మెయిన్ ఫీచర్

సమభావానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగాలను ఇచ్చే పండుగ భోగి. నిఘంటువుల అఠ్థం చూసినపుడు భోగి శబ్దానికి తొలినాడు, పండుగ అనే అర్థాలు కనబడుతాయ. ఈ భోగి పండుగ పొద్దునే్న అరిష్ట నివారణ కోసం భోగిమంటలు వేస్తారు. వాటిలో పాతవి, పనికిరానివయిన వస్తువులు వేసి, ఆ పీడ విరగడైనట్లు భావిస్తారు. శ్రీమన్నారాయణుడిని రంగనాథునిగా భావించి అండాల్ అమ్మ ఆచరించిన మార్గళీ వ్రతాన్ని పురస్కరించుకుంటూ ఆ తల్లి పాడిన తిరుప్పావై లోని పాశురాలను వైష్ణావలయాల్లో అనుసంధానిస్తుంటారు. మార్గళివ్రతసమాప్తి రోజున అంటే భోగీపండుగరోజున శ్రీ గోదాదేవి (ఆండాళ్) శ్రీ రంగనాథుని వివాహం చేస్తారు. ఈ రోజున పాలభోగం అని పాలపొంగలి వండి నారాయణునికి నివేదన చేసి బంధువులందరూ కలసి ఆ ప్రసాదాన్ని సేవిస్తారు.
ఈ రోజు తైలాభ్యాంగన స్నానం ఆరోగ్యాన్నిస్తుంది. స్నానపానాదుల తర్వాత భగవదర్శనం మనశ్శాంతినిస్తుంది. సంక్రాంతికి ముందుర నెలరోజులనుంచి మహిళలు అందమైన ముగ్గులు తీర్చిదిద్దుతారు. వాటిమధ్యలో ఆవుపేడతో గొబ్బెమ్మలను తయారుచేసి వాటిని పసుపుకుంకుమలు, తంగేడు, గుమ్మడిపూలతో అలంకరిస్తారు. వాటిచుట్టు కనె్నపిల్లలందరూ ‘‘గొబ్బియలో.. గొబ్బిలయ’’లంటూ పాటలు పాడుతారు. ఆ పాటలలో వారికి అందమైన భవిష్యత్తు ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతారు.
రైతులందరూ తమ తమ వ్యవసాయపు పంటలను ఇంటికి తెచ్చుకొని ఆనందంగా ఉంటారు. ఆ ఆనందాన్ని తమకు తోడ్పడిన కర్మచారులకు, జానపదకళాకారులకు పంచుతూ తాము పండించిన ధాన్యాన్ని వారికి కొంత దానం చేస్తారు. హరిదాసులు, జంగందేవరలు, సన్నాయ మేళం వారు, బుడబుక్కలవారు, గంగిరెద్దుల వారు, పగటివేషగాండ్లు, వీరందరూ గ్రామస్తుల ఇంటి ముంగిటకు వచ్చి వారి వారి సంప్రదాయాలను గుణంగా కళలను ప్రదర్శిస్తారు. వీరికందరికీ మహిళలు వడ్లను, కొత్తబట్టలను దానం చేస్తుంటారు. సాయంత్రం పిల్లల ఆయురారారోగ్యల కోసం వారిని కూర్చోబెట్టి కొత్తబట్టలు తొడిగి, వారికి భోగిపళ్లు పోయడం మన సంప్రదాయం. ఈ భోగిపండ్లల్లో రేగుపండ్లు సూర్యుని ప్రీతి పాత్రమైనవి, బొరుగులు, పేలాలు, చెరుకు ముక్కలు, పటికబెల్ల ముక్కలు, పప్పులు, బెల్లాలు చిల్లర పైసలు ఇవి అన్నీ కలిపి చిన్నపిల్లలపైన పోస్తారు. ఇలా చేయడం వల్ల బాలారిష్టదోషాలు దూరమవుతాయని తెలుగువారి నమ్మకం.
