మెయిన్ ఫీచర్

మాక్సీ మెరుపులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం ఏదైనా, కొత్తగా కనిపించాలనుకునేవారికి సరైన ఎంపిక.. మాక్సీ.. ఇప్పటి తరానికి బాగా తెలిసిన డ్రెస్. ఒకప్పుడు మాక్సీలను హీరోయిన్లు మాత్రమే వేసుకుంటారు.. వారికి మాత్రమే ఇవి బాగుంటాయి అనుకునేవారు. ఇప్పుడు క్రమంగా అది సాయంత్రపు వేడుకలకు నప్పే డ్రెస్ అయ్యింది. కానీ నేడు.. అన్ని సందర్భాలకూ మాక్సీనే ట్రెండీ డ్రెస్. అందుకే నేటితరం అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఒక్క మాక్సీ అయినా ఖచ్చితంగా ఉంటుంది. కాలేజీకే కాదు.. చిన్న చిన్న వేడుకలకి, సినిమాలకి, పార్టీలకీ.. ఇలా అన్నింటికీ మాక్సీనే..
నేటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్యాషన్ డిజైనర్లు కూడా రకరకాల మాక్సీలను తయారుచేయడం బిజీ అయిపోయారు. మాక్సీ గౌను అంతా విశాలంగా, నీ లెంగ్త్‌లో ఉండదు కానీ ఫుల్ లెంగ్త్‌లో, శరీరాకృతిని బట్టి స్ట్రెయిట్ కట్‌లో ఉంటుంది. ఇప్పుడు ఇందులోనూ అంబ్రెల్లా కట్, సెమీ అంబ్రెల్లా కట్ అని చాలా రకాలు ఉన్నాయి. ఫిట్టింగ్‌లో కూడా ఫిట్టెడ్, సెమీ ఫిట్టెడ్ రకాలు ఉన్నాయి. కాస్త వదులుగా వేసుకోవాలనుకునేవారు కూడా ఆకృతిని అనుసరించి వదులైన వాటిని ప్రయత్నించవచ్చు. సిల్క్, షిఫాన్, జెర్సీ, బెనారస్, ఇకత్, కాటన్, క్రేప్ వంటి రకరకాల వస్త్రాలతో అనేక మాక్సీలు అందుబాటులో ఉంటున్నాయి. నేడు స్లిట్ ట్రెండ్ నడుస్తోంది. స్నేహితులతో సరదాగా ఆనందించే పార్టీల వేళ స్లిట్ రకం సరైన ఎంపిక. స్లిట్ అంటే.. కుర్తా మాదిరి మాక్సీకి చీలిక ఉంటుంది. ఈ స్లిట్‌కి మెరిసే వస్త్రంతో రూపొందించిన మాక్సీ అయితే బాగుంటుంది. ఈ తరహా మాక్సీలకు జతగా జీన్స్, డిజైనర్ లెగ్గింగ్స్, పలాజోలు కూడా వేసుకోవచ్చు. ఆఫ్ షోల్డర్స్ రకాలు కూడా బాగుంటాయి.
మాక్సీలపైకి షగ్ కూడా వేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్‌కి, టూర్స్‌కి వెళ్లేవాళ్లు స్లీవ్‌లెస్ మాక్సీలు కానీ, ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ ఉన్న మాక్సీలు కానీ ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. అలాగే టూర్స్‌కి ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న మాక్సీలు అయితే చాలా అందంగా ఉంటాయి. వీటికి లెదర్ జాకెట్స్ కూడా బాగా నప్పుతాయి. స్లీవ్‌లెస్ మాక్సీ పైకి షగ్,్ర కార్డిగిన్ బాగుంటాయి.
లావుగా ఉన్నవారు కొత్త డ్రెస్‌లను వేసుకోవడానికి భయపడుతుంటారు. లావుగా ఉన్నవారికి ఇలాంటి డ్రెస్‌లు నప్పవని వారి ఫీలింగ్. కానీ మాక్సీలు లావుగా ఉన్నవారికి కూడా చక్కగా నప్పుతాయి. కాస్త లావుగా ఉన్నవారు మరీ వదులుగా కాకుండా కేవలం నడుము దగ్గర మాత్రం పట్టినట్లు ఉండేదాన్ని ఎంచుకోవాలి. లేదంటే ఓ ఆకృతి అంటూ లేకుండా కనిపిస్తారు. సన్నగా, నాజూగ్గా ఉన్నవారు బనియన్ క్లాత్‌తో తయారుచేసిన మాక్సీలకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. ఇవి వీరికి తీరైనా ఆకృతిలో కనిపించేలా చేస్తాయి. వెనుక సీటుభాగం లావుగా ఉన్నవారికి పాటర్న్ మాక్సీలు బాగుంటాయి. అంటే జామెట్రీ ప్రింట్లు, గళ్లు, పువ్వుల డిజైన్లు ఉన్న రకాలు సరిగ్గా నప్పుతాయి. ఫలితంగా నడుము భాగం లావుగా ఉందన్న విషయాన్ని ఎవ్వరూ గుర్తించలేరు. ఇక పొట్టిగా ఉన్నవారు పొడవాటి నిలువు గీతలున్న మాక్సీని ఎంచుకోవాలి. లావుగా ఉన్నవారు అడ్డగీతలున్న రకాల్ని ఎంచుకుంటే బాగుంటుంది. ఆఫీసుకెళ్లే వాళ్లు కూడా మాక్సీలను నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అయితే రంగుల జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది. ముదురు నీలం, ఎరుపు, నలుపు రంగుల మాక్సీలు కార్యాలయానికి బాగుంటాయి. అలాగే కాలర్‌నెక్, ముందువైపు బటన్స్ ఉండేలా చూసుకుంటే మాక్సీలో కూడా హుందాగా కనిపిస్తారు. సంప్రదాయ వేడుకలకు కూడా మాక్సీలను వేసుకోవచ్చు. ఈ సమయాల్లో బెనారస్, బ్రొకేడ్ వంటి వస్త్రాలతో రూపొందించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. వీటిపైన చక్కని ఎంబ్రాయిడరీ ఉంటే మరింత అందంగా కనిపిస్తారు. ఇలాంటివి వివాహ వేడుకలకు, రిసెప్షన్‌లకు బాగుంటాయి. మాక్సీలపైకి భారీ నగలకంటే తక్కువ నగలు వేసుకుంటేనే బాగుంటుంది. సిల్వర్ కలర్ నగలు, సింపుల్ డైమండ్ నగలు మాక్సీలపైకి అందంగా ఉంటాయి.