మెయిన్ ఫీచర్

సత్వగుణమే గొప్పదా!? -7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: భగవంతుడు నాలుగు గుణాలను ఎందుకు సృష్టించాడు?
ప్రొఫెసర్ డి.నికొలస్ వివరణ ప్రకారం అర్జునుడు తమోగుణంతో ఉన్నాడు. ‘‘చాతుర్వర్ణం’ అనే పద్యాన్ని నాలుగు వర్గాల ప్రజలుగా లేక కులములుగా విభజించడాన్ని సూచిస్తోందని అనుకోవడం తప్పు. మనిషి యొక్క మనస్తత్వాన్ని మరియు క్రియలను అర్థం చేసుకోగలగడానికి మాత్రమే చెప్పబడింది. వేదాలలో ‘‘కార్యసిద్ధి సత్వే భవతి’’ అని ప్రపంచానికి మహత్తరమైన దివ్య సందేశంగా చెప్పబడింది. దీని వలన గ్రహించవలసి నదేమంటే ఒక కార్యాన్ని సాధించటానికి తనని తాను మనశ్శాంతితో సున్నితమైన మరియు నిరాడంబరమైన వైకరిలోకి తీసుకొని రావాలి. ఒక వ్యక్తిలో అధ్యయనం చేయగలిగిన గుణం తెచ్చేందుకు యిది ఎంతో అవసరం. పైన చెప్పిన వైదిక సూచన మార్గ దర్శకత్వంలో విస్తృత పరిధి కలిగి ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు మనస్సు ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు చేయాలి. గుర్రపు స్వారీ లేక ఈత నేర్చుకోవడానికి మొదట గురువు నుంచి సూచనలు లేదా ఆజ్ఞలు గ్రహించడానికి నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి. ఆజ్ఞ అన్న పద ప్రయోగానికి కారణమేమిటంటే గురువు నీ ప్రాణరక్షకుడు కావచ్చు. ‘‘ఆచార్య దేవోభవ’’ అన్న వేద మంత్ర సారాంశాన్ని ఇది వివరిస్తుంది.
‘‘సత్వ గుణం ’’ విద్యా విధాన వ్యవస్థలో మంచి విద్యార్థిగా తీర్చిదిద్దడానికి తోడ్పతుంది. అలాగని సమాజ సేవలో నీ ప్రతిభావిశేషాలు ఉపయోగించగలిగే నేర్పు నీకు వస్తుందని చెప్పలేము. ఉదాహరణకి ఈత నేర్చుకొనే తరగతిలో ఉన్నత స్థాయి విద్యార్థులలో ఒకరిగా కాకపోవచ్చు కానీ వారి యితర శక్తులు వల్ల మునిగేపోయేవారిని కాపాడడంలో విజయవంతం కావొచ్చు. తరగతిలో ఉన్నత స్థాయి విద్యార్థి అయినంత మాత్రాన వాస్తవ ప్రపంచంలో విజయం సాధిస్తారని అనుకోలేము. తాను పరిపూర్ణుడు కాదని భావించే అర్జునుడుని అధైర్యపడవద్దని కృష్ణ్భగవానుడు పైన తెలుసుకున్న సమాంతర ఆలోచన ద్వారా సూచిస్తాడు. అర్జునుడు తన గురువునే ఎదుర్కొనవలసిన పరిస్థితి అది. ఈ సూచనని తప్పుగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు వారి యొక్క సంప్రదాయ వృత్తిని ఎట్టి పరిస్థితుల్లో విడువరాదని చెప్పినట్లుగా అనుకొనే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఉన్న సంక్షోభ స్థితి అటువంటిది.
ఎవరికైతే సైనిక నియమాలు పరిచయం లేదో వారి ప్రయోజన నిమిత్తమై ఈ క్రింది విషయాలు పస్తావించబడినవి. ఈ రోజు కూడా అనేక దేశాల్లో, అనుమతి లేకుండా లేదా పారిపోవడం లేదా యుద్ధ్భూమి నుండి తప్పించుకుపోవడం అనేది సైనిక నియమ ఉల్లంఘన క్రింద పరిగణించబడుతుంది. వారిని బంధించి సైనిక న్యాయ స్థానంలో విచారణ చేస్తారు. దోషిగా తేలితే, వారిని అగౌరవరీతిలో సాగనంపుతారు. ఈ అవాంఛనీయ పర్యవసానం కృష్ణ్భగవానుడు అర్జునునితో చెప్పినదానికి భిన్నమైనది కాదు.
హిందూ మతంలో వ్యక్తిగత సాధన ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ప్రాధాన్యత వహిస్తుంది. పురుషార్థాలుగా చెప్పబడే ‘‘్ధర్మ’’, ‘‘అర్థ’’, ‘‘కామ’’ మరియు ‘‘మోక్ష’’ వరుసక్రమం కూడా ఇదే సూచిస్తుంది. ఆస్తి చట్టాలు కూడా ఇదే భావాన్ని బలపరుస్తాయి. అర్జునుని ఈ స్థితికి తీసుకురావడానికి సులభంగా నేర్చుకొనే విధానంలో గుణ సిద్ధాంతాలని వివరించడం కన్నా శ్రీ కృష్ణునికి వేరే దారి లేదు. కానీ సత్వ గుణమే అన్ని గుణాల కన్నా గొప్పదని శ్రీ కృష్ణుడు చెప్పలేదు. అలాగైతే అర్జునునికి ఇచ్చిన సలహా ఈ ఉద్దేశ్యాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. సంబంధిత పరిస్థితుల మీద ప్రధానంగా యిది ఆధారపడి ఉంది. ప్రొఫెసర్ డి.నికొలస్ యొక్క చక్కటి వివరణ ప్రకారం ‘‘కర్తవ్య నిర్వహణ అనుభవాతీతమైన పరిస్థితిలో కాకుండా సంక్షోభంలో ఉన్నప్పుడు మన స్థితిగతుల గురించి ఆందోళన పడుతున్నప్పటికీ ధర్మాచరణ దృక్పధంతో నిర్ణయం తీసుకొనవలసిన స్పష్టమైన పరిస్థితిలోనే జరుగుతుంది.’’
ఉదాహరణకి ఒక దొంగతనం నీ సమక్షంలో జరుగుతున్నప్పుడు లేక మిపరు సాక్షి అయినప్పుడు ‘‘సత్వ గుణం’’ పాటించడం గీత బోధనలను తప్పుగా అర్థం చేసుకున్నట్టే. ఇటువంటి పరిస్థితుల్లో రజోగుణంతో ప్రవర్తించాలి. ఒక గురువు తన శిష్యులకు క్రమశిక్షణ నేర్పే సమయంలో కూడా ఇదే వర్తిస్తుంది. తమోగుణం చెడ్డదని భగవద్గీత చెప్పలేదు. అన్ని జీవరాశులు‘‘నిద్ర’’లో ఎక్కువ సమయం గడుపుతారు. కనుక దీనిని తమోగుణం లేదా జడత్వంగా వర్గీకరించవచ్చు. శరీరం మరియు మనసు ప్రశాంతంగా ఉండే స్థితే నిజమైన ‘‘సుఖ’’ స్థితి. ‘‘సుఖం’’ మరియు ‘‘ప్రశాంతత’’ అనే పదాల అర్థం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే తరువాత విభాగాలలో ప్రస్తుతించబోయే వేదాశీస్సులలో ఈ పదాలు ఉంటాయి. సుఖానికి, సంతోషానికి కారణాలు భిన్నంగా ఉంటాయి. సంతోషాన్ని తాత్కాలిక ఆనందంగా లేక పరిహాసంగా కూడా పరిగణిస్తారు ఎందుకంటే దీని కోసం కర్మ చేయడం అవసరం. సంస్కృత పదమైన ‘‘సుఖం’’కి ఆంగ్లభాష పదమైన ‘‘హాపీనెన్స్’’ అర్థం చాలా దగ్గరగా ఉంటుంది. తరచుగా అది వాడకంలో ఉంది కానీ అందులో దాని సంపూర్ణ అర్థాన్ని అంత విస్తృతంగా వివరించబడలేదు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినది ఏమిటంటే తమోగుణంలో ఉన్న వ్యక్తి ఆ స్థితి నుంచిబయటపడలేదు లేక బయటపడదల్చుకోలేదు అని చెప్పడంగానీ లేక అనుకోవడంగానీ తప్పు. ఈ గుణాలన్నీ తెల్లని వెలుగు నుంచి వెలువడిన రంగుల వంటివి. రంగుల మోతాదు శాతం మార్పుతో ఆయా రంగుల సమ్మేళనము జరిగి వేరు వేరు రంగులుగా కనిపిస్తాయి.
అందుకే వాటిని శ్రీకృష్ణుడు వర్ణాలుగా చెప్పాడు. కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ గుణాలలో లేదా స్థితులలో తాత్కాలిక దశగా వివిధ కాలపరిమితులలో జీవితాన్ని గడుపుతారు. సుషుప్తా వస్థలో ఉన్న వారు లేక శరీరం చలన రహితంగా ఉన్న తపోధనులు ఆనంద స్థితిలో ఉంటారు. కొన్ని సమయాల్లో మానవుల మనస్సు సముద్రంతో పోల్చబడింది. నీటి ఉపరితలం నిరంతరంగా చలనంలో ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చాలా సమయాల్లో శీతలంగా అనిపించే నీరు వేసవిలో గాలివానలకి, తుఫానులకి మూలకారణం అవుతుంది. అదే విధంగా మానవుల మనస్సు వర్ణనాతీతమైన నిరంతర రూపాంతర చర్యలో ఉంటుంది.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562