అంతేకాక ఆయుర్వృద్ధీ జరుగుతుంది. సాయంత్రం వేళ పేరంటం చేసి ముతె్తైదువులను పిలిచి వారికినువ్వులు బెల్లంతో చేసిన ఉండలను, నానిన పచ్చిశనగలు పండుతాంబూలాలతోపాటు ఇచ్చి వారి దీవనలందుకుంటారు. కొన్ని చోట్ల బొమ్మల కొలువుకూడా తీర్చడం సంప్రదాయమే.
రేపల్లెల్లో గోపాలకులతో కృష్ణుడు చేసిన గోవర్థన పూజను జ్ఞప్తి తెచ్చుకుని బోగిపండుగరోజు ఇంద్రపూజ చేయడం కూడా ఆచారం.తమిళనాట బాలబాలికలు భోగిమంటల చుట్టు తిరుగుతూ డప్పులను వాయస్తూ ఇంద్రునిపై తమకున్న గౌరవాన్ని తెలుపుతారు. కొన్ని చోట్ల వామనపురాణం కూడా ఈ భోగిరోజు చదివే సంప్రదాయం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గోపూజ విశేషంగా చేస్తుంటారు.
సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యఘడియలివి. ఈరోజునుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. దేవ మార్గం ప్రారంభమయ్యే రోజు. మకర సంక్రమణం అత్యంత ముఖ్యమైనది. ఈ సంక్రాంతివేళ స్నాన- దాన- జప-వ్రతాదులు విశేష ఫలాన్నిస్తాయి. సంక్రాంతి అంటే చక్కగా అడుగు వేయడం అని అర్థం. సూర్యగమనానికి సంబంధించిన మకర సంక్రమణం మకర సంక్రాంతిగా పవిత్రతను సంతరించుకుని పండుగగా జరుపబడుతోంది. లక్ష్యసాధన దిశగా మనం చేసే ప్రతీ ఆలోచనా, మనం వేసే ప్రతీ అడుగూ మనకూ ఇతరులకూ మేలు కలిగించేదిగా ఉన్నపుడు ప్రతి అడుగూ సంక్రాంతే, మనసు విలువ, మనిషి విలువ తెలిసిన మనిషికి ప్రతిక్షణమూ సంక్రాంతి అవుతుంది. ఈరోజున ధాన్యం- ఫలాలు- విసనకఱ్ఱ- వస్త్రం- సువర్ణం కాయగూరలు- దుంపలు- తిలలు- చెఱకు- గోవు మొదలైనవి దానం చేయాలని శాస్త్ర వచనం.సంక్రాంతినాడు శివుని ప్రతిమకు నేతిలో అభిషేకం చేసి, నువ్వు పువ్వులతోనూ, మారేడు దళములతోను పూజించాలి. ధూపదీప నైవేద్యములు సమర్పించి, ప్రార్థన చేసి, ప్రదక్షిణ చేసిన విశేషఫలం కల్గుతుంది.
కనుమ పండుగన వృషభరాజులను అలకరించి వాటికి పొంగళ్ళను పెట్టి పొలంలో పొంగళ్లు చల్లి అటు భూదేవి, గోమాతలను ఇటు వృషభాలు దున్నపోతులను పూజిస్తారు.
కొత్త అల్లుళ్ళ సందళ్ళు, బావామరదళ్ళ పరిహాసాలు, రంగవల్లులు, గొబ్బిపాటలు, సృజనాత్మకతను వెలికితీసి కళలను పరిరక్షిస్తాయి. పితృతర్పణాలు, నోములు, దానధర్మాలు భక్తిని పెంపొందిస్తాయి. గాలి పటాల ఆటలు నైపుణ్యాన్ని పెంచి వినోదాన్ని కలిగిస్తాయి. ఈవిధంగా సంస్కృతితోను, ఆధ్యాత్మికతతోనూ, వేడుకలతోనూ, నైపుణ్యంతోను ముడిపడి వున్న పండగ సంక్రాంతి.

- చివుకుల రామమోహన్