మెయిన్ ఫీచర్

పరమాత్మునికి ‘జ్ఞాని’ అంటే ప్రీతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ ధర్మ శాస్త్రాలు
హిందూ ధర్మశాస్త్రాల గురించి ఉన్న కొన్ని దురభిప్రాయాలను, అపార్థాలను పరీక్షిద్దాం. వాటి సమస్యలపై కేంద్రీకరించడానికి వాటిని గురించి ప్రశ్నలు - జవాబులు రూపంలో దృష్టిసారిద్దాం.
ప్రశ్న : అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా లేనని వ్యక్తం చేసినప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుని యుద్ధం చేయమని ఎందుకు ప్రోత్సహించాడు?
ప్రొఫెసర్ డి.నికొలస్ ఎంతో సొంపుగా వివరించినట్లు యుద్ధం చేయడమా లేక మానడమా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఒక వేళ అర్జునుడు యుద్ధ భూమిని పరిత్యజిస్తే, అతడు ఆధ్యాత్మికంగానే కాక ప్రాపంచిక దృష్టికోణం నుంచి అనగా సామాజిక మరియు వ్యక్తిగత దృష్టికోణంలో కూడా విఫలమయ్యేవాడు. అతడు తన క్షత్రియ ధర్మం అనగా ఫలాపేక్ష రహితంగా ప్రవర్తించకపోవడము మరియు యుద్ధానికి భయపడకుండా ఉండటం నిరూపించుకోవడంలో విఫలమయ్యేవాడు.
ప్రశ్న: కర్మ చేయకుండా ఉండటం కన్నా కర్మ చేయడము మేలా ?
ప్రత్యర్థి పక్షం యుద్ధం గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వివరించి శ్రీకృష్ణుడు అర్జునున్ని కర్మ చేయటం యుక్తమని నమ్మిస్తాడు. ప్రొఫెసర్ డి.నికొలస్ మాటల్లో ‘‘మనల్ని మనం విధి, యాదృచ్ఛిక నిరాశలపాలు చేసుకుంటున్న మనం ఎటువంటి మనుష్యులం?’’
ప్రశ్న: పరమాత్మునికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి ఎవరు?
‘‘వేదాలను వల్లించే బ్రాహ్మణుని కంటే ప్రతి ప్రాణిని సమానంగా చూచే ‘జ్ఞాని’ పరమాత్మునికి అత్యంత ప్రీతి’’ అని కృష్ణ భగవానుడి ఉవాచ. జగద్గురు శంకరాచార్య పైన చెప్పిన విషక్ష్మీ సారాన్ని ఆయన రచించిన భజగోవిందం అని పిలవబడే కీర్తనల ద్వారా తెలిపారు. మొదటి కీర్తనని అనువదిస్తే ఈ క్రింది విధముగా ఉంటుంది.
‘‘భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే,
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్ కరణే’’ !
గోవిందుడిని భజించు, గోవిందుడిని భజించు, గోవిందుడిని భజించుము ఓ మూర్ఖుడా. మరణమాసన్నమైనప్పుడు నిన్ను ఏ వ్యాకరణ పాఠం రక్షించదు. భక్త ప్రహ్లాదుడు జ్ఞానికి నిదర్శనముగా నిలిచాడు. నిర్జీవమైన స్తంభంలో శ్రీ మహా విష్ణువును చూపమని అతని తండ్రి సవాలు చేసినప్పుడు ప్రహ్లాదుడు వెంటనే ఒప్పుకుంటాడు. అతని తండ్రి రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఆగ్రహంతో స్తంభాన్ని పగులగొట్టినప్పుడు నరసింహుని రూపంలో శ్రీ మహా విష్ణువు స్తంభం నుంచి వెలువడటం చూస్తాడు.
ప్రశ్న: జ్ఞాని శ్రీ కృష్ణునికి అంత ప్రియమైతే అతను ఎలా ప్రార్థింస్తాడు ?
అన్ని ప్రాణులు తన నుంచి ఎలా ఉద్భవించాయో శ్రీ కృష్ణుడు అర్జునునికి వివరంగా చెప్తాడు. జ్ఞాని భగవంతుడిని అన్ని ప్రాణులలోనూ అన్ని చోట్లా చూడగలడు. కనుక భగవంతుని దర్శించడానికి అతను దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదే విధముగా జ్ఞాని ఎల్లప్పుడూ భగవంతుని ఆలోచనల్లో ఉంటాడు. జగద్గురు శంకరాచార్యులు నిజమైన ఆధ్యాత్మికత గురించి భజ గోవిందంలోని ఒక అద్భుతమైన శ్లోకంలో విస్తారముగా చెప్పారు.
యోగరతోవ భోగరతోవ
సంగరతోవ, సంగవిహీన:
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యెవ !
ఆధ్యాత్మిక ఉద్ధారణకై యోగాలో లీనమయినప్పుడు లేక భౌతిక కార్యకలాపాలలో గానీ సౌఖ్యాలలో గానీ మునిగి తేలుతున్నప్పుడు లేక నీవు ఒంటరిగా ఉన్నా లేక స్నేహితులు చుట్టూ ఉన్నాగాని, ఎప్పుడైతే నీ మనస్సు భగవంతుని ఉనికి యొక్క ఆధ్యాత్మిక భావంపై కేంద్రీకృతం చేస్తావో, అప్పుడు నిన్ను నీవు సంతోషంగా మరియు పరమానందంతో ఉన్నట్లు కనుగొంటావు. నిజమైన ఆధ్యాత్మికతకి మరియు రాజకీయాల మధ్య తేడాని మొత్తం విస్తృత ప్రపంచానికి తెలియజేస్తోంది.
