్థం నెరవేరలేదు. సరికదా.. తర్వాతర్వాత మోసాలు మిన్నంటడటంతో 1991లో, 1993లో, 2002లో వినియోగదారుల రక్షణ చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. డిజిటల్ యుగంలో ఎదురవుతున్న కొత్త సమస్యలను అధిగమించడానికి వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015 ఆగస్టులో బిల్లు ముసాయిదాను రూపొందించినా, దాన్ని పార్లమెంటరీ స్థారుూ సంఘానికి సిఫార్సు చేశారు. బిల్లులో పలు అంశాలపై స్థారుూ సంఘం తన అభ్యంతరాలను చెబుతూ సవరణలు చేసే సరికి అది మూలన పడింది. మరింత చర్చ అనంతరం 2017లో ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ బిల్లు’ను రూపొందించారు. గత ఏడాది జనవరి 5న తొలుత ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ రోజున లోక్‌సభలో కార్యక్రమాలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో అది కాస్తా అటకెక్కింది. దానిని స్వల్పంగా సవరించి డిసెంబర్ 20న లోక్‌సభలో మరో మారు ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇక ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది.
కొత్త బిల్లులో అనేక మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించారు. ప్రధానంగా వినియోగదారులు గతంలో మాదిరి వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఫిర్యాదు చేయాలనే నిబంధనను తొలగించారు. ఈ- మెయిల్ ద్వారా ఎక్కడి నుండైనా అమ్మకం దారుడు, మధ్యవర్తి, ఉత్పత్తిదారుడు ముగ్గురిపైనా కేసులు వేయవచ్చు. ఆ ఉత్పత్తిని ఎవరైనా ప్రోత్సహిస్తూ ప్రచారం పాల్గొంటే అటువంటి ప్రముఖుడిపై కూడా కేసు నమోదు చేసే అస్త్రాన్ని వినియోగదారుల హస్తంలో పెడుతున్నారు. సేవల రంగంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని చేర్చడంతో పాటు వినియోగదారులను జాగృత పరచడానికి, అవగాహన పెంచడానికీ , ఉత్పత్తిదారుల్లో అప్రమత్తతకు బిల్లు చట్టరూపం దాలిస్తే ఎంతో తోడ్పడుతుంది. కొత్త బిల్లును 8 చాప్టర్లతో 107 క్లాజులతో రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వినియోగదారుల రక్షణ మండళ్ల ఏర్పాటును చాప్టర్-2లో వివరించగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కేంద్ర సంస్థ ఏర్పాటు గురించి చాప్టర్-3లో వివరించారు. విధి విధానాలు, నియామకాలు, పరిశోధన విభాగం, తనిఖీ, స్వాధీన అధికారం, ఉత్పత్తులను వెనక్కు తీసుకునేలా ఆదేశించే అధికారాలను ఈ అధ్యాయంలో పేర్కొన్నారు. ‘వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్’ ఏర్పాటు గురించి అధ్యాయం-4 లో క్లాజు 28 నుండి 73 వరకూ వివరించారు. అత్యంత కీలకమైన వినియోగదారుల సమస్యల పరిష్కార మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటు గురించి అధ్యాయం-5 పేర్కొంది. ఉత్పత్తుల లోపాలపై అధ్యాయం-6లోనూ, వివిధ పొరపాట్లు, తప్పులకు, తప్పుదారి పట్టించే ప్రయత్నాలకు అధ్యాయం-7లో శిక్షలను పేర్కొన్నారు. అధ్యాయం-8లో మిగిలిన ఇతర అంశాలను జోడించారు. ఆన్‌లైన్‌లో విక్రయించిన వస్తువులు సక్రమంగా లేకున్నా, ప్రచారకర్తలు తప్పుడు ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని అందించినా, టిక్కెట్లు, హోటల్ గదులు, బుకింగ్ పోర్టళ్లు సవ్యమైన రీతిలో వ్యవహరించకపోయినా చివరికి బిల్లు ఇవ్వకున్నా, రశీదు ఇవ్వకున్నా, వస్తు మార్పిడికి ఉన్న 30 రోజుల వ్యవధిలో వినియోగదారుడి డిమాండ్‌ను అంగీకరించకున్నా, వినియోగదారుడి వివరాలను అవసరం లేని చోట వెల్లడించినా ఆయా సంస్థలు ఇరుకున పడటం ఖాయం.
