మెయిన్ ఫీచర్

దక్షిణ ధ్రువాన్ని చుట్టిన తొలి మహిళా ఐపీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తం గడ్డకట్టే మంచు..
వీపుపై 35 కిలోల బరువు..
111 కిలోమీటర్ల ప్రయాణం..
211 పర్వతాల అధిరోహణ.. కేవలం కాలినడక ద్వారా.. ఈ ఘనత సాధించి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణా కుమార్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 211 పర్వతారోహణలు చేయడమే కాకుండా ఆ పర్వత శ్రేణులను కొలిచి ఆమె రికార్డు సృష్టించింది ఆమె. ప్రస్తుతం అపర్ణ డీ ఐజీగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది.
అపర్ణ బెంగళూరు, నేషనల్ లా కాలేజీలో డిగ్రీ చదివింది. తరువాత సివిల్స్‌కి హాజరై 2002 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్, ఐపీఎస్ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. అపర్ణ భర్త సంజర్‌కుమార్ ప్రభుత్వాధికారి కాగా, వీరికి ఇద్దరు పిల్లలు. చిన్నవయస్సు నుంచే అపర్ణా కుమార్‌కి పర్వతారోహణపై అమితమైన ఆసక్తి. ఇందులో శిక్షణ తీసుకున్న ఆమె పలు సాహసాలకు శ్రీకారం చుట్టింది. మహిళలు అన్ని రంగాల్లోనూ మగవారితో పోటీపడుతున్నారు. పోటీ పడడమే కాదు వారిని జయిస్తున్నారు కూడా.. ఆ రంగం, ఈ రంగం అనేది లేకుండా మహిళలు అన్ని రంగాల్లోనూ విజయఢంకా మోగిస్తున్నారు. ఇంతకుముందు పర్వతారోహణ అనేది కేవలం మగవారు మాత్రమే చేసేవారు. కానీ ఇటీవల కాలంలో మహిళలు కూడా పర్వతారోహణ చేస్తున్నారు. చేయడమేకాదు రికార్డులను కూడా సృష్టిస్తున్నారు. ఈ విధంగానే రికార్డు సృష్టించింది ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి.
ఇప్పటివరకూ అపర్ణ సాధించిన సాహసాలు
* 2015లో యూరప్‌లో 18,510 అడుగుల ఎతె్తైన పర్వతశ్రేణి ఎల్‌బ్రస్‌ను కొలిచింది.. ఇది అత్యంత క్లిష్టమైన సాహసం.
* 2015లో దక్షిణ అమెరికాలో అతి ఎతె్తైన అకోన్‌కాగ్వా, ఇండోనేషియాలో కార్‌స్టెన్‌జ్ పిరమిడ్, అలాగే టాంజానియాలోని కిలిమాంజారో వంటి పర్వతాలెన్నో ఎక్కి కొలిచింది.
* 2016లో వౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని కొలిచిన తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌గా కూడా పురస్కారం అందుకుంది అపర్ణ.
* 2017లో అంటార్కిటికాలోని 17వేల అడుగుల ఎత్తున్న విన్‌సన్ మాసిఫ్ పర్వత శిఖరాన్ని చేరుకుని అక్కడ మన జాతీయజెండా, ఉత్తరప్రదేశ్ పోలీస్ జెండాను ఎగరేసింది అపర్ణ.
* తాజాగా 2018 డిసెంబర్ 30న దిల్లీ నుంచి బయలుదేరిన అపర్ణ.. దుబాయ్ మీదుగా చిలీలోని పుంటాస్ అరెనస్ నుంచి శాంటియాగో వెళ్లి, అక్కడి నుంచి దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి యాత్రను ప్రారంభించింది. 111 మైళ్ల దూరం, మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ప్రయాణించి జనవరి 13న దక్షిణ దృవాన్ని చేరుకుంది అపర్ణ.
అంటార్కిటికా ఉపఖండంలోని వౌంట్ విన్సర్ మానిఫ్‌ను అపర్ణాకుమార్ అధిరోహించింది. ఈ నెల 17న ఆమె తన సహచరులతో కలిసి 17వేల అడుగుల ఎతె్తైన పర్వతాన్ని అధిరోహించి మువ్వనె్నల పతాకాన్ని ఎగురవేసింది. అలా ఎతె్తైన పర్వతాన్ని అధిరోహించిన మొదటి ఐపీ ఎస్ అధికారిణిగా అపర్ణ రికార్డు సృష్టించింది. అపర్ణ సాధించిన ఘనతకుగానూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.