మెయిన్ ఫీచర్

యుద్ధ నియమాలు -5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: ఇందులో దాగియున్న ఆధ్యాత్మికత పరమార్థానికి ఏమైనా సమాంతరం ఉందా?
‘‘్ధర్మక్షేత్ర కురు క్షేత్రే’’ అన్న పదాలతో భగవద్గీత మొదటి శ్లోకం ప్రారంభమవడానికి కారణమిదే.
ధర్మాన్ని నెలకొల్పడం ఎన్నో విధాలుగా న్యాయాధీశుడు కాకుండా న్యాయస్థాన సంఘం తీర్పునివ్వడం లాంటిదే. గీతలోని తొలి పలుకులు ‘‘్ధర్మక్షేత్ర కురు క్షేత్రే’’ నిర్ణయం తీసుకొనుటలో నైతిక విషయం మరియు గీత యొక్క సౌందర్యానికి గొప్పతనానికి మార్గం ఏర్పరచడంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని క్రింద ఇవ్వబడిన వివరణలో కనిపిస్తుంది.
గీత మరియు ధర్మానికి ప్రతికూలంగా నడిచే దుర్యోధనుని తండ్రి ధృతరాష్ట్రుడు పలికిన పలుకులివి.
కురు క్షేత్ర రంగంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇతర మాటలలో చెప్పాలంటే క్షత్రియునిగా అతను యుద్ధ నియమాలు అనుసరింపబడుతున్నాయని ఒప్పుకున్నాడు. యుద్ధం జరిగే ముందు నియమాలు నిశ్చయింపబడాలని ప్రపంచానికిది గొప్ప పాఠం.
‘‘పొరుగువాని ప్రేమించు’’ అన్న నానుడిపై గీత కాంతి ప్రసరింపచేసి పరిశీలిస్తే స్పష్టత కనబడుతుంది. ఈ సందేశం ప్రేమతో ఉన్న గందరగోళాన్ని సంబోధించడం లేదు. ఎవరైనా ఎదుర్కొనే చిక్కు ప్రశ్న ఏమిటంటే ఒకరికంటే మరొకరిని ఎక్కువగా ప్రేమించడానికి కారణాలు మరియు సమర్ధనలు ఉంటాయి. మనుష్యులు తమ స్నేహితులు, బంధువులు మరియు ఆప్తులని చూచినప్పుడు కొన్ని ప్రత్యక్ష కారణాల వల్ల మిగతా వారి కంటే ఎక్కువగా తమ నుంచి ప్రేమ పొందే అరత్హ ఉందన్న అనుభూతి చెందుతారు లేక నమ్ముతారు.
ప్రేమ అనే పదం యొక్క నిజమైన అర్థం కేవలం భగవద్గీత ‘సాంగ్ ఆఫ్ ద డివైన్’ లభిస్తుంది. ఇంకెక్కడా కాదు. కృష్ణ్భగవానుడు అర్జునునికి తెలియజేస్తాడు ప్రేమ మరియు ద్వేషం, ఇష్టం లేదా అయిష్టం వంటి ద్వంద్వమైన వాని వల్ల అతి ప్రేమ, బలమైన అనుభూతి లేదా ఉత్సాహంతో కూడిన భావోద్వేగం వంటివి ఉత్పన్నమవుతాయి. నిఘంటువులో ‘ద్వంద్వం’కి అర్థం ‘రెండు రకాల స్వభావాలు లేదా ప్రవృత్తులు’ అలా అవి జంట పాత్రలు పాటిస్తాయి. దీనిని మానవులు గ్రహించవచ్చు లేదా గుర్తింపలేకపోవచ్చు.
వేలాది సంవత్సరాలుగా మత పరమైన యుద్ధాలను ఆపేందుకు నీ పొరుగువానిని ‘ప్రేమించు’ అని సందేశం విఫలం కావడం వాస్తవాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని లేదా అపార్థానికి దారి తీస్తున్నాయని సూచిస్తుంది. మత మార్పిడులకు ఉపయోగించే సాధనం లాగా అనిపిస్తుంది. ‘సత్యమేవజయతే’ లేదా సత్యం విముక్తి కలిగిస్తుంది అనే వాటిలో ‘సత్యం’ అనేది వాస్తవానికి దగ్గరగా ఉండే సత్యం.
‘ప్రేమ’ యొక్క అర్థాన్ని గొప్ప తత్త్వవేత్త స్వామి వివేకానందతన స్పష్టమైన మాటల్లో వివరిస్తారు.
స్వామి వివేకానంద ఇలా చెప్పారు:‘‘అర్జునుని మనస్సులో భావోద్వేగానికి, కర్తవ్యానికి మధ్య ఘర్షణ ఉంది. మనం (మృగాలకు) పక్షులకు ఎంత దగ్గరగా ఉంటే అంత తీవ్ర భావోద్వేగంలో ఉంటాయి. దానిని మనం ప్రేమ అని పిలుస్తాము. ఇది స్వీయ సమ్మోహనం. మనం జంతువుల వలె మన (్భవోద్వేగాల) నియంత్రణలో ఉన్నాము. ఒక గోవు తన బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేయగలదు.
ప్రతీ జంతువు కూడా. దేని కోసం? ఇది ఒక పరిపూర్ణత్వానికి దారి తీసే ఒక గుడ్డి, పక్షి లాంటి భావోద్వేగం కానిది.... (చేరుకోవడానికి) నిత్య జ్ఞానము, అదే మానవుని లక్ష్యం. అక్కడ భావోద్వేగానికి లేదా మానసిక భావములకు లేదా ఇంద్రియాలకు సంబంధించిన ఎలాంటి వాటికి కూడా చోటు లేదు- కేవలం స్వచ్ఛమైన కారణం. (అక్కడ) మానవుడు ఒక ఆత్మగా ఉంటాడు.’’
న్యాయస్థానంలో సంఘ సభ్యులను ప్రేమ మరియు ఇతర భావోద్వేగ అనుబంధాలకు అతీతంగా ఉండవలెనని ఆదేశిస్తారు. ఎందుకంటే న్యాయ స్థాపనకు ఇవి అడ్డుగా ఉంటుంది కనుక. న్యాయస్థానంలో చెల్లని విధానాలు న్యాయస్థానం బయట కూడా చెల్లుబాటు కావు. వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు సహాయం చేయని ఈ నానుడి వాంఛనీయమైన కోరిన తప్ప ఇంకొకటి కాదు. సంధి కోసం ప్రయత్నించి విఫలమైన తరువాత ధర్మాన్ని రక్షించుటకై అర్జునుని భావావేశ విముక్తుడు కావలెనని శ్రీ కృష్ణుని సందేశం. తన గురించే కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అర్జునుని ఆలోచించమని అతని సలహా.
ఏ దేశాలలో న్యాయ సంఘాన్ని ప్రధానంగా అనుసరిస్తారో, న్యాయ సంఘ కర్తవ్యం ప్రతి పౌరునికి తప్పనిసరి మరియు తిరస్కరింపరాని కర్తవ్యం.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562