మెయిన్ ఫీచర్

ఈలపాటతో సంచలనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్ల విజిల్ వేస్తే కసురుకుంటాం. పోకిరితనానికి ప్రతీకగా భావిస్తాం. ఆ ఈలతోనే ప్రపంచ ప్రఖ్యాతురాలయ్యింది శే్వతా సురేష్. ఈనెల 15 నుంచి 17 వరకు జపాన్‌లో జరిగిన ప్రపంచ ఈలపాటల పోటీలలో రెండు ప్రథమ బహుమతులను గెలుచుకొని ఈలపాటలో తనకు తానే సాటి అనిపించుకుంది 24 ఏళ్ల శే్వతా సురేష్. పలు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన విజల్ నిపుణుల ముందు తన విద్యను ప్రదర్శించి సెభాష్ అనిపించుకుంది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయురాలు శే్వత. అంతేకాదు ఈలపాటను ప్రదర్శించే తొలి భారతీయురాలిగాను, ఆసియాలోనే ఈలపాటను పాడే నెంబర్ వన్ మహిళగా స్థానం సంపాదించుకుంది.
చెన్నైకి చెందిన శే్వతాసురేష్‌కు తొమ్మిదేళ్ల పసివయసునుంచే ఈలపాట మీద ఆసక్తి ఏర్పడి దానిని అభ్యసించడం మొదలుపెట్టింది. అలా చిన్ననాడే ఏర్పడిన విద్యకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మెరుగుపెట్టుకుంటూ ఆ విద్యలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుంది. తన తొమ్మిదేళ్ళ వయసులోనే ఈ కళమీద ఆసక్తి ఏర్పడి దానిని గురుముఖతః నేర్చుకునే అవకాశం లేకపోయినా స్వయం గా దానిని అభ్యసించడం మొదలుపెట్టింది.
శిక్షణ లేకపోయనా ప్రతిభతో రాణింపు..
ఎలాంటి శిక్షణ లేకపోయినా తన ప్రతిభతో సినీ గీతాలను, శాస్ర్తియ, ఆధునిక గీతాలను ఈలపాటతో అలవోకగా ఆలపిస్తుంది శే్వత. నాలుగు వందల పైచిలుకు సభ్యులున్న భారత విజిలర్స్ అసోసియేషన్‌లో విజల్ క్వీన్‌గా ఈమెకు ప్రతిష్ఠాకరమైన స్థానం సంపాదించుకుంది. ఎల్.వి.ప్రసాద్ కళాశాల నుంచి సౌండ్ ఇంజనీర్‌గా విద్యనభ్యసించిన శే్వత తన ప్రతిభతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
2014లో అక్టోబర్‌లో చెన్నైలో 18 గంటలపాటు ఏకధాటిగా ఈలపాటతో వివిధ సినీ గీతాలు, భక్తిగీతాలు, శాస్ర్తియ గీతాలను వినిపించి రికార్డు సృష్టించింది. తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసి యా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం 25 గంటలు ఏకధాటిగా ఈలపాటలు పాడి గినె్నస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం కోసం నిరంతర సాధనలో మునిగితేలుతోంది. ఇదేగనుక సాధ్యం అయతే ఆమె ఖాతాలో మరో రికార్డు నమోదవుతోంది.
తమిళ చిత్రరంగంలో ప్రోత్సాహం..
ప్రస్తుతం శే్వత ఈలపాటకు తమిళ చిత్రరంగంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో చిత్రాలలో తన ఈలపాటతో ప్రేక్షకులకు దగ్గరయిన శే్వత మరెన్నో రాబోయే చిత్రాలలో కూడా తన ఈలపాటను వినిపించింది. మిగిలిన సంగీత పరికరాల మాదిరిగానే ఈమె ఈలపాటను కూడా ఒక సంగీత సాథనంగా ఉపయోగించుకుంటున్నారు సంగీత దర్శకులు.
నిజానికి శే్వతాసురేష్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే భరతనాట్యం, కర్నాటక శాస్ర్తియ సంగీతంలో ఆమెకు చక్కని ప్రతిభ ఉంది. కాని తన అభిరుచి మేరకు ఈలపాటలోనే తన ధ్యాసంతా పెట్టి ఆ విద్యలోనే మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ అరుదైన కళతో ప్రముఖ నేపథ్యగాయనీ, గాయకులైన సుశీలమ్మ, చిత్ర, బాలసుబ్రణ్యం వంటివారి ప్రశంసలు అందుకుంది. మన దేశంలో ఈ కళకున్న ఆద
రణ గురించి మాట్లాడుతూ, విదేశాల్లో ఈ విద్యను నేర్పడానికి పాఠశాలలు, కళాశాలలు బాగానే ఉన్నాయి. కాని మన దేశంలో ఈ విద్యను నేర్పడానికి సరైన పాఠశాలలు లేని పరిస్థితి. అందుకే చెన్నైలోనే ఒక ఈలపాటను నేర్పే పాఠశాలను నెలకొల్పి ఈ విద్యను ఇంకా మరింత మందికి నేర్పాలన్న ఆలోచన ఉన్నట్టు చెప్తుంది శే్వతాసురేష్.

- మావూరు విజయలక్ష్మి