మెయిన్ ఫీచర్

ఐక్యతా భావానికి చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని పండుగలలో ‘సంక్రాంతి’ అతి ముఖ్యమైనది. దీనిని ‘పెద్ద పండుగ’, ‘పెద్దల పండుగ’ అని అంటారు. పెద్దలను స్మరించుకొని, వారికి తర్పణములు, పిండ ప్రదానములు జరిపే రోజు సంక్రాంతి. సం, క్రాంతి- అను రెండు సంస్కృత పదముల కలయికతో ఏర్పడేది సంక్రాంతి. ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే పరివర్తనము. మనిషిలో మంచి పరివర్తనము కలిగించడమే ‘సంక్రాంతి’ పరమార్థము.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోనికి పరివర్తనం చెందే రోజు సంక్రాంతి. మకర సంక్రమణం అని కూడా అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంతో ప్రారంభమయ్యే సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత కలదు. సంక్రాంతి రావడానికి ముందు - నెల రోజులు ‘‘నెలగంటు’’తో ప్రారంభమవుతాయి. అప్పటినుండి పండుగ పనులు ప్రారంభమవుతాయి. ప్రతి యింటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముగ్గులు పెట్టడంలో ఎంతో శాస్ర్తియత దాగి ఉంది. ఖగోళంలో ఆ రోజు నక్షత్రాలు, గ్రహాలు ఏవిధంగా ఉంటాయో, ఆ విధంగా గీయడం ముగ్గులోని అంతరార్ధం. పిండితో పెట్టే చుక్కలు, ఆకాశంలో కనిపించే చుక్కలకు ప్రతీకలు. ఖగోళ శాస్త్ర రహస్యాన్ని ఎనిమిదేళ్ళ ఆడపిల్లకి మొదలు అర్ధమయ్యేలా తెలిసేలా మన ప్రాచీనులు రంగవల్లి విధానంలో యిమిడ్చారు. అంతేకాదు స్ర్తీల్లో చిన్నప్పటి నుంచే సహనం, ఓర్పు అలవడేలా చేయడానికి ఈ ముగ్గులు సహకరిస్తాయ అని అంటారు. ఆ రంగవల్లుల మధ్యలో ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెడ తారు. గొబ్బెమ్మలను గౌరీదేవీగా సంభా విస్తారు. గుమ్మడి, తంగేడులతో అలం కరిస్తారు. పసుపుకుంకుమలు పెట్టి తమఇల్లు పాడిపంటలతో అలరారేలా చేయ మని గౌరీదేవిని వేడుకుంటారు. ధనుసంక్రమణతో ధనుర్మాసం మొదలవుతుంది.
ప్రతి దేవాలయంలోను తిరుప్పావై పాశురాలను అను సంధానిస్తూ గోదాదేవిని శ్రీమన్నారాయణుని పూజిస్తారు. శ్రీరంగనాథుని పూజిస్తారు. అలనాడు గోదాదేవిని చేపట్టిన శ్రీరంగనాథుని స్మరిస్తూ గోదాకల్యాణాలను భోగి పండుగ రోజున చేస్తారు. మరుసటి రోజే సంక్రాంతి కనుక కొత్తకాంతులు తమ ఇండ్లలో వెల్లివిరియాలని దేవుని మొక్కుకుంటారు.
ఈకాలంలోనే రైతన్నలకు పంటలు చేతికి వస్తాయ. ఆ ఆనందంలో తనకు తోడ్పడిన ఇతరులందరినీ పిలిచి కొత్తబట్టలు పెట్టి వారికి పండిన పంటలో కొంతభాగాన్నిచ్చి గౌర విస్తారు. జానపదులు ప్రదర్శించే జానపదుల కళలను ఆవిష్కరించే కళాకారులనుకూడా సంక్రాంతిరోజే గౌరవిస్తారు. చక్కని బొమ్మల కొలువువను కూడా తీరుస్తారు. సాయం సంధ్య వేళలలో ముతె్తైదు వులను చిన్న పిల్లలను పిలిచి వారికి పండు తాంబూలాలు, పిండివంటలను, నువ్వులుం డలను దానం ఇస్తారు. ఇలా బొమ్మల కొలువు పేర్చడంలో ఓ పరమార్థం దాగి ఉంది. మనమందరం భగవంతుని చేత చేయబడిన బొమ్మలలాంటివారం. భగవంతుని భారం అంతా భగవంతునిపై వేసి, నిరహంకారంగా, జీవితం గడపాలనేది దీని అంతరార్ధం. తాంబూలాలు ఇవ్వడం, పిండివంటలను నలుగురూ కలసి పంచుకోవడం వెనుక దానగుణం చిన్ననాటి నుంచి పెంచుకోవాలన్న సందేశం ఇస్తుంది. చెప్పులు, గొడుగు, వస్త్రాలు నువ్వులు, పెరుగు, గుమ్మడికాయ ఇలాంటివన్నీ దానం చేస్తారు. ఇవి అన్నీ రాబోయే వేసవికాలంలో జాగ్రత్తపడడానికి ముందుచూపును కలుగ చేస్తాయ. మూడవనాడు కనుమ. ‘కనుమ’ అంటే ‘పశువు’ అని అర్ధం. ఏ యెద్దు మన పొలాన్ని దున్ని పంటని యింటికి తేవడంలో సహకరించిందో, ఏ ఆవు మనకు పాడిని యిస్తూ, మన పిల్లల యొక్క, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుందో, అట్టి పశువులను కడిగి, కొమ్ములకు పసుపు కుంకుమలు పెట్టి చక్కగా అపూపములను పెట్టి, నీరు త్రాగించి, ఒళ్ళు నిమిరి, వాటిని ఆనందింపజేసి, వాటియెడ తమ కృతజ్ఞతను ప్రకటించే రోజు ఇది. ఈరోజున పొంగళ్లు వండి పశువులచేత తినిపించి పంటపొల్లాల్లోను, ఇంటిపైన చల్లుకుంటారు. వరి, జొన్నకం కులను ఇంటి చూరుకు (పైభాగంలో) కట్టి పిచ్చుకలు, పావురాళ్లలాంటి పక్షిజాతులకు కూడా విందులు చేస్తారు. ఇలా ఈ సంక్రాంతి సమైక్యంగా, సృష్టిలోని చరాచరజీవజాల మంతా పరస్పరా సహకారం తో జీవించాలనే సందేశాన్నిస్తుంది. ఐక్యత, సోదరభావం, కృతజ్ఞతలను కలిగి ఉండాలనే ఈ సంక్రాంతి అందరి మనస్సుల్లో నవ్యకాంతులను వెద జల్లాలని కోరుతూ సంక్రాంతి శుభాభి నందనలు

-చోడిశెట్టి శ్రీనివాసరావు