మెయిన్ ఫీచర్

షార్క్‌తో ఈత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ప్రపంచంలోనే అతి పెద్ద వైట్ షార్క్..
ఆమె సముద్రంలో దృశ్యాలను బంధించే ఫొటోగ్రాఫర్..
సముద్రంలో చనిపోయిన తిమింగలాన్ని ఫొటోలు తీయడానికి వచ్చింది. కానీ అనుకోకుండా గ్రేట్ వైట్ షార్క్ పక్కనే ఈత కొట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోనే అతి పెద్ద షార్క్‌ను చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది దానితో కలిసి పక్కపక్కనే ఈతకొట్టడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే.. భయం వేస్తుంది కదూ.. సముద్రంలోని గ్రేట్ వైట్ షార్కులు ప్రపంచంలోనే అతి పెద్దవని చెబుతున్న డీప్ బ్లూ షార్క్‌కు దగ్గరగా వెళ్లి అలాంటి అనుభవం పొందారు ఫొటోగ్రాఫర్ కింబర్లీ జెఫ్రీస్. హవాయిలోని ఓహూ తీరానికి వచ్చింది కింబర్లీ. చనిపోయిన తిమింగలం కళేబరాన్ని తినడానికి వచ్చే షార్కులను ఫొటోలు తీయాలనుకుంది. అలా అనుకుంటూనే నీళ్లలోకి దిగింది. కానీ సముద్రంలోకి దిగిన తరువాత ఆమెకు అక్కడ ఏమీ కనిపించలేదు. హాయిగా ఊపిరి పీల్చుకుంటూ చనిపోయిన తిమింగలాన్ని ఫొటోలు తీసుకోవచ్చు అనుకుంది. మామూలుగా అయితే ఏదైనా పెద్ద ప్రాణి చనిపోయిన వెంటనే షార్కులు వాటిని తినడానికి మూగుతాయి. కానీ అక్కడ షార్కులు కనిపించకపోవడం చూసి కింబర్లీ, వాళ్ల టీమ్ ఆశ్చర్యపోయింది. ఇలా అనుకున్న 30 సెకన్ల తర్వాత వారికి ఓ భారీ షార్కు కనిపించిందట. ఇంజిన్ వెనుక నుంచి టైగర్ షార్కులు నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టాయట. అతి పెద్ద షార్క్ ఒకటి మెల్లగా బయటకు వచ్చి తిమింగలం కళేబరం దగ్గరకు చేరుకుందట. ఈ షార్కును డీప్ బ్లూ అనే వాటిలో ఒకటని అందరూ భావించారు. దాని వయస్సు 50 సంవత్సరాలు ఉంటుందట. ఈ గ్రేట్ వైట్ బరువు దాదాపు రెండున్నర టన్నులు ఉంటుందని వారు అంచనా వేశారు. ఈ షార్కు దాదాపు ఆరు మీటర్ల పొడవుందట. అంటే అది ఓ పెద్ద జిరాఫీ అంత పొడవుందట. దాన్ని చూడగానే కింబర్లీ, అతని స్నేహితుడు ఆండ్రూ, మిగిలిన టీం అంతా షాక్‌కు గురయ్యిందట. తరువాత వారందరూ అంత పెద్ద షార్కును అంత దగ్గరగా చూడటం నిజంగా అద్భుతంగా ఫీలయ్యారట. అది కూడా ఆ షార్క్ గ్రేట్ వైట్ అని తెలియగానే కింబర్లీకి గుండె వేగంగా కొట్టుకుందట.. ఇంకొద్ది క్షణాలు అలాగే ఉంటే గుండె పేలిపోతుందేమో అనిపించిందట. తర్వాత ఆమె నెమ్మదిగా కుదుట పడిందట. తర్వాత అంత పెద్ద గ్రేట్ వైట్ షార్కుకు అంత దగ్గర్లో ఉన్నప్పుడు ఏదైనా చేయడం చాలా కష్టంగా అనిపించిందట.
ఇంతకుమునుపు కింబర్లీ చాలాసార్లు సముద్రంలో ఫొటోలు తీయడానికి వెళ్లారు. చాలా షార్కులను ఫొటోలు తీశారు. కానీ డీప్ బ్లూ షార్క్‌ను చూసిన ఈ అనుభవం మాత్రం ఆమెకు పూర్తి భిన్నమైనదని చెబుతోంది ఆమె. ‘అది నిజంగా ఒక మాయలా అనిపించింది. ఇది నా జీవితంలో చాలా చాలా ప్రత్యేకమైన క్షణం. డీప్ బ్లూ షార్క్ అక్కడ చాలాసేపు ఉంది. దాని పొడవు మాత్రమే కాదు.. దాని భారీ ఆకారం కూడా చాలా అద్భుతంగా ఉంది. తాకేంత దగ్గరగా ఉన్నా నేను దాన్ని తాకలేదు. తాకితే ప్రమాదం అని నేను భావించాను. అక్కడ అది తినడానికి ఆహారం సిద్ధంగా ఉండడంతో, దాని వల్ల మాకు ఎలాంటి ప్రమాదం ఉండదని నేను, మా టీమ్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అందుకే దానితో పాటు ఈత కొడుతూ చాలా ఫొటోలు తీశా. దాన్ని చూడగానే భయపడి తిరిగి తీరానికి సులభంగా వచ్చేయవచ్చు. కానీ వన్యప్రాణులను, అవి సహజంగా తిరిగే చోట చిత్రీకరించడం ప్రతి ఫొటోగ్రాఫర్ కల.. అందుకే నేను వెంటనే బయటకు రాకుండా.. దానితో పాటు కాసేపు తిరిగి ఈత కొడుతూ ఫొటోలు తీశాను. ఆ సమయంలో నాకు ఒక సఫారీలోకి వెళ్లి సింహం పక్కనే నడుస్తూ ఫొటో తీసుకుంటున్నట్లు అనిపించింది’ అని చెబుతోంది కింబర్లీ.. ఏది ఏమైనా ఆమె సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ‘సీ ఫొటోగ్రాఫర్ అయినందుకు డీప్ బ్లూ షార్క్‌ను అలా దగ్గరిగా చూడటం, ఫొటోలు తీయడం ఆమెకు చాలా సంతృప్తిగా అనిపిస్తోందని, సంతోషంతో మాటలు రావడం లేదు..’ అని చెబుతోంది కింబర్లీ.