మెయిన్ ఫీచర్

సర్వసత్తాక ప్రజాస్వామ్యమే గణతంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం మంచిదే కాని మంచివారిచేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది22
- అంబేద్కర్
ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ అన్నాడు. ప్రజాస్వామ్యానికి మూలగ్రంథం లాంటిది రాజ్యాంగం. కాబట్టి భారత రాజ్యాంగం తయారుచెయ్యడం కొరకు 1947 ఆగస్టు 29న రాజ్య సభ మేధావులతో కూడిన ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటుచేసింది. అప్పటి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో 284 మంది సభ్యులుగా ఒక కమిటీని వేయడం జరిగింది. దీనినే రాజ్యాంగ పరిషత్ అంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏర్పాటుచేయడానికి ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేద్కర్ కమిటీల్లో సభ్యులుగా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, బి.ఎల్. మిట్టర్, ఎస్. గోపాలస్వామి, అయ్యంగార్, ఎం.డి. సాదుల్లా, టి.టి. కృష్ణమాచారి, పండిత్ గోవింద్ వల్లభ్ పంత్‌లను నియమించారు.
భారతదేశ చరిత్రలో భారతీయులందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు జనవరి 26, 1950వ సంవత్సరం. ఎందుకుంటే 200 సంవత్సరాలపాటు పరాయి దేశస్థులైన బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటివరకూ మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మన దేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. అలా 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్రప్రసాద్ మొట్టమొదటి రాష్టప్రతిగా, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయింది. ఆ రోజునుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది.
గణతంత్ర రాజ్యం
గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలు జరిపారు. ఆనాటినుంచి భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యంగా అవతరించబడింది. అప్పటినుంచి ఈ రోజును గణతంత్రదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీనగరంలో భారత రాష్టప్రతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముందుగా రాష్టప్రతి దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులకు పతకాలను అందజేస్తారు. అదేవిధంగా ఆ రోజు దేశ రాజధానిలోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ గొప్ప గొప్ప పెరేడ్‌లను నిర్వహిస్తారు. అనేక పాఠశాలల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ పెరేడ్‌లలో పాల్గొంటారు.
రాజ్యాంగ నిర్మాణంలో...
డా. అంబేద్కర్ ఆధ్వర్యంలోని కమిటీ అహరహం శ్రమించి ఒక లిఖిత రాజ్యాంగ ప్రతి తయారుచేసి, 1947 నవంబర్ 4వతేదీన అసెంబ్లీకి సమర్పించారు. 166 రోజులపాటు, సామాన్యపౌరులు కూడా పాలు పంచుకోవడానికి వీలైన అసెంబ్లీ సమావేశాలలో, భారత రాజ్యాంగ వ్రాతప్రతికి ఎన్నో సుదీర్ఘమైన చర్చలలో సవివరమైన సవరణలు ప్రతిపాదించి, మార్పులూ, చేర్పులు చేసిన తరువాత, ఇంగ్లీషులోనూ, హిందీలోనూ విడివిడిగా రాసిన రెండు లిఖిత రాజ్యాంగ ప్రతులమీద, 1950 జనవరి 24వ తేదీ, 308 మంది అసెంబ్లీ మెంబర్స్ తమ ఆమోద సూచకంగా సంతకాలు చేశారు. ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకుని, జరుపుకునే జాతీయదినోత్సవమే రిపబ్లిక్ డే. భారతదేశంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 జనవరి 1950ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న సభలో ఆమోదించించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్‌లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు. వాటి నకలు ఫొటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మన రాజ్యాంగం జనవరి 26వ తేదీ ఉదయం 10.18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.

-కాళంరాజు వేణుగోపాల్ 81062 04412