మెయిన్ ఫీచర్

సామాన్యులకు దగ్గరవుతా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సే సినిమాలో ఛయ్యా..్ఛయ్యా అంటూ షారూఖ్‌ఖాన్, మలైకా అరోరాఖాన్ కలసి రైలుపై వేసిన చిందులు ఆనాడు యువతను ఉర్రూతలూగించాయి. మైహునా..పెహ్లానషా అంటూ అందరి నోళ్లలో ఇప్పటికీ నానుతున్న ఈ పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న ఫరాఖాన్ నేడు బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నది. ఇప్పటికే బాలీవుడ్‌లో సెలబ్రిటీ అయిన ఫరాఖాన్ బుల్లితెరపైకి వస్తే ఇమేజ్ దెబ్బతింటుందని భయడపటం లేదు. సామాన్య ప్రేక్షకులకు సైతం దగ్గరవ్వాలంటే.. వారి అభిమానాన్ని సంపాదించాలంటే బుల్లితెరే సరైన వేదిక అని అంటుంది. వెండితెరపై పనిచేస్తుండగానే అధిక శారీరక బరువుతో బాగా లావైన ఫరాఖాన్ ఒక్కసారిగా పదికిలోల బరువు తగ్గించుకుని ఈసారి బుల్లితెరలో తన సత్తా చాటుకునేందుకు ముందుకు వస్తోంది.
నేడు బుల్లితెర ఎవ్వరికైనా పేరు, డబ్బు తెచ్చిపెడుతుం ది. ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ‘‘జలక్ ధిఖ్లా జా’’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా ఆ మె వ్యవహరించనున్నారు. ఇలా సన్న గా నాజుగ్గా ఎలా తయారయ్యారంటే ఆస్ట్రియాలోని వివమ్యార్ వెళ్లి చికిత్స చేయించుకున్నాను. వారు తొలుత రక్త, కిడ్నీ పరీక్ష లు చేసిన తరువాత వారిచ్చిన డైట్ సల హా మేరకు ఆహారం తీసుకోవటం వల్ల ఒక్కసారిగా 10కిలోల బరువు తగ్గానని వెల్లడించింది. తొలుత ఆదిత్యాచోప్రా సలహా ఇచ్చినపుడు ఆ సలహా పాటించలేదనని, తరువాత పరిణితి చోప్రాను చూసిన తరువాత అక్కడకు వెళ్లి చికిత్స చేయించుకున్నానని వెల్లడించింది.
ప్రయాణాలంటే ఇష్టం..
నా పిల్లలతో కలసి ప్రపంచమంతా తిరగాలనిపిస్తోంది. పదేళ్ల తరువాత నా పిల్లలు 18ఏళ్ల ప్రాయానికి వస్తారు. అపుడు వారితో కలిసి ఆనందంగా ప్రపంచమంతా చుట్టేస్తానని చెబుతోంది. ఈ సందర్భంగా నేను ఏదైతే చూస్తానో దానినే నా షోల్లో చూపిస్తాను అని పేర్కొంది.
పిల్లల కోసం సినిమా తీస్తా
నా పిల్లల కోసం సినిమా తీస్తాను. అందులో ఇద్దరు అమ్మాయిలను పెట్టి మంచి సందేశాత్మక సినిమా తీయాలని ఉందని చెబుతోంది. చిత్రనిర్మాణానికి భగవంతుని ఆశీస్సులు ఎంతో అవసరం. భర్త శిరీష్ కుందేర్ ‘ కీర్తి’ అనే షార్ట్ ఫిలిమ్ నిర్మించిన సందర్భంగా తలెత్తిన వివాదాలు గురించి ప్రశ్నిస్తే కొంతమంది కావాలనే అతనిని తొక్కెయ్యాలని చూశారు. కాని భగవంతుడు, ప్రేక్షకులు నమ్మటంతో ఆ వివాదాల సుడిగుండంలో నుంచి బయటపడ్డాం అని చెబుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు దాదాపు ఐదు మిలియన్ల మంది వీక్షకులు ఉండటం సంతోషం కలిగిస్తుందని చెబుతోంది.
కొరియోగ్రాఫర్‌గా సాధించింది తక్కువే అయినప్పటికీ, చేసినంత వరకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంటూ.. రాబోయో కాలంలో కొరియోగ్రాఫర్‌గా విభిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నట్లు ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని, సెప్టెంబర్‌లో ప్రకటిస్తానని వెల్లడిస్తోంది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
షారూఖ్‌ఖాన్‌తో చేసిన సినిమాలతో మంచిపేరు వచ్చినప్పటికీ ఆయనతో చేసిన ఒక్కపాటకు మాత్రమే ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. హృత్రిక్ రోషన్‌తో చేసిన రెండు పాటలకు ఫిల్మ్‌ఫేర్ దక్కగా మరో రెండు పాటలకు సైతం ఈ అవార్డులు ఆమె పొందారు. కొరియోగ్రాఫర్‌గా విభిన్న నృత్యరీతులను తనదైన శైలిలో ప్రదర్శించే ఫరాఖాన్‌కు క్లాసికల్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. వానల్లోనూ, గాలిలోనూ ఆడిపాడించే సత్తా ఉన్నా సహజ సిద్ధంగా, సాధారణంగా కనిపించే నృత్య ప్రదర్శనే బాగుంటుందని పేర్కొంది.
టీవీ షోల్లోనే ఆనందం, సరదా, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ లభిస్తున్నాయని, ఎలాంటి ఒత్తిడి లేకుండా కార్యక్రమాలను చేసుకుపోవచ్చని, డబ్బు, పేరు కూడా ఈ బుల్లితెర వల్ల నేడు వస్తుందని పేర్కొంది.
జలక్ ప్రోగ్రామ్‌లో జాక్వెలిన్, ఖరన్ జోహార్, మనీష్‌తో కలిసి కంటెస్ట్‌లో పాల్గొనేవారికి కఠిన పరీక్షలే పెట్టదలచుకున్నామని, దీనివల్ల వారిలో దాగివున్న ప్రతిభ బయటకు వస్తుందని ఆమె తెలియజేస్తోంది. కొరియోగ్రాఫర్‌గా విభిన్న నృత్యరీతులను తనదైన శైలిలో ప్రదర్శించే ఫరాఖాన్‌కు క్లాసికల్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. వానల్లోనూ, గాలిలోనూ ఆడిపాడించే సత్తా ఉన్నా సహజ సిద్ధంగా, సాధారణంగా కనిపించే నృత్య ప్రదర్శనే బాగుంటుందని పేర్కొంది.