అందుకే శంకరాచార్యులు ‘‘జగద్గురు’’ లేక ‘‘సార్వత్రికోత్తమ ఆధ్యాత్మిక మహా గురువు’’ అని పిలువబడ్డారు.
జగద్గురు శంకరాచార్య ‘‘అహం బ్రమ్మాస్మి’’ అని ప్రకటించినప్పుడు, శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పినట్లుగా, అతను తన నిజమైన స్వభావమును, శారీరకంగా మరియు ఆత్మలోనూ ప్రపంచానికి చూపించాడు. శ్రీ కృష్ణుడు తనను తాను సృష్టికర్తగా ప్రకటించాడు.
ఆధ్యాత్మికత మరియు మత యుద్ధాల నినాదాల మధ్య వైరుధ్యం అర్థం చేసుకోవడానికి తోడ్పడేటందుకు, ఒక విలువైన వజ్రాన్ని తన శిఖరం పైన కలిగిన ఒక ఎతె్తైన చెట్టును లేదా ఒక నిటారుగా ఉన్న పర్వతాన్ని ఊహించుకోండి.
ఎక్కడానికి మద్దతునిచ్చే చెట్టు కొమ్మలు లేదా రాళ్ళు చాలా బలంగా ఉండాలి. లేదా మనం పడిపోవడం తధ్యం.
అటువంటి మెట్లు లేకపోవటం, చాలా ప్రధాన విశ్వాసాలలో ఉన్న దురదృష్టకరమైన నిజం.
ప్రశ్న : అతి క్లిష్ట సమయాలలో స్టితప్రజ్ఞత కలిగియుండటం సాధ్యమా?
దుర్యోధనుడు మరియు అర్జునుడు యుద్ధంలో సహాయాన్ని అపేక్షిస్తూ ఇద్దరు కృష్ణుని దగ్గరికి వెళ్తారు. కానీ దుర్యోధనుడు మొదట చేరుతాడు. అప్పుడు కృష్ణుడు నిద్రిస్తున్నాడు. కృష్ణుని మేల్కొలపకూడదని దుర్యోధనుడు కృష్ణుని పడకకు తల వైపున కూర్చుంటాడు. ఎందుకనగా అతని దృష్టిలో రాజు గొప్పతనానికి తగినట్లుండాలి కదా! కొంత సేపు తరువాత అర్జునుడు అక్కడికి వచ్చి కృష్ణుని కాళ్ళకు దగ్గరగా కూర్చుంటాడు.
నిద్ర లేవగానే కృష్ణుడు మొదట అర్జునుని చూచి పలకరించిన తరువాత దుర్యోధనుని చూచి పలకరిస్తాడు. అర్జునుని కన్నా తానే ముందు వచ్చాడు. కాబట్టి సహాయాన్ని అపేక్షించే అవకాశం తనకే ముందర యివ్వాలని దుర్యోధనుడు అంటాడు. కృష్ణుడు ఆయుధం ధరించని తానొక వైపు మరియు సశక్తమైన తన సేన మరొక వైపు ఉండేలా భాగించి దుర్యోధనుడుని రెండింటిలో ఒకవైపు ఎంచుకోమంటాడు. దుర్యోధనుడు ఆనందంగా సేననే కోరుకోగా అర్జునుడు తన కొరకు తన ప్రమేయం లేకుండా చేయబడిన ఎంపికకి సంతోషిస్తాడు.
అసలు దుర్యోధనునికి కృష్ణుడు సహాయం ఎందుకు చేయాలి? అధర్మవర్తనునికి సహాయ పడటం ధర్మం కాదని నిరాకరించి యుండవచ్చు. ఇది అర్ధం చేసుకోవాలంటే న్యాయ స్థానాన్ని ఊహించుకోవాలి. నిందితునికి సైతం తనను పరిరక్షించుకోవాలంటే తన వైపు సాక్ష్యులను న్యాయ స్థానంలో హాజరుపరచేందుకు అనుమతి ఉంటుంది. తుది తీర్పు వచ్చే వరకు అతనికి కావలసినది మరియు అవసరమైన సహాయ సదుపాయాలు అందివ్వాలి. కృష్ణుడు అదే చేశాడు.
న్యాయ స్థాన సంఘ పద్ధతిలో న్యాయాధీశుడు జరిగే విచారణను పర్యవేక్షిస్తారు. కానీ తీర్పు మాత్రం న్యాయ స్థాన సంఘ సభ్యులు ప్రకటిస్తారు. అది సామాన్య పౌరులతో కూడి నిందితునికిగాని, బాధితునికి గాని ఎటువంటి సంబంధం లేని నిష్పక్షపాత ధర్మ నిర్ణయం చేయడానికి ప్రమాణం చేసి నియమింపబడిన పౌర సముదాయము. బాధితుడైన అర్జునుని ఫలాపేక్ష లేకుండా వ్యవహరించమని అడగడం బాధితుడు లాగా లేక భావావేశం కలిగిన వ్యక్తి లాగా కాకుండా న్యాయ స్థాన సంఘంలా వ్యవహరించమనడంతో సమానం.

ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562