‘కాంట్రాక్టు’ అంటే ఏమిటో ఆరు పదాల్లో ఈ కొత్త బిల్లులో చేర్చారు. గతంలో లేని చాలా నిబంధనలను ఇందులో పొందుపరిచారు. వినియోగదారుల సమస్యలపై కోటి రూపాయల గరిష్ట మొత్తానికి సంబంధించిన కేసులను జిల్లా స్థాయిలోనే పరిష్కరించవచ్చు. 10 కోట్ల రూపాయల వరకూ రాష్ట్ర స్థాయిలోనూ, 10 కోట్లకు పైబడి జాతీయ స్థాయిలోనూ పరిష్కరించే వీలు కల్పించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వినియోగదారుల సంక్షేమ మండళ్ల నియామకాల్లోనూ స్వల్ప మార్పు చేశారు. ఈ-కామర్స్, ఆన్‌లైన్ కొనుగోళ్లనూ కొత్త బిల్లు పరిధిలోకి తీసుకురావడమే గాక, కోర్టుల ఆర్థిక పరిధిని ఐదు రెట్లు పెంచడం పెద్ద ఉపశమనం.
శరవేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ కొనుగోళ్లలో వినియోగదారుడు కొనుగోలు చేసింది ఒకటైతే, చేతికి ఇంకొకటేదో చేరే ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చివరికి సెల్ ఫోన్లు ఆర్డర్ ఇస్తే మట్టి రాళ్లు కవర్లలో వచ్చిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. వినియోగదారుడు ఈ-కామర్స్ పోర్టల్‌కు డబ్బు చెల్లించాక వస్తువును ఉత్పత్తి దారుడు వినియోగదారునికి చేరవేస్తాడు. ఈ క్రమంలో మొసపోతున్న వినియోగదారుడి ఆక్రందన వినే పరిస్థితి నేడు లేదు. తాజా బిల్లు ప్రకారం అమ్మకం దారుడు ఏ ప్రాంతం వారైనా వినియోగదారుడు మాత్రం ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు. ఈ-మెయిల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది లేదా తాను ఎక్కడ ఉన్నాడో అదే ప్రాంతంలోని వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఈ- కామర్స్ సంస్థలు తమ వ్యాపార వివరాలు, విక్రయసంస్థతో ఉన్న ఒప్పందాలను వినియోగదారుల వివరాలను ఎలా వినియోగించుకున్నారనేది వెల్లడించాల్సి ఉంటుంది.
ఇంతవరకూ ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుడి కీ, విక్రయదారుడుకీ మధ్యలో వారధిగా మాత్రమే వ్యవహరించేవి. కొత్త బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత ఇవి సేవలు అందించే సంస్థలుగా మారాల్సి ఉంటుంది. ఇంత వరకూ ఉత్పత్తులపై తయారీదారులకే మాత్రమే బాధ్యత ఉండేది. ఇకపై వాటి ప్రచారానికి పూనుకున్న వారు కూడా బాధ్యులవుతారు. ఎవరైనా తప్పు దారి పట్టించే ప్రకటనలు రూపొందిస్తే ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లినా లేదా వినియోగదారుడి ఆరోగ్యం దెబ్బతిన్నా, అటువంటి ప్రచారకర్తలకు రెండేళ్ల వరకూ జైలు శిక్ష, 10 లక్షల వరకూ జరిమానా ఉంటుంది. నేర తీవ్రత ఆధారంగా 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, 30 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. అయితే, ప్రచారకర్తలు ఆయా ఉత్పత్తులను వినియోగించి రుజువు చేసుకున్నట్టయితే ఈ జైలు శిక్షల నుండి మినహాయింపు లభిస్తుంది. తయారీ సంస్థలు, సేవాసంస్థలు మార్కెట్‌లోకి తెచ్చిన ఉత్పత్తులతో ఇబ్బంది పడిన, నష్టపోయిన వినియోగదారులందరికీ ఉపశమనం కల్పించేందుకు కొత్తబిల్లు రక్షణ కల్పిస్తుంది. కాగా, కొత్త బిల్లులో కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిని చట్ట రూపకల్పనలోనూ, శాసనంగా తెచ్చినపుడు ఇచ్చే నిబంధనల్లో సవరించుకునే వీలులేకపోలేదు.

-బీవీ ప్రసాద్ 98499 98090