మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామ కాంచన మోహాగ్ని చల్లారిననే కాని భగవద్దర్శనము కానేరదు.
87.తీవ్ర వైరాగ్యము పూని యొక్కసారి భగవద్దర్శనము పొందినంతనే అత్యంత బలీయమగు మోహపాశములు విచ్ఛిన్నమైపోవును. అట్టివానికిక భార్యవలననైనను ఇటు నటు అసమమైన రెండు సూదంటు రాళ్లున్నయెడల వానిలో ఏది దానిని విశేష బలముతో నాకర్షించును? వానిలో పెద్దదియే కదా? భగవంతుడే ఈ పెద్ద సూదంటురాయి. అపుడు చిన్నసూదంటు రాయి వంటి స్ర్తి అందులకు వ్యతిరిక్తముగా ఏమి చేయగలదు?
88. పాములు విషజంతువులు గదా? నీవు వానిని పట్టుకొనబోయినయెడల తప్పక నిన్ను కరచును. కాని, మన్ను మంత్రించి వానిపై జల్లి వానిని వశమొనర్చుకొన నేర్చినవానికి పాములను బట్టుకొనుట అంత కష్టమైన పని కానేరదు. ఏడెనిమిది పాములను సైతము అతడు చేతులకును మెడకును జుట్టుకొని వానితో పాములను సైతము అతడు చేతులకును మెడకును జుట్టుకొని వానితో ఆటలాడగల్గును. (అదేవిధముగా బ్రహ్మ సాక్షాత్కారము నొందినవాడు సంసార భయమునుండి విముక్తుడగును.)
89.ఒక మార్వాడీ పెద్దమనుష్యుడొకనాడు శ్రీరామ కృష్ణుని సందర్శించి కొన్ని వేల రూపాయలను సమర్పింప దనకు అనుజ్ఞనీయుడని వేడుకొనెను. అతడెట్టి సదుద్దేశము కలిగియున్నను శ్రీగురుదేవుడు ఖండితముగా వలదని చెప్పి దానిని స్వీకరింపడయ్యెను. ‘‘నాకు డబ్బుతో నెట్టి సంబంధము నుండరాదు. దానిని స్వీకరించితినా, నా మనస్సు ఇక సదా దానిమీదనే నిలిచియుండును’’ అనెను. అంత నా పెద్దమనుష్యుడు, సొమ్ము శ్రీరామకృష్ణుని సేవకు వినియోగపడుటకై అతని బందుగులలో నొకరి పేర నుంచెదననెను. శ్రీరామకృష్ణుడిట్లు బదులు చెప్పెను. ‘‘వలదు, అది కపటమైన పని. ఇంతేకాక దానిచే ఒకరి దగ్గర నా సొమ్ము, ఉన్నదను భావము సదా నా మనస్సులో గలుగుచుండును’’.
అప్పుడును ఆ మార్వాడీ ఊరకుండక, ‘‘మనస్సు తైలము వంటిదై యున్నయెడల కామినీ కాంచనములను సాగరముపై తేలయాడగలదు’’’ అను శ్రీరామకృష్ణుని వచనములనే యుదాహరించి తన కానుక నంగీకరింపుడని పట్టుపడెను.
అంత శ్రీరామకృష్ణుడిట్లు సమాధానమొసగెను: ‘‘ఆ మాట నిజము. కాని ఆ చమురే చాలా కాలము నీటిపైని తేలిచుండినయెడల మురుగెత్తునుకదా! అటులనే కామినీ కాంచనములను సాగరముపైని ఊరక తేలుచున్నను గూడ దానితో చిరకాలము నిరంతరమైన సంసర్గము కలిగెనా, మనస్సు క్రుళ్లి కంపుకొట్టును’’.
కాంచన మోహమును జయించుటెట్లు?
90.కాంచన మోహము, లేక ధనరాగము సాధకుని ధర్మ మార్గమునుండి పెడత్రోవ త్రొక్కించునని తెలుపుచు శ్రీగురుదేవుడు యువకుడగు నొక శిష్యుని జూచి యొకప్పుడిట్లు పలికెను: ‘‘ లౌకికునివలె- పామరునివలె- నీవు డబ్బు పుచ్చుకొని ఉద్యోగము చేయనారంభించినావు. కాని నీ తల్లి నిమిత్తము నీవు పాటుపడుచున్నావు. లేనియెడల, చీ చీ! చీచీ యని యుందును’’. పదే పదే యిట్లని తుదకు, ‘‘్భగవంతుని దప్ప మరెవ్వరిని సేవింపకుము’’ అనియెను.
91.డబ్బుకోసం ఉద్యోగము చేయుట యెట్టి పతనహేతువో తెలుపుచూ శ్రీ గురుదేవుడొకప్పుడొక శిష్యునకిట్లనియెను: ‘‘వానిమొగ మెట్లు కళావిహీనమైన యున్నదో కనుడు. నల్లని పొర వాని మొగము నావరించినట్లున్నది. ఇది యంతయు ‘ఉద్యోగ మహాత్మ్యము’. జమా ఖర్చు లెక్కలు, మరి యిట్టి వేయి విషయములలో అతడు మునిగితేలుచుండును’’.
92.్ధనము మనుష్యుని స్వభావమునే మార్చివేయునట్టి ఉపాధి. దాని ప్రభావము యిట్టిదని చెప్ప నలవికాదు; ఎవ్వడైనను ధనవంతుడైనంతనే వాని నైజము పూర్తిగా మారిపోవును. ఎంతయో వినయ విధేయతలుగల బ్రాహ్మణుడొకడు ఇచటికి (దక్షిణేశ్వరమునకు) తరచుగా వచ్చుచుండెడివాడు. కొంతకాలమునకు అతడిచటికివచ్చుట మానివేసెను.వాని సంగతి సందర్భములేవియు మాకు దెలియలేదు. ఒకనాడు మేము కొన్నగరమునకు పడవనెక్కి వెడలితిమి. మేము పడవ దిగుచు, గంగానది యొడ్డున గూర్చుండిన యా బ్రాహ్మణుని జూచితిమి.
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి