మెయిన్ ఫీచర్

ఇంపైన ఇకత్ చీరలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య కాలేజీల్లో జరిగే వేడుకలకు అమ్మాయిలు అదిరేటి డ్రెస్సులే వేసుకోవటం లేదట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు చక్కటి చేనేత చీరలు ధరించి హుందాగా హొయలొలికిస్తున్నారు. అమ్మాయిల మనసు ఆకట్టుకునేలా.. చేనేత వస్త్రాలు రకరకాల డిజైన్లలో వస్తున్నాయి. చేనేతలో ప్రసిద్ధి చెందిన ఇకత్ చీరలు ధరించి, పైన బ్లేజర్ వేసుకుని అమెరికాలో జరిగిన ఓ వేడుకలో భారతీయ అమ్మాయిలు కనువిందు చేశారట. ఇదే బాటలో ఇక్కడ కూడా కాలేజీ వేడుకల్లో అమ్మాయిలు చేనేత వస్త్రాలనే ధరించి కొత్త లుక్కుతో కనికట్టు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన ఈ నేతపట్టు చీరలు ఇంచుమించు గద్వాలు, బనారస్, పోచంపల్లి పట్టుచీరలకు దగ్గర పోలికలు ఉంటాయి. నూలు పద్ధతి భిన్నంగా ఉండటం వల్లనేమో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అందాల ఐశ్వర్యారాయ్ మొదలుకుని సామాన్యులు, మధ్యతరగతి మహిళలు మక్కువతో ఇకత్ చీరలు ధరిస్తున్నారు. ధరలు సైతం అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. రెండువేల రూపాయలు మొదలుకుని ఇరవై వేల రూపాయలు వరకు ధర పలికే ఈ ఇకత్ చీరలు ఇంతులకు ఇష్టసఖిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పువ్వుల డిజైన్‌లో మాత్రమే లభించేవి. నేడు ఆధునిక డిజైన్లను సంతరించుకుని నేటితరం అమ్మాయిలు ఇష్టపడేలా వస్తున్నాయి. ఒడిశా నేత కార్మికుల మేధ స్సు, సృజనాత్మకతకు చిహ్నంగా నిలిచే ఈ ఇకత్ చీరలు మేనిని అంటిపెట్టుకునే మహాత్యం దాగివుంది. సిల్క్, కాటన్, పట్టు ఫ్యాబ్రిక్‌లలో లభ్యమయ్యే ఇకత్‌లో చీరలు మొదలుకుని కుర్తీలు, స్కర్ట్స్, సల్వార్లు, టాప్‌లు, బ్లౌజ్ మెటీరియల్స్, చున్నీలు..ఇలా అన్నిరకాలు లభ్యమవుతున్నాయి. ఒక్క వేసవి కాలంలోనే కాదు శీతాకాలం, వర్షాకాలంలో వచ్చే పండుగలు, ఫంక్షన్లను హుందాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. రెండు, మూడు రంగులు మిళితమై సాధారణంగా పువ్వులు, చేపలు, శంఖం, ఏనుగులు, జింకలు, చిలుక తదితర జంతువులు, పక్షుల డిజైన్లలో ఉన్నప్పటికీ గాడీగా కనిపించకపోవటం వీటి ప్రత్యకత. డిజైన్లు ప్రత్యేకంగా కనిపించటం వల్ల చూడచక్కగా ఉంటాయి. రకరకాల డిజైన్లతో పాటు డిఫరెంటు కలర్ కాంబినేషన్లలో నేడు అందుబాటులో ఉంటున్నాయి. ఏ వయసువారికైనా, ఎలాంటి శరీరాకృతిగలవారికైనా ఇవి చక్కగా నప్పుతాయి.