మెయిన్ ఫీచర్

యువతలో గుప్పుగుప్పుమంటోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి దశలలో చాలా ప్రముఖమైనది యుక్తవయస్సు. యుక్తవయసులో కలిగే అనుభవాలు మనిషి జీవితాంతం వెన్నంటే ఉంటాయి. ఉన్నత స్థితికి ఎదగాలంటే యుక్తవయసులో తీసుకునే నిర్ణయాలు ప్రధానమైనవి. మధుర స్మృతులు కావచ్చు లేదా మచ్చగా మిగిలే గాయాలుకావచ్చు. బంగారం లాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువత ఒక్కొక్క అడుగువేయాలి. యుక్తవయసులోనే శారీరక, మానసిక పరిపక్వత అభివృద్ధి చెందుతాయి. ఈ వయస్సులో కొత్త అంశాలను కనుగొనడానికి, శోధించడానికి ప్రయత్నాలు చేయడంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటీవల యువత కొత్తపుంతలు తొక్కుతోంది. స్మార్ట్ఫోన్ వినియోగంతో మంచికంటే ఎక్కువ చెడుకే సులభంగా, తొందరగా ప్రభావితమవుతున్నారు. ప్రస్తుతం సరదాగా యువత చేసుకుంటున్న స్మోకింగ్ (్ధమపానం) అలవాటే జీవితాంతం కొనసాగే చెడు అలవాటుగా మారుతోంది. ఇది కాస్తా వ్యసనంగామారి క్రమంగా ప్రాణాల మీదికి తెస్తుంది. ధూమపానం చేసేవారి యువత సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. సిగరెట్లు కాల్చేందుకు డబ్బులు ఖర్చుపెట్టిన దానికంటే.. ధూమపానంతో వచ్చే వ్యాధులను తగ్గించుకునేందుకు వందల రెట్ల రూపాయలు అధికంగా ఖర్చుపెట్టినాగాని, పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలు బొమ్మ, కాన్సర్ రోగి బొమ్మను ముద్రించినా, సిగరెట్ ధర ఎంత పెంచినా, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించినా, చెల్లించక తప్పదు భారీ మూల్యం, ధూమపానం ప్రాణాంతకం అని తెలిసినా సిగరెట్ అమ్మకాలు, పొగాకుప్రియుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయే గాని తగ్గడం లేదు.
సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ప్రస్తుతం యువతలో విపరీతంగా పెరిగిపోతోంది. తమ ఆరోగ్యాన్ని తమే పాడుచేసుకుంటున్నామన్నా సోయి మరిచిపోయి, పొగను రింగులు రింగులుగా వదులుతూ, విలాసంగా సిగరెట్ కాలుస్తున్నానన్న భ్రమలో తేలియాడుతూ యువత తమ జీవితాన్ని చేజేతులా బూడిద చేసుకుంటున్నారు.
ధూమపానం ప్రాణాంతకమే: ధూమపానంవల్ల వ్యక్తులలో నోటి కాన్సర్, దంత వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, అల్సర్, గ్యాస్‌ట్రబుల్, ఉదరకోశ క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువ. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని రక్తపోటు, గుండెపోటు సంభవిస్తాయి. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవాతం, నరాల బలహీనత ఏర్పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో వినికిడి, మాట్లాడే సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం చేసే వారిండ్లలో ఉన్న పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి.
తాగే వాడికన్నా గుప్పుగుప్పుమంటూ వదిలే పొగ పీల్చిన వ్యక్తులకు సైతం ఆయుక్షీణం కలుగుతోంది.
బలహీనతలే కారణమా...: పొగ తాగడం మానేయ్యాలనే ఆలోచన వచ్చినా అమలులోమాత్రం సాధ్యం కావడంలేదనే వారు ఎక్కువయ్యారు. ఒక చెడు మొక్కను నిర్మూలించాలని ఆకులు, కొమ్మలు, కాండంలను నరికివేసినంత మాత్రాన చెడు మొక్క పూర్తిగా నశించదు. మరలా కొద్దిరోజులకు మళ్లీ మొలకెత్తుతుందనే విషయం మనకందరికీ తెలుసు. ఆ చెడు మొక్కను వేర్లతోసహా, నామరూపాలు లేకుండా పెకిలివేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పొగ తాగడం మానేయాలనుకోవడం మంచి నిర్ణయమే. పొగ తాగడం మానేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలంటే మాత్రం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకోవాలి. పొగ తాగే వ్యసన పరులందరికీ ఒకే రకమైన నియమాలు పనిచేయవనే విషయాన్ని ముందుగా గుర్తించడం మంచిది. పొగ తాగడాన్ని ఎందుకు మానేయాలనుకుంటున్నారో మిమ్మల్నిమీరే ప్రశ్నించుకోవాలి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకోండి. సిగరెట్ తాగడానికి మిమ్మల్ని ఏ పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయో గమనించండి. సిగరెట్లు మానేయడం సులువే. పొగతాగడం మానివేసే సమయంలో ఉత్పన్నమయ్యే అసహనం, ఆందోళన వంటి లక్షణాలు అగుపిస్తాయి. వీటిని దృఢ సంకల్పంతో ధీమాగా ఎదుర్కోవాలి.
యువత ధూమపానానికి దూరంగా ఉండటానికి
సహాయపడే కొన్ని చిట్కాలు:
గ్లాసు పాలు: డ్యూక్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ధూమపానం చేసేముందు ఒక గ్లాసు పాలు తాగడం మూలంగా సిగరెట్ రుచి పట్ల ఆసక్తి ఉండదని తెలియచేసింది. సిగరెట్ ఆలోచన మనసుకు రాగానే, ముందుగా ఒక గ్లాసు పాలు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.
గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ: ధూమపానం చేసేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
విటమిన్ సి,ఇ: నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం రోజులో కనీసం 35 మిల్లీగ్రాముల విటమిన్-సి తీసుకోవాలి. అయితే పొగాకు తినేవారిలో వచ్చే విటమిన్-సి లోపం కారణంగా గుండె జబ్బులు, కేన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే పొగాకు వ్యసనంనుంచి బయటపడవచ్చు. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే ధూమపానం వలన వచ్చే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.
తల్లిదండ్రులూ బాధ్యతగా తీసుకోండి:
మార్గదర్శి: తల్లిదండ్రులకు సిగరెట్ కాల్చడం ఒక అలవాటుగా ఉన్నట్లయితే యుక్తవయస్సులోని పిల్లల పరిశీలిస్తూ, వారు కూడా అలవాటుగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులుగా బాధ్యతగా తీసుకొని పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టి యందుంచుకుని సాధ్యమైనంత త్వరగా పొగ తాగడం అలవాటును మానుకోవాలి. ధూమపానం నిర్మూలన దిశగా వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను, నియమాలను నిర్దేశిస్తూ చిన్నవయస్సులోనే ధూమపానానికి అలవాటుపడటం మంచిదికాదని పిల్లలను హెచ్చరిస్తూ ఉండాలి. ధూమపానం ఎంతమాత్రమూ మంచి అలవాటుకాదని దృఢంగా కచ్చితంగా చెప్పాలి.
మనస్తత్వం: యుక్తవయస్సులోని పిల్లలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వారితో మాట్లాడుతూ వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. యుక్త వయసు పిల్లల్లో కొత్త అంశాలవైపుగా మొగ్గుచూపుతూ వాటి ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. స్నేహ బృందంతో కలిసి పోవడానికి, వారిదగ్గర మెప్పుపొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరైన సమయంలో జోక్యం చేసుకుని, వారికి సరైన మార్గదర్శం చేయడం ద్వారా ధూమపానంనకు దూరంగా ఉండేందుకు ప్రోత్సహిస్తూ ఉండాలి.
మంచి చెడు: ధూమపానం చేయడంవలన కలిగే దుష్ప్రయోజనాలను, జీవితకాల వ్యసనంగా ఎలా మారుతుందో తెలియజేయాలి. సిగరెట్‌లో ఉండే హానికారక రసాయనాలు గురించి మరియు శ్వాస క్రియా వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్, గుండె సమస్యలు మొదలైన పలు ఆరోగ్య సమస్యలు ఏవిధంగా సంభవిస్తాయో వారికి తెలియజేయాలి. మంచి చెడులను వివరిస్తూ ఉండాలి.
స్నేహితుడిగా భరోసా: ధూమపానం మానేయడం మూలంగా స్నేహితులు దూరమవుతారని, వారి అభిమానంకోసం తన స్నేహితులు చెప్పినవాటికి ‘లేదు’అని చెప్పడానికి మీ యుక్తవయస్సులోని పిల్లలు భయపడవచ్చు. యుక్తవయస్సులోని పిల్లలతో మాట్లాడి, వారు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడాలి. కొన్ని దురలవాట్లకు ‘లేదు’ అని చెప్పడం వలన జీవితాంతం సుఖంగా జీవించవచ్చని వారికి చెప్పాలి. తల్లిదండ్రులు ఒక స్నేహితుడిగా భరోసాను పిల్లలలో నింపుతూ ఉండాలి. తల్లిదండ్రులు యుక్తవయస్సులోని పిల్లలు బాధ్యతాయుతమైన వయోజనులుగా ఎదగడానికి కీలక పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రులు సరైన సమయంలో జోక్యంచేసుకుని, సరైన మార్గదర్శకం అందించి, పిల్లలకు బాసటగా నిలిచినప్పుడు సరైనమార్గంలో పయనిస్తారు. ఉన్నతస్థాయికి ఎదగగలుగుతారు.
కౌనె్సలింగ్: యువత ధూమపానం అలవాటును దూరంచేసుకోవడానికి సైకాలజిస్ట్ ద్వారా కౌనె్సలింగ్ తీసుకోవడం మంచిది. లక్ష్యం వైపుగా పయనించడానికి కౌనె్సలింగ్ ద్వారా సాధించడం సులువవుతుంది.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి