మెయిన్ ఫీచర్

శ్రీచక్రము-మానవశరీరము (పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము-మానవశరీరము
ప్రతులకు:
H.No. 7-8-51, Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, సెంట్రల్ కాలనీ ఫేజ్ -2, హస్తినాపురం, హైదరాబాద్- 500079
=============================================================
సాధకుడిలో అహంభావం (నేను అనే భావం) కొద్దిగా మిగిలే ఉంటుంది. అందువల్ల అనిర్వచనీయమైన దివ్యదర్శనం లభిస్తున్నప్పటికీ, ఆ దివ్యాత్మతో తాదాప్యత పొందలేడు.
ఇక అన్నిటికంటే పైనున్న, 7వ దైన సహస్రార చక్రం, బ్రహ్మరంధ్రంపైన మనసు తదేకంగా ధ్యాననిమగ్నమైనపుడు, అంటే కుండలిని శక్తి సహస్రారానికి చేరినపుడు, సమాధి స్థితి కలుగుతుంది. అపుడు బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమును పొందగలుగుతాడు సాధకుడు.
ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక వ్యక్తికి, విశేషమైన ప్రజ్ఞ లేక జ్ఞానం కలిగిందంటే, తత్సంబంధమైన చక్రాలలోనికి సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి కొద్దిగా ప్రవేశించిందని తెలుసుకోవచ్చు. కుండలిని యోగానికి చెందిన శ్రీవిద్య ఉపాసన చాలా నియనిష్ఠలతో, శుచి శుభ్రతలతో, రహస్యంగా అభ్యసించవలసి వుంటుంది. అందుచే దీనిని గుప్తవిద్య అని కూడా అంటారు. ఇది మిగతా ప్రాపంచిక విద్యలవంటిది కాదు. ఈ విద్యను గురించి కులార్ణవ తంత్రము అను గ్రంథమునందు ఈ క్రింది విధంగా చెప్పబడింది.
కుండలిని వర్ణములు (అక్షరములు)
మన శరీరమందలి కుండలిని శక్తి 50 వర్ణములు లేక శబ్దములుగా వ్యక్తమగుచున్నది. మనిషి అక్షరములను ఉచ్ఛరించగలడు కాని జంతువులు పశుపక్ష్యాదులు అక్షరములను పలుకలేవు. భాష ద్వారా భావాన్ని వ్యక్తీకరించడము సృష్టిలో ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. ఇది మనిషికి ఆ భగవంతుడిచ్చిన వరం. ఆ విధముగా 50 వర్ణములు ఒక కూటమిగా అర్ధవృత్తి కుండలినిగా భావిస్తే, అట్టి రెండు అర్ధ వృత్తములు ఒక వృత్తముగా నేర్పడును. అట్టివి 10 చుట్లు (వృత్తములు) ఒక సమాహార ప్రజ్ఞగా (అంటే వెయ్యి అక్షరములు (10తి2తి50) లేక శబ్దములు) శిరస్సునందలి, సహస్రారమునందు ఏర్పడుచున్నది. ఈ పదియు పరమాత్మయొక్క విభూతులు లేక అవతారములుగా అంటే మత్స్యావతారము నుండి, కల్కి అవతారము వరకు పరిపూర్ణ, అంతర్యామి ప్రజ్ఞావికాసముగా భావించవచ్చును. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏకకణజీవి అగు ‘అమీబా’నుండి మొదలైన పరిణామక్రమం, అంతర్యామి స్థితివరకు ఎదిగిన 10 స్థితులకు సూచిక.
మన పూర్వీకులు అక్షరమాలను కేవలము భాషాపరమైన పదముల కూర్పుగానేకాక, వాటి ఉత్పత్తి స్థానములను, వాని వెనుకనున్న శక్తులను, అధి దేవతలను కూడా ఎంతో పరిశోధన చేసి తెలుసుకున్నారు. అట్టి క్రమాన్కొకసారి పరిశీలిద్దాము. పైన చెప్పిన 50 వర్ణములు 3 భాగాలుగా విభజించారు. 1. చంద్రఖండము, ఇందు ‘అ’నుండి ‘అః’వరకు గల 16 అక్షరములు కలవు. 2. సౌర ఖండము, ఇందు ‘క’నుండి ‘్భ’వరకు గల 24 అక్షరములు కలవు. 3. అగ్నిఖండము ఇందు ‘మ’నుండి ‘క్ష’వరకు గల 10 అక్షరములు. వీనిలో అచ్చులను స్వరములుగా, హల్లులను వర్ణములుగను చేసిరి. వీనిలో ఒక్కొక్క వర్గమునకు అధి దేవతలను కూడా తెలిపారు.
1. స్వరములు (16) ‘అ’నుండి ‘అః’వరకు గల అక్షర సముదాయమునకు అధిదేవత ‘‘వసిని’’. ఈమె మనయందు వశ పరచుకొను శక్తిగా పనిచేయును.
ఈ అక్షరములను ఒక పద్ధతిలో బీజాక్షరములుగా న్యాసముచేసి ‘‘వశిని’’శక్తిని మేల్కొలప వలెనని తెలిపిరి.
2. ‘‘క వర్గము’’‘‘క’’నుండి జ’’వరకు గల 5 అక్షరములకు అధిదేవత ‘‘కామేశ్వరి’’ ఈమె మనయందు కోరికగా మేల్కొనును.
3. ‘‘చ వర్గము’’ ఇందు ‘‘చ’’నుండి ‘ఞ’వరకు గల అయిదు అక్షరములు అధిదేవత ‘‘మోదిని’’ ఈమె జీవునియందు సంతోషమును వ్యక్తముచేయు దేవతాశక్తి.
4. ‘‘ట వర్గము’’ ఇందు ‘‘ట’’నుండి ‘‘ణ’’వరకు గల అయిదు అక్షరముల సముదాయము. అధిదేవత పేరు ‘‘విమల’’ఈమె మనయందు మలినములను తొలగించు శక్తి.
5. ‘‘త వర్గము’’ ఇందు ‘‘త’’నుండి ‘‘న’’వరకు గల అక్షర సమూహమునకు అధిదేవత ‘‘ఆరుణ’’ఈమె మనయందు ‘‘కరుణ’’ను మేల్కొలుపు శక్తి.
6. ‘‘ప’’వర్గము ఇందు ‘‘ప’’నుండి ‘‘మ’’వరకు గల అయిదు అక్షరములకు అధిదేవత ‘‘జయిని’’ ఈమె వాక్కుద్వారా యితరులను శాసించి జయమును చేకూర్చు శక్తి.
7. ‘‘య,ర,ల,వ’’ అను నాలుగు అక్షరముల సముదాయమునకు అధిష్టాన దేవత ‘‘సర్వేశ్వరి’’ ఈమె స్వరమునకు అధిష్టాత్రియై శాసించు శక్తి.
8. ‘‘శ’’నుండి ‘‘క్ష’’వరకు గల అయిదు అక్షరముల సమూహమునకు అధిదేవతను ‘‘కాళి’’ అంటారు ఈమె కాల (కాలము) శక్తి.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014