మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను చూడగానే అనుగ్రహ సూచకమైన కంఠ స్వరముతో ‘‘ఓహో! ఠాకూరు! క్షేమమా!’’ అని పలుకరించెను. వాని వాలకమును కనిపట్టి నాతో నున్న హృదయునితో నిట్లంటిని: ‘‘హృదయా! చూడుము, వీనికేదియో సంపద చేజిక్కియుండును. వీని వాలకమున నెట్టి మార్పు గలిగినదో చూచితివా?’’ హృదయుడు పక పకనవ్వసాగెను.
93.్ధనము నీకు బువ్వను మాత్రమే ఈయగలదు. ధన సంపాదనమే నీ పరమావధి యనుకొనుము.
94.తన సంపదను, అధికారమును, పేరు ప్రతిష్ఠలను ఆధిక్యమును చెప్పుకొని గర్వపడువారు కొందరుందురు. తుదకివి యన్నియు మూడునాళ్ల ముచ్చటలే కదా! మరణానంతరము వీనిలో వెంట వచ్చుదేదియు లేదు.
95. రెండు సందర్భములలో భగవంతుడు నవ్వును- ఒకటి: అవసాన కాలము సమీపించిన రోగి పడక దగ్గరకు వచ్చి వైద్యుడు వాని తల్లితో, ‘‘ఎందుకు అమ్మా, ఆతుర పడుటకు కారణము ఏమియు లేదు. నీ కొడుకు ప్రాణము రక్షించు భారము నాది’’ అనునప్పుడు. రెండవది: అన్నదమ్ములు తమ భూమిని పంచుకొను నాత్రమున కొలతబద్దెను చేపూని పొలమును కొలుచుచు, ‘‘ఈ భాగము నాది, ఆ భాగము నీది’’ యనుకొనునప్పుడును (్భగవంతుడు నవ్వును).
96.్ధనమును గూర్చి గర్వింపదగినదేమియు లేదు. నేను ధనికుడనందువా, నీకంటె నెందరో విశేష ధనవంతులు కలరు. వారితో బోల్చి చూచినయెడల నీవు వట్టి దరిద్రుడవని చెప్పవలసియుండును. సంజ చీకటులు క్రమ్మగానే మెరుగుడు బురువులుబయలుదేరి ‘‘మేమే ప్రపంచమునకు వెలుగునిచ్చుచున్నాము’’ అని గర్వించును. కాని నక్షత్రములు మినుకు మినుకుమని ప్రకాశింప మొదలిడినతోడనే మెరుగుడు బురుగుల గర్వమడగును. అంత నక్షత్రములు, ‘‘లోకమునంతయు మేమే ప్రకాశింపజేయుచున్నాము’’ అని తలపోయసాగును. కొంచెము సేపైనంతనే చంద్రుడుదయించి తన యమృత కిరణములతో బ్రకాశింప నక్షత్రములు వెలవెలపోవుచున్నవి. ఆ చంద్రుడో, తన కాంతిచే లోకమునంతయు శోభామయము చేయుచున్నానని పొంగుచుండును. ఇంతలో ప్రభాతము తూర్పు దిశను సూర్యోదయ వైభవమును చాటును. అపుడు చంద్రుని ప్రభావమేమైనది?
ధనాధికులమని విర్రవీగు వారు ఈ ప్రకృతి సంఘటనలను అవలోకించి తమ భోగభాగ్యములను గూర్చియు అధికారమును గూర్చియు మిట్టిపడకుందురుగాక.
97.వంతెన క్రింద నెప్పుడును నీరు పారుచు పోవునే కాని యచట మురుగదు.
ఇంకావుంది...