మెయిన్ ఫీచర్

న్యాయం జరిగేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది జనవరిలో జమ్మూలోని కథువా జిల్లా లో బకఠ్వాల్ సమాజానికి చెందిన ఒక బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులు వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల ఆ బాలికను దేవాలయంలో బంధించి, వారం పాటు సామూహిక అత్యాచారం చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి కొన్ని నిముషాల ముందు వరకూ కూడా పాపపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. తర్వాత శవాన్ని అడవిలో పడేశారు. ఈ కేసు గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమైంది. అప్పుడు కేవలం 90 రోజుల్లో న్యాయం చేస్తాం అన్న పెద్ద మనుషులు.. ఏడాది గడిచినా ఇప్పటివరకూ చనిపోయిన పాపకు, పాప తల్లిదండ్రులకు న్యాయం లభించలేదు. 2018 మే నెల్లో సుప్రీం కోర్టు కథువా గ్యాంగ్ ఠేప్, హత్య కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు బదిలీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం సొంత గ్రామలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు. మరో ఇద్దరు పిల్లలు చెరో చోట ఉండి చదువుకుంటున్నారు. వారు రసానా గ్రామం రావాలంటేనే భయపడిపోతున్నారట. కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబం ఇంటికి దగ్గరగా పోలీసులు ఒక టెంటు వేసుకుని 24 గంటలూ విధుల్లో ఉంటారు. కానీ ఈ గ్రామంలో ఇప్పడు సోదరభావం లేదు. ఈ ఘటన తర్వాత నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా మారింది. గ్రామస్థులు బకర్వాల్ సమాజం వారికి పశువుల కోసం గడ్డి కూడా ఇవ్వడం లేదట.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాప తల్లిదండ్రులు అక్కడ ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. పాప తండ్రి మాట్లాడుతూ.. ‘వకీలు మాకు న్యాయం లభిస్తుందని చెబుతారు.. కానీ ఎప్పుడు దొరుకుతుందో మాత్రం చెప్పరు. అసలు న్యాయం లభిస్తుందో కూడా తెలీడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఇక్కడ ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడే ఉంది. నాకు నా పశువుల కోసం గడ్డి కూడా దొరకడం లేదు. దూరంగా అడవిలోకి తెచ్చుకోవాల్సి వస్తోంది. అక్కడ క్రూర మృగాలు ఉండటం వల్ల ప్రమాదం పొంచి ఉంది. మా గ్రామం, ధమ్యాల్ గ్రామాల్లోని జనం మమ్మల్ని చాలా నీఛంగా చూస్తున్నారు. మొదట అందరం కలిసిమెలిసి ఉండేవాళ్లం. మంచీ చెడూ మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్లు మాతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోవడం లేదు. నా బిడ్డను చంపినవాళ్లే మా మధ్య చిచ్చుపెట్టారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు.. మాతో మాట్లాడటం మానేశారు. గ్రామంలో ఉన్నా.. మేం ఒంటరిగానే బతుకుతున్నాం. అయినా ఫర్వాలేదు.. నా కూతురికి న్యాయం జరిగితే చాలు’ అంటూ బాధపడ్డాడు పాప తండ్రి.
పాప తల్లి మాట్లాడుతూ.. ‘వాళ్లు 90 రోజుల్లో న్యాయం చేస్తాం అన్నారు. కానీ ఏడాది గడిచినా మాకు ఇప్పటి వరకూ న్యాయం లభించలేదు.. న్యాయం దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. ఇప్పటికీ మా పాప జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆడుకుంటూ మధ్యలో నా దగ్గరకు వచ్చి అమ్మా నాకు రోటీ ఇవ్వవా.. అని అడిగేది. తనకు పళ్లంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నను ఎప్పుడూ నారింజలు, అరటిపళ్లు, బిస్కట్లు తెమ్మని చెబుతూ ఉండేది. పడుకున్నా, లేచినా పాప జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. నేను ఇప్పటికీ తన బొమ్మలు, బట్టలు అలాగే ఉంచుకున్నా. ఈ బొమ్మలను నా పాపే తన చేతుల్తో అల్మరాలో పెట్టింది. కానీ మా బొమ్మ మాత్రం మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది.’ అంటూ చెమర్చిన కళ్ళను తుడుచుకుంది ఆ తల్లి.
తొంభై రోజుల్లో న్యాయం చేస్తామని చెప్పిన కోర్టు మాత్రం ఇచ్చిన మాటని, బాధితుల సమస్యల్ని పట్టించుకోకుండా వాయిదాలపై వాయిదాలు వేస్తోంది. ఇలా ఎన్నికేసులో.. ఎంతమంది బాధితులో..