మెయిన్ ఫీచర్

రంగురంగుల బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ అమ్మాయిని పొగడాలంటే బంగారు బొమ్మలా ఉంటుందని పొగుడుతారు. అలాగే ఓ అమ్మాయి శరీర ఛాయ గురించి చెప్పాలంటే పసిడి ఛాయలో మెరిసిపోతోంది అని చెబుతారు. కారణం స్వచ్ఛమైన బంగారం పసుపుపచ్చని రంగులో మెరుస్తుందని అందరూ ఇలాంటి విశేషణాలను వాడతారు. కానీ భవిష్యత్తులో ఇలాంటి విశేషణాలు వాడాలంటే ఆలోచించాల్సిందే.. ఎందుకంటే బంగారం పసుపు ఛాయతో పాటు తెలుపు, గులాబీ రంగులతో పాటు ఆకుపచ్చ, ఎరుపు, ఊదా, నీలం, నలుపు రంగుల్లోనూ లభించబోతోంది. ఇలా లభిస్తే చాలు నేటి యువత రోజుకో డ్రెస్ వేసుకున్నట్లే బంగారాన్ని కూడా రోజుకో రంగులో, డ్రెస్‌కి మ్యాచింగ్‌గా ధరిస్తారేమో.. ఒకప్పుడు ఆడవారు బంగారం కూడా రంగురంగుల్లో లభించవచ్చు కదా అనుకునేవారు. ఇప్పటికి వారి కోరిక పూర్తిస్థాయిలో నెరవేరిందనే చెప్పాలి. పాశ్చాత్యదేశాల్లో రోజ్, వైట్‌గోల్డ్ నగల్ని ధరించడం ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా రష్యన్లకి రోజ్‌గోల్డ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల పెళ్లి ఉంగరాలు, వాచీలు తెల్లగానో, గులాబీ రంగులోనో మెరుస్తుంటాయి. గులాబీ, తెలుపు, పసుపూ మూడు రంగుల్ని కలగలిపి చేసినవన్నా వాళ్లకెంతో మోజు. ఈమధ్య వాటితో పాటు ఆకుపచ్చ నగల్నీ ధరించడం నేడు సరికొత్త ట్రెండుగా మారింది. బంగారంలో ఆ రంగు చూశాక జువెలరీ సంస్థలకు మరిన్ని రెక్కలొచ్చాయి. ఫలితంగా బంగారం ఎరుపు, నలుపు, ఊదా, నీలం రంగుల్లోనూ మెరుస్తోంది. స్వచ్ఛమైన బంగారం పసుపుపచ్చగానే ఉంటుంది. కానీ దాన్ని ఆభరణాల రూపంలో వాడలేం. అందుకే అందులో కాడ్మియం లేదా రాగి లేదా ఇండియం వంటి లోహాలను కొద్దిపాళ్లలో వెండినీ కలిపి నగలు చేస్తుంటారు. అలాకాకుండా రాగిశాతాన్ని 20 నుంచి 65 శాతం వరకూ పెంచి చేసేదే రోజ్‌గోల్డ్.. ఆ రాగి శాతాన్ని బట్టి అది గులాబీ, ముదురు గులాబీ, ఎరుపు, నారింజ, ఎరుపు రంగుల్లోకి మారుతుంది. దీనే్న పింక్ లేదా రెడ్ గోల్డ్ అని అంటారు. అదే వైట్‌గోల్డ్ కోసం అయితే రాగి, జింక్‌లతో పాటు నికెల్ లేదా పల్లాడియం, వెండి లోహాల్ని కలుపుతారు. ఇక బంగారాన్ని ఆకుపచ్చని బంగారంగా మలచి ధరించడం మనకు తెలిసిందే.. క్రీస్తుపూర్వమే ఆకుపచ్చని బంగారం వాడుకలో ఉంది. క్రమంగా ఇది మరుగున పడిపోయినా నేడు మళ్లీ ప్రాచుర్యంలోకి రావడంతో ఆకుపచ్చని నగలు తళుక్కుమంటున్నాయి. 75 శాతం బంగారానికి 23 శాతం వెండి, రెండు శాతం కాడ్మియం కలిపి చేసేదే ఆకుపచ్చని బంగారం. ముదురాకుపచ్చలోకి బంగారం మారాలంటే మాత్రం 15 శాతం వెండి, ఆరు శాతం కాపర్, నాలుగు శాతం కాడ్మియం కలుపుతారట. ఇక నీలి బంగారం కోసం తగుపాళ్లలో ఐరన్ లేదా ఇండియం కలిపితే, వంకాయ లేదా ఊదా రంగు బంగారం కోసం అల్యూమినియం కలుపుతున్నారు. ఇన్ని రంగు బంగారం వచ్చాక నలుపురంగు బంగారం రాకపోతే ఎలా? పైగా చాలామంది ఫ్యాషన్ ప్రియులకు నలుపురంగు అంటే చాలా ఇష్టం. అందుకే 75 శాతం బంగారానికి 25 శాతం కోబాల్ట్ కలిపి బ్లాక్ గోల్డ్‌ను చేసేస్తున్నారు. లేదంటే వైట్ గోల్డ్‌కి రోడియం ప్లేటింగ్ ద్వారా నలుపురంగును అద్దేస్తున్నారు. ఇది నిజంగానే ఫ్యాషన్ ప్రియుల మనసులను దోచుకుంటోంది. ముఖ్యంగా బ్లాక్ రింగ్స్ పశ్చిమ దేశాల్లో యువత హాట్ ఫేవరేట్‌గా మారాయి.. మరి మీరు కూడా ట్రై చేస్తారా.. రంగురంగుల బంగారు ఆభరణాలు..