మెయన్ ఫీచర్

సైనికుల ఉనికిని సహించని వారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లిమెడలో గంట కట్టదలచిన ఎలుకల కథ గుర్తుకు రావడం సహజం...పిల్లి వస్తోందని తెలియడానికి వీలుగా ‘అతగాడి మెడలో ఒక గంటను వ్రేలాడదీయాలన్నది ‘‘ఎలుకల మహాసభ’’లో జరిగిన చారిత్రక నిర్ణయం. పిల్లిమెడలో గంట ఉండడంవల్ల పిల్లి నడుస్తున్నప్పుడు, దూకుతున్నప్పు డు గంట గణగణ మోగుతుందన్నది ‘‘మూషి క మహాశయుల’’విశ్వాసం. గంటలు మోగగానే తాము జాగ్రత్త పడి కలుగులలోకి దూరుకోవచ్చునన్నది ఎలుకల వ్యూహం.. అందువల్ల పిల్లి మెడలో గంట కట్టితీరాలన్నది ఎలుకల దృఢ సంకల్పం..అయితే గంటను మోసుకొని ‘మార్జాల దుర్జనుని’వద్దకు వెళ్లి అతని మెడలోబంధించే దెవ్వరు? ఈ దుస్సాహసానికి మాత్రం ఏ ఒక్క ఎలుకా కూడ పూ నుకోలేదట. అందువల్ల పిల్లి మెడ ‘బోసి’ గానే ఉండిపోవడం తరతరాల సహజ సంప్రదా యం. ఈ ‘బోసి మెడ’ పిల్లులు ప్రస్తుతం మ రింత ‘బోసి’గా ఉన్న కశ్మీర్ లోయ ప్రాంతపు పోలీస్ స్టేషన్లలో యథేచ్ఛగా విహరిస్తున్నాయట. పోలీస్ స్టేషన్లు ఎందుకు బోసిపోయాయన్న సందేహం కలుగడం సహజం. సం దేహ నివృత్తి కూడ జరిగిపోయింది. జిహాదీ బీభత్సకారులు తమ ఠాణాలపై దాడి చేస్తారన్న భయంతో రక్షక భటులు వాటిని ఖాళీచేసి వెళ్లిపోయారట. అందువల్ల బోసిపోయిన పోలీసు ఠాణా వద్ద సైనికులు మాత్రమే అ త్యంత జాగరూకతతో గస్తీ తిరుగుతున్నారట. కశ్మీర్ లోయ ప్రాంతంలోని పుల్‌వామా, అ నంతనాగ్, శోపియా, కుల్‌గావ్ జిల్లాలోని మొత్తం ముప్పయి ఆరు పోలీసు ఠాణాలలో ను మూడింటిలో మాత్రమే రక్షక భటుల అలికిడి వినిపిస్తోందట. మిగిలిన ముప్పయి మూడు పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసులం తా స్థావరాలను ఖాళీచేసి వెళ్లిపోయారట. పో లీసు స్టేషన్లపై ‘ఆవేశగ్రస్తులైన’ మూకలు దాడులు చేయడానికి సిద్ధం కావడం ఈ పోలీసుల పలాయానికి నేపథ్యం. అందువల్ల ‘కశ్మీర్ స్వతంత్రం’ కోరుతున్నవారు మరింత నిర్భయంగా ఈ నాలుగు జిల్లాలలోను ప్రదర్శనలు, ఊరేగింపులు జరుపుతున్నారట. ఇలా కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా మార్చాలని పగటి కలలు కంటున్నవారు దేశద్రోహులు, జిహాదీ బీభత్సకారులు...వారు పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న తోడేళ్లు. వీరి దుశ్చర్యలను నిరోధించదగిన జమ్మూకశ్మీర్ పోలీసులే వారి ముందు మోకరిల్లినట్టుగా తప్పించుకొని పారిపోవడం విచిత్రం కాదు, విస్మయకరం కాదు. జమ్మూకశ్మీర్ పోలీసు యంత్రాంగం స్వభావాన్ని ఎరిగిన వారెవ్వరూ ప్రముఖంగా ప్రచారమైన ఈ పోలీసులు పారిపోవడం పట్ల ఆశ్చర్యాన్ని ప్రకటించడంలేదు. జమ్మూకశ్మీర్ పోలీసులలో అధికులు జిహాదీ బీభత్సపాలకుల పట్ల సహాయ సానుభూతులను కలిగివుండ టం ఈ స్వభావం. దీనికితోడు దేశద్రోహులైన ముష్కరులు కొనసాగ్తిన్న ఆందోళనలను, ప్రదర్శనలను నిరోధించవద్దని ఈ పోలీసులకు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల ఆదేశాలు కూడ లభించాయట. అందువల్ల దేశ విద్రోహులు విచ్చలవిడిగా ఈనాలుగు జిల్లాలోను ‘సమాంతర పాలన’ సాగిస్తున్నారట. జమ్మూకశ్మీర్‌ను టెర్రరిస్టులనుంచి పాకిస్తానీ తొత్తులనుంచి కాపాడగలుగుతున్నది ప్రస్తుతం సైనికులు మాత్రమే.
అయితే సైనికుల ఉనికిని బీభత్సకారులు, వారిని ఉసిగొలుపుతున్న ‘హురియత్’ వంటి దేశవిద్రోహపు ముఠాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటె సైనికులు అడ్డుతగలక పోయినట్టయితే కశ్మీర్‌ను దేశం నుండి విడగొట్టే కార్యక్రమాన్ని వేగవంతం చేయవచ్చునన్నది జిహాదీల ఆశ, దేశ వ్యతిరేకుల విశ్వాసం. బుర్హన్ వని అన్న కరడు కట్టిన భయంకర బీభత్సకారుడు సైనికులతో తలపడి హతుడైన నాటినుంచి దాదాపు యాబయి రోజులుగా జిహాదీలు తమ నిరసన ప్రదర్శనలు తీవ్రతరం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో జమ్మూ కశ్మీర్‌కు దేశంనుండి స్వాతంత్య్రం కావాలన్న నినాదాలు నిరంతరం వినిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు పట్టించుకోరన్నది దశాబ్దుల క్రితమే ధ్రువపడిన వాస్తవం. కానీ కేంద్ర రిజర్వ్ పోలీసులు కూడ ఈ నిరసన స్థలాలలో కనిపించకపోవడం పెద్దగా ప్రచా రం కాని వాస్తవం. కేంద్ర రిజర్వు పోలీసులను చూస్తే బీభత్సకారులు, వారి సమర్థకులు మరింత రెచ్చిపోతారట. అందువల్ల కేంద్ర రిజర్వ్ పోలీసులు ఆ ప్రాంతాలలో కనిపించరాదని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వమే భావిస్తోందట. ఈ పాకిస్తాన్ సమర్థకులను, దేశద్రోహులను ‘ప్రజలు’గా చిత్రీకరించడానికి కశ్మీర్‌లోయ ప్రాంతంలో జరుగుతున్న ప్రయత్నం ‘విజయాన్ని’ సాధిస్తోంది. సైనికులను, అంతర్గత భద్రతను సరిహద్దుల భద్రతను కాపాడుతున్న వీరులను ‘దుర్జనులు’గా చిత్రీకరించడానికి సమాంతరంగా జరుగుతున్న ప్రయత్నానికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాకపోవడమే విచక్షణ కలవారికి విస్మయం కలిగిస్తున్న విపరిణామం.
కశ్మీర్ లోయలో సైనిక దళాల పాత్రను త గ్గించడం వల్ల పాకిస్తాన్ మద్దతుదారులు మళ్లీ విజృంభిస్తున్నారన్నది ప్రచారం కాని వాస్తవం. కశ్మీర్‌లోయ ప్రాంతం నుంచి సైనిక దళాలను ఉపసంహరించాలన్నది దశాబ్దుల తరబడి కశ్మీర్ ప్రాంతీయ రాజకీయ పక్షాల కోరిక. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-రెండూ పోటాపోటీగా ఈ కోరికను వెళ్లగక్కడం చరిత్ర. కానీ కశ్మీర్‌లో సైనిక దళాల ఉనికి పలుచబడినప్పుడల్లా జిహాదీ బీభత్సకారులు విజృంభించడం, విరుచుకొని పడడం 1947 నుంచి నడుస్తున్న చరిత్ర. దేశద్రోహులకు, జిహాదీ బీభత్సకారులకు వ్యతిరేకంగా మాత్రమే సైనికులు పోరాడుతున్నారు. ప్రజలకు సైనికుల వల్ల ఇలా రక్షణ ఏర్పడింది. అందువల్ల సైనిక దళాలను కశ్మీర్ నుంచి ఉపసంహరించాలని పదేపదే కోరుతున్నవారు ప్రజాహితానికి, దేశ భద్రతకు వ్యతిరేకులు. హురియత్ ముఠాలు, జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-జెకెఎల్‌ఎఫ్-వంటి దేశ వ్యతిరేక ము ఠాలు, కశ్మీర్‌నుంచి సైనికులను ఉపసంహరించాలని కోరడం సహజం. కానీ రాజ్యాంగం పట్ల నిబద్ధతను ప్రకటించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవుతున్న రాజకీయ పక్షా ల వారు సైనికులను ఎందుకని ద్వేషిస్తున్నా రు? పళనియప్పన్ చిదంబరం అనే కాంగ్రెస్ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడ జమ్మూకశ్మీర్ నుం చి సైనికులను ఉపసంహరించాలని ప్రకటిస్తూనే ఉన్నాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రి కాకపూర్వం అనేక ఏళ్లపాటు ఇలా సైనిక దళాలను ఉపసంహరించే కార్యక్రమం కొనసాగింది. ఫలితంగాక్రీస్తుశకం 1990వ సంవత్సరం ఆరంభంనాటికి జిహాదీలు స మాంతర పాలనను ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రాంతంలోని అల్పసంఖ్యాక హిందువులను రక్షించడంలో జమ్మూకశ్మీర్ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. పోలీసులు చూస్తుండగానే, వింటుండగానే ‘‘హిందువుల’’ను లోయనుండి వెళ్లిపోవాలని కోరుతూ గోడల మీద రాశారు. మైకులు పెట్టి వీధులు మారుమోగే విధంగా హెచ్చరికలు చేశారు. జిహాదీల ఈ బీభత్సకాండ ఫలితంగా 1990వ దశకం ఆరంభంలో అవశేష హిందువులు నిశే్శషం అయిపోయారు. సైనికుల ఉనికి తగ్గ డం వల్లనే కశ్మీర్ లోయనుండి యుగాలనాటి హిందువులు నిర్వాసితులయ్యారు, నిర్మూలన కు గురయ్యారు. 1992-93లో కేంద్ర ప్రభు త్వం ఈ విధానాన్ని మార్చింది. లోయ ప్రాం తంలో మళ్లీ సైనికులను భారీ సంఖ్యలో నెలకొల్పింది. వెంటనే సైనికులు కశ్మీర్‌లో మానవాధికారాలకు భంగం కలిగిస్తున్నారన్న ప్రచారా న్ని పాకిస్తాన్ మొదలుపెట్టింది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడైన భాజపా అధినేత అటల్ బిహారీ వాజ్‌పేయి మనదేశం తరపున వాదించడానికి ఐక్యరాజ్య సమితికి వెళ్లి వచ్చారు. పాకిస్తాన్ తీర్మానం సమితిలో వీగిపోయింది. అప్పటి ప్రధాని పివి నరసింహారావు విధానాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ ద్వానీల నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ఆమోదించడం రాజకీయ విభేదాలకంటె జాతిహితానికి ప్రాధాన్యం ఇచ్చిన భాజపా నిష్ఠకు నిదర్శనం. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడ కశ్మీర్‌లో సైనిక దళాలను తగ్గించలేదు. పళనియప్పన్ చిదంబరం దేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పు డు వెలగబెట్టిన నిర్వాకం వల్లనే కశ్మీర్‌లో మళ్లీ జిహాదీలు విజృంభించారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత పాకిస్తానీ జిహాదీలను లోయనుండి ఏరివేసే కార్యక్రమం పటిష్ఠంగా అమలు జరిగింది. బుర్హన్ వనీని తొలగించడం పరాకాష్ఠ. ఇలా భద్రత పెంపొందడానికి కారకులు సైనికులు. మరి సైనికదళాలను కశ్మీర్ నుండి తప్పించాలని, సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను కల్పించే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నవారు దేశానికి ఏమవుతారు? మిత్రులా? శత్రువులా? ఒక రాజకీయ నాయకుడు దుర్మార్గుడయితే మొత్తం రాజకీయవేత్తలు దుర్మార్గులని అనడం లేదు. ఒక ఉన్నత న్యాయమూర్తి అవినీతికి పాల్పడినాడు కనుక న్యాయమూర్తులందరూ అవినీతిపరులని ప్రచారం జరగడంలేదు. కానీ ఒక సైనికుడు చట్టవిరుద్ధంగా ప్రకటించినట్టు ఆరోపణ రాగానే మొత్తం సైనిక వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ‘‘సైనిక దళాలను ఉపసంహరించండి..ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయండి..’’ అని గొంతు లు చించుకుంటున్నారు!
ఇలా గొంతులు చించుకొనడంలో భాగంగానే ఇరోమ్ షర్మిల అనే మహిళ పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేసిందట. ఆమెను ‘‘ఉ క్కు మహిళ’’గా చిత్రీకరించి గొప్ప ప్రాధాన్యా న్ని కలిగించడానికి ప్రచారవేత్తలు నడుం బిగించారు. ఆమె పదహారు ఏళ్లపాటు నిరాహారంగా దీక్షచేసిందన్న ప్రచారం గొప్ప అబ ద్ధం. ఈ పదహారు ఏళ్లపాటు ఆమె ముక్కుకు గొట్టాన్ని బిగించి ద్రవ ఆహారాన్ని సమకూర్చారు. అలాంటప్పుడు ఆమె చేసింది నిరాహార దీక్ష కాదు ‘నీరాహార’ దీక్ష మాత్రమే. ఆమె దీక్షకు ప్రాతిపదిక సైనిక దళాల పట్ల వ్యతిరేకత. ఆమెను ‘మానవీయ అనుభూతి’ కథనాలతో నాయకురాలిగా మార్చ యత్నిస్తున్నవారు దేశానికి మిత్రులా? శత్రువులా? దేశ విద్రోహకర కలాపాల ద్వారా ఈశాన్య ప్రాం తాన్ని దేశం నుండి విడగొట్టడానికి యత్నిస్తున్న బీభత్సకారులకు సైనికులు వ్యతిరేకులు. ఈ షర్మిల సైనికుల అధికారాలకు వ్యతిరేకి..జాతీయ విచక్షణ ఏదీ? ఎక్కడ?

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com