మెయన్ ఫీచర్

అందరి కళ్లూ యూపీపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరు గబోతున్న సమయంలో ఇప్పుడు అందరి దృష్టి ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ వైపే మర లుతున్నది. ఉత్తర ప్రదేశ్ భారత్- భారత్ ఉత్తర ప్రదేశ్ అని తరచూ అంటారు. ఎందుకంటే దేశంలోని 545 నియోజక వర్గాలలో 80 ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడ పట్టు సాధిస్తే గాని కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదు. మన ప్రధాన మంత్రులలో అత్యధికులు ఆ రాష్ట్రం నుండే వచ్చారు. అత్యంత ప్రజాదరణతో ప్రధాన మంత్రి పదవి పొందిన నరేంద్ర మోదీ సహితం తనకు ఆమోదత లభింప చేసుకోవడానికి ఆ రాష్ట్రంలోని వారణాసి నుండి పోటీ చేయవలసి వచ్చింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారునిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవిర్భవిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయడంలో ఆయనే ముందుంటున్నారు. ఒక విధంగా మోదీ ప్రభుత్వ అజెండాపై ఆయన విశేషమైన ప్రభావం చూపుతున్నారు. అయితే ఈ ఇద్దరు నాయకులు సహితం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో పలు ప్రతి కూలతలను ఎదుర్కొంటున్నారు.
దశాబ్దాలకు పైగా రాజకీయంగా బద్ధ శత్రువులుగా వ్యవహరించిన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఇప్పుడు చేతులు కలపడంతో యూపీ రాజకీయ స్వరూపంలో పెను మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ మా ర్పులే రెండు ప్రధాన జాతీయ పక్షాలైన బిజెపి, కాంగ్రెస్‌లను కలవర పరుస్తున్నాయి. గత ఎన్నికలలో 80 సీట్లలో బీజేపీ సొంతంగా 71 సీట్లను గెల్చుకోగా, మిత్ర పక్షం మరో రెండు సీట్లను గెల్చుకొంది. కానీ ఇప్పటి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
అఖిలేశ్ యాదవ్, మాయావతి కలసి మహాకూటమిని ఏర్పాటు చేయడం, తనను వదిలి వేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహానికి ఒక పెద్ద దెబ్బ తగిలినదని చెప్పవచ్చు. కాంగ్రెస్ పారీకి ప్రస్తుతం యూపీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సీట్లను మించి ఇవ్వడానికి అఖిలేశ్, మాయావతి లేదు. గత ఎన్నికలో మొదటి, రెండవ స్థానాలలో ఉన్న ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్ సుమారు 20 సీట్లు కోరుతున్నది. అందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. రాహుల్ గాంధీతో పొత్తు వద్దను కోవడానికి అఖిలేష్, మాయావతిలకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. 2017లో కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకొని తీవ్ర పరాభవానికి గురి కావడాన్ని అఖిలేష్ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు తమ ఎమ్యెల్యే మద్దతు ఇచ్చినా అతనికి మంత్రి పదవి ఇవ్వక పోవడంతో అసహనంగా ఉన్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకొంటే మన ఓట్లు ఇవ్వడమే గాని, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఇతరులకు బదిలీ కారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది. దళిత వర్గాలను తన వైపు తిప్పుకోవడం కోసం రాహుల్ వ్యూహాత్మకంగా అడు గులు వేస్తూ ఉండడం, ముఖ్యంగా యువ దళిత నాయ కులను ఒకొక్క రాష్ట్రంలో ప్రోత్సహిస్తూ ఉండటంతో మాయావతి ఉడికి పోతున్నారు. రోహిత్ వేముల ఉదంతం నుండి దళితులకు సంబంధించి పలు అంశా లపై రాహుల్ ఉద్వేగంగా స్పందించారు. రాహుల్ తో చేతులు కలిపితే దళిత ఓటర్లను తిరిగి కాంగ్రెస్ ఒడ్డుకు చేర్చి, తాను మాత్రం ఒంటరిగా మిగిలి పోవలసి వస్తుం దని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఎస్‌పీ, బిఎస్‌పీ గరిష్టంగా ఎంపీ సీట్లను ఇక్కడ గెల్చుకొని కేంద్రంలో ప్రధాని అభ్యర్థి నిర్ణయంలో నిర్ణయాత్మక పాత్ర వహించాలని అఖిలేశ్, మాయావతి భావిస్తున్నారు. అందుకనే కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పాటు చేసుకొనే నేతలకు జాతీయ స్థాయిలో కూడా వీరు దూరంగా ఉంటున్నారు.
రాహుల్ గాంధీని దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్న మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి నేతల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పైగా కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తేనే తమకు లాభం అని వీరిద్దరూ అవగాహనకు వచ్చారు. ఎందుకంటే బిజెపికి మద్దతుగా ఉన్న అగ్రవర్ణాల వారిని కొంతమేరకు కాంగ్రెస్ చీల్చ గలదని, వారెట్లాగు తమకు ఓట్లు వేయరని భావిస్తున్నారు. పైగా కాంగ్రెస్ ఓటర్లు ఆ విధంగా చేస్తే బీజేపీని కొంతమేర బలహీనం చేయవచ్చని అనుకొంటున్నారు. అదే కాంగ్రెస్ తో తాము చేతులు కలిపితే అగ్రవర్ణాల వారంతా గంపగుత్తుగా బిజెపికి ఓట్లు వేసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో తాము చేతులు కలిపితే- ఆ పార్టీ సంప్రదాయ ఓటర్లు బిజెపికి మారే ప్రమాదం ఉన్నదని మాయావతి, అఖిలేశ్ అంచనా వేస్తున్నారు.
త్రిముఖ పోటీలో తాము యూపీలో 50 సీట్ల వరకు గెలుపొందవచ్చని వీరు అంచనా వేస్తున్నారు. బిజెపి సీట్లు 25కు పరిమితం కావచ్చని, కాంగ్రెస్‌కు రెండు మించి రావని అంచనాకు వస్తున్నారు. ఈ పరిణామాలను గమనించి రాహుల్ గాంధీ సహితం చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అఖిలేశ్,మాయావతిలతో పొత్తుకు సిద్ద పడిన అజిత్‌సింగ్ నాయకత్వం లోని ఆర్‌ఎల్‌డి మూడు సీట్లు అంటే ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నది. కనీసం ఆరు సీట్లు అజిత్ డిమాండ్ చేస్తున్నారు. అజిత్ సింగ్ తో పాటు బిజెపిలో అసంతృప్తితో ఉన్న రాష్ట్ర మంత్రి ఓం ప్రకాష్ రాజభర్ నాయకత్వంలోని సుహాదేవ భారతీయ సమాజ్ పార్టీ, అప్నా దళ్ లను దరి చేసుకొని మూడో శక్తిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. 2014 ఎన్నికలలో ఎస్పీ, బీఎస్పీలకు కలిపి 43.19 శాతం ఓట్లు రాగా, బిజెపికి 43.63 శాతం ఓట్లు వచ్చాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రతిపక్షాలకు మొత్తంగా బిజెపి కన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అందుకనే ఇప్పుడు అఖిలేష్, మాయావతి కలసి ఏర్పాటు చేస్తున్న మహాకూటమిని- బిజెపిని గద్దె దింపడం కోసం కాంగ్రెస్ ఆమోదంతో వేస్తున్న ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడగా కూడా పలువురు భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా వినియోగిస్తూ ఉండడంతో నేరుగా కాంగ్రెస్ తో చేతులు కలిపితే తనను కూడా ఇరికించే అవకాశం ఉన్నాడని మాయావతి ఒకవంక భయపడుతున్నారు. మహాకూటమి కారణంగా బిజెపి ఉత్తర ప్రదేశ్ లో 50 వరకు సీట్లను కోల్పోతే, ఈ మధ్య అధికారం కోల్పోయిన మూడు హిందీ రాష్ట్రాలలో మరో 30 సీట్లను కోల్పోయే అవకాశం లేకపోలేదు. అగ్రవర్గాలలోని పేదలకు 10 శాతం రేజర్వేషన్లు కల్పిం చడం ద్వారా మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రధాన మంత్రి మోదీ ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించారని బిజెపి నేతలు సంబర పడుతున్నా ఎన్నికలలో అదనంగా కలిగించే ప్రయోజనం ఏమేరకు ఉంటుందో చూడవలసి ఉంది.
బిజెపికి సాంప్రదాయసిద్ధంగా మద్దతు దారులుగా ఉంటున్న మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకోవడం కోసమే రిజర్వేషన్ల తాయలాన్ని తెరపైకి రావడం అందరికి తెలిసిందే. అయితే ఈ వర్గాలు 2014లో మొత్తం మీద బీజేపీకే వోటు వేశాయి. మోదీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని, ఆయనను ప్రధాన మంత్రి పీఠం మీదకు తీసుకు వచ్చింది ఈ వర్గాలే. అయితే ఆయన పరి పాలనలో ఎక్కువగా నష్టాలు గురయినదీ ఈ వర్గాలే. అందుచేత వారిలో పెరిగిపోతున్న అసంతృప్తిని కట్టడి చేయడం కోసం ఈ చర్య తీసుకున్నారు. దానితో అదనంగా వచ్చే ఓట్లు ఉండే అవకాశం ఉండదు.
ఇప్పుడు ప్రతిపక్షాలు గతంలో బిజెపికి ఓటు వేసిన వారిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేయడం లేదు. తమ మధ్య ఓట్ల చీలిక నివారించి, బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఓటర్లలో మూడో వంతుకన్నా తక్కువ మంది మద్దతుతో అధికారమలోకి వచ్చిన మోదీ తన పాలనాకాలంలో అదనంగా ఎవ్వరిని దగ్గరకు చేర్చుకోలేక పోయారు. పైగా ఆయనపై కొండంత నమ్మకం పెట్టుకున్న అనేకమందిని తీవ్రంగా నిరాశ పరచారు. ఇటువంటి పరిస్థితులలో ఉత్తర ప్రదేశ్ లలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో జాతీయ రాజకీయాలపై తగు ప్రభావం చూపే అవకాశం ఉంది.
అఖిలేశ్, మాయావతి ఒక వైపు, మరోవంక రాహుల్ గాంధీ వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తే బీజేపీకి వంద వరకు సీట్లు తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే రాజకీయ సమీకరణలు విస్తృతంగా మారే అవకాశం లేకపోలేదు. ఈ సీట్లను ఎక్కడ పూరించుకొని తిరిగి అధికారం కైవసం చేసుకోవాలో ఇప్పుడు బిజెపి ముందున్న అసలు ప్రశ్న. బలమైన మోదీ నాయకత్వం పట్ల బిజెపి నేతలలో ఉన్న అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. 2017లో ఉత్తర ప్రదేశ్ లో గెలుపు కోసం రైతురుణ మాఫీ పథకాన్నీ తానే ప్రకటించి, ఇప్పుడు అదే పథకంతో కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో బిజెపిని గద్దె దింపే సరికి మోదీ తమాయించుకోలేక పోతున్నారు. లాలీపప్ హామీలతో ప్రజలను వంచన చేస్తున్నారని అంటూ విరుచుకు పడుతున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు రేజర్వేషన్లు కల్పించే ఆలోచన ప్రభుత్వానికి లేదని సంబంధిత మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్‌లో చెప్పిన రోజు సాయంత్రమే మంత్రి వర్గం రిజర్వేషన్ల పధకాన్ని తెరపైకి తేవడం గమనిస్తే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారని అనుమానం కలుగుతున్నది. సిబిఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను తొలగించిన తీరు సహితం ప్రధానితో నెలకొన్న అభద్రతా భావాన్ని వెల్లడి చేస్తున్నది. ఈ ప్రభుత్వాన్ని కొన్ని అలౌకిక శక్తులు నడిపిస్తున్నాయా? అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.
అయోధ్యలో రామమందిరం నిర్మాణం గురించి మొత్తం హిందూ సమాజం నిలదీస్తున్న ప్పటికీ పట్టించుకోని ప్రధాని సిబిఐ డైరెక్టర్ విషయంలో మాత్రం కంగారుగా అడుగులు వేయడం దేనిని సూచిస్తున్నది? ఎటువంటి అదృశ్య, స్వార్థపర శక్తులు ఆయనను నడిపిస్తున్నాయి? ఇవే అనుమానాలు నేడు మనలను వెంటాడుతున్నాయి. ప్రధానికి సన్నిహితుడైన ఒక పారిశ్రామిక వేత్తకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రతివాచీ పరచి అనూహ్యమైన రాయితీలు ఇవ్వడాన్ని గమనిస్తే - మన రాజకీయాలపై కార్పొరేట్ శక్తులు నిర్ణయాత్మక ప్రభావం చూపుతున్నాయని భావించవలసి వస్తున్నది.

-చలసాని నరేంద్ర