మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

55.శ్రీరాముడు, సీత, లక్ష్మణుడును వనములబడి పోవుచుండిరి. రాముడు ముందును సీత నడుమన లక్ష్మణుడు వెనుకను నడచుచుండిరి. శ్రీరామచంద్రుడు నెల్లప్పుడును చక్కగా నవలోకింపవలయునని లక్ష్మణుని యభిలాష. కాని తనకును శ్రీరామునకును నడుమ సీత యుండుటచే లక్ష్మణుడు అటుల అవలోకింపజాలడయ్యెను. అప్పుడతడు కొంచెం ప్రక్కకు తొలగుమని యామెను ప్రార్థించెను. ఆమె యటుల తొలగినంతనే లక్ష్మణుడు తన కోర్కె ఫలింప శ్రీరామచంద్రుని కన్నులార గాంచగల్గెను. ప్రపంచమున బ్రహ్మము, మాయ, జీవుడు ననువాని స్థితి యిట్టిది. మాయచే గలిగిన భ్రాంతి తొలగని జీవుడు దేవుని గనజాలడు, నరునకు నారాయణుని దర్శనము కాదు.
56.ఒక మహాత్ముడు చిత్రవర్ణ ప్రదర్శనియగు గాజు కడ్డీని గాంచి చిరునవ్వు నవ్వుచుండెడివాడు, కారణమేమనగా, అందుండి ఎరుపు, పసుపు, నీలము మొదలగు వివిధ వర్ణములు అతనికి గానవచ్చుచుండెడివి. ఈ రంగులు వట్టి బూటకములని గ్రహించిన యాతడు ఈదృశ్య ప్రపంచము సైతము అటులనే బూటకమని గ్రహించి తనలో తాను నవ్వుకొనెడివాడు.
57.హరి (యను బాలుడు) సింగపుదలను తగిలించుకొనునప్పుడు నిజముగా భయంకరముగా గాన్పించును. తన చెల్లెలు ఆడుకొను తావును బోయి యాతడు పెడబొబ్బ పెట్టును. కాని చెల్లెలు అదిరిపడి యా భయంకర మృగము బారినుండి తప్పించుకొనిపోవు యత్నమున కెవ్వుమనును. కాని భయకంపితయైయున్న ఆబాలిక, హరి తన వేషమును తీసి వేయగనే ఆతడు తన ప్రియసోదరుడే అని గుర్తించి ‘‘ఓహో! మా అన్నయ్యయే!’’ అని వాని చెంతకు పరుగెత్తును. మానవులందరి విషయము కూడా నిట్టిదే. అచింత్యమైన మాయాశక్తి మఱగున నున్నది బ్రహ్మము. ఐనను ఈ మాయచే భ్రాంతికి లోనై లోకులు సర్వ విధమైన చేష్టలను చేయుచుందురు. కాని బ్రహ్మమునుండి మాయ యను తెర తొలగింపబడినపుడు నరునకు అతడు చండశాసనుడగు ఈశ్వరుడుగా గాన్పింపడు, అత్యంత ప్రియుడగు అంతరాత్మయై పరగును.
58.భగవంతుడు సర్వవ్యాపియగునేనిమనకేల కాన్పింపడు? పాచిపట్టిన కోనేటి యోక్క గట్టుననుండి చూచితివేని నీకు అందు నీరు ఉన్నట్లే కాన్పింపదు. నీటిని జూడదలతువేని పాచిని తొలగింపవలయును. మాయావృతమైన కన్నులతో జూచుచు, భగవంతుడు కాన్పించుటలేదని మొఱలిడుచున్నావు. భగవంతుని జూడ గోరుదువేనినీ కన్నులనుండి మాయ అను పొరను తొలగించుకొనుము
59.మబ్బు సూర్యునావరించు రీతిని మాయ బ్రహ్మము నావరించియున్నది. ఈ మాయామేఘము తొలగినంతనే బ్రహ్మను సూర్యుడు మరల కాన్పించును.
60.రాజహంస నీరు కలిగియున్న పాలనుండి నీటిని వేరు చేసి పాలను మాత్రమే గ్రహించును. ఇతర పక్షులిటుల చేయజాలవు. భగవంతుడు మాయతో సమ్మిశ్రీతుడై యున్నాడు. సామాన్య మానవులు మాయను వేరుపరిచి భగవంతుని గనజాలరు. పరమహంసలు మాత్రము మాయను విసర్జించి శుద్ధబ్రహ్మమును గ్రహింపజాలుదురు.
61.తననుగని పట్టినంతనే దొంగ పారిపోవు రీతిని మాయాతత్త్వమును నీవు గ్రహించినంతనే మాయ నివర్తించును.
మోక్షహేతువగు విద్యామాయ
62.భగవంతునియందు విద్యామాయయు అవిద్యా మాయయు కూడా కలవు. విద్యా మాయ నరుని భగవంతుని వైపునకు మరల్చును. అవిద్యామాయ నరుని బ్రహ్మమార్గమునుండి విముఖుని జేయును. కారుణ్యము, జ్ఞానము, భక్తి, వైరాగ్యము- ఇవన్నియు విద్యమాయా స్వరూపములు. వీని మూలమున మాత్రమే నరుడు నారాయణుని బొందగలుగును.
63.బ్రహ్మసాక్షాత్కారమును గలిగించునది మాయయే. మాయ యొక్క తోడ్పాటు లేనిపక్షమున ఎవ్వరు బ్రహ్మ సాక్షాత్కారమును బొందగలరు? శక్తిని (అనగా భగవంతునియొక్క సృజనాది రూపమగు మాయాశక్తిని) దర్శింపకుండ భగవంతుని గనజాలము.
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి