మెయన్ ఫీచర్

నిర్లక్ష్యానికి పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాకారులను క్రీడాకారులను గౌరవించుకోవడం సంస్కారవంతమైన జాతి లక్షణం. అవకాశం ఇస్తే ఆకాశం ఎత్తు ఎదిగే ధనుర్విద్యాపారంగతులు నేటికీ అడవుల్లో ఎందరో ఉన్నారు. గురువులకు ద్రోణాచార్య సత్కారాలు, క్రీడాయోధులకు అర్జున, ఖేల్ రత్న వంటి బిరుదులు ప్రసాదించడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే. భారత్ పేరు చెప్పగానే హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చం ద్ జ్ఞాపకానికి వస్తాడు. మల్లయోధుడు కోడి రామ్మూర్తి తెలుగువారి ముద్దుబిడ్డ. ఇటీవల (2016) రియోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే నిమిత్తం భారతదేశంనుండి దాదాపు 118 మంది క్రీడాబృందం పయనించింది. అంతా వారివారి శక్త్యానుసారం పోరాడారు. ఇక జయాపజయాలు దైవాధీనాలు కదా. పి.వి. సింధు తృటిలో స్వర్ణం కోల్పోయినా భారతదేశానికి రజతకాంతిని తెచ్చింది. అం దుకు ఆమెను దేశ ప్రజలు సముచిత రీతిలో గౌరవించుకొని కృతజ్ఞతను వెల్లడించుకున్నారు. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో ఈ చిన్నారి స్వర్ణం సాధిస్తుందని ఆశిద్దాం. అలాగే భారతదేశానికి కాంస్యపతకం సాధించిపెట్టిన సాక్షిమాలిక్‌ను కూడా అభినందిద్దాం. తప్పకుండా గెలుస్తారని ఆశించిన కొందరు హేమాహేమీలు నిరాశపరిచినా క్రీడారంగంలో స్పో ర్టివ్ స్పిరిట్‌తో తీసుకోవలసిందేనని సంతృప్తి పడాల్సిందే. ఎందుకంటే అన్ని వందల దేశాల మధ్య భారత్ జెండా ఎగురవేయడమే గర్వకారణం. కొందరు వ్యాఖ్యాతల దృష్టిలో ఈ త ర్కం సరియైనది కాదు. కేవలం పాల్గొనడం కోసం కాదు, విజయం కోసమే వెళ్లాలనేది వారి వాదం. ఐతే అందుకు తగిన అవకాశాలు మనదేశంలో క్రీడారంగంలో పాఠశాలల్లో, కళాశాలల్లో ఏర్పాట్లు చేశారా? ర్యాంకుల వేట లో మోతమోగించే కార్పొరేటు విద్యావిధానం లో క్రీడా స్ఫూర్తి ఉందా? ఆలోచించండి. అస లు ప్లే గ్రౌండ్ లేని పాఠశాలలు కశాళాలలు అత్యధికంగా ఉన్నాయి. వాటికి ప్రభుత్వాలు లోగడ గుర్తింపునిచ్చాయి.
2016 రియోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కొన్ని దారుణ సంఘటనలు జరిగాయి. మానవత్వం సిగ్గుతో తలవంచుకోవలసిన దారుణ సంఘటనలివి. మారథాన్ 42 కిలోమీటర్ల పరుగులో ఒక సన్నివేశం చోటుచేసుకుంది. భారత తిరంగా జెండాను రియో గగనతలం లో ఎగురవేయడానికి వెళ్లిన ఆ యోద్ధ పేరు ఒ.పి.జైషా. లోగడ ఈమె ఆసియా క్రీడల వంటివాటిల్లో కూడా ఘనవిజయాలు సాధించింది. ఈమెకు కోచ్ విదేశీయుడు. అతనికి హిందీ రాదు. ఆమెకు ఆంగ్లం రాదు. ఇలా ఎందుకు జరిగింది?
ప్రతి ఆటకు కొన్ని నిబంధనలున్నట్టే ఒలింపిక్స్‌లో కూడా కొన్ని స్పష్టమైన సూచనలున్నాయి. మారథాన్ క్రీడాకారులకు ఒక కిలోమీటరు దాటగానే మెడికల్ ఏర్పాట్లు ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్, గ్లూకోజ్ వంటి ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వాలి. ఇది అందరికీ తెలిసిందే. ఈ బాధ్యత సామాన్యంగా ఆమె/అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశమే చూసుకోవాలి. రియోలో మారథాన్ పరుగు ప్రారంభమైన సమయంలో ఉదయం 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నది. జైషా పరుగుల పందేన్ని మొదలుపెట్టింది. ఒకచోట, రెండు చోట్ల, మూడు చోట్ల కూడా ఆమెకు గుక్కెడు మంచినీళ్లు ఏర్పాటు చేసినవారే కరవైనారు. మరి జైషాకు ఎందుకు చుక్క నీరు ఇవ్వలేదు? ఐనా పాపం చిన్నారి 42 కిలోమీటర్ల దూరం పరుగుపందెంలో ముందుకు సాగింది. చివరకు స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతికి ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానకి మూడు గంటల తర్వాత అక్కడికి డాక్టర్లు వచ్చారు. ఏడు గ్లూకోజ్ బాటిళ్లు ఎక్కించారు. అసలు ఆ అమ్మాయి ఎలా బ్రతికింది? అని డాక్టర్లు ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. రియో ఆసుపత్రి వద్ద గొడవ జరిగింది. జైషా కోచ్‌గా ఉన్న వ్యక్తిని అవతలికి నెట్టివేశారు. ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే తమమీదకి వస్తుందేమోనని రియో అధికారులు భయపడ్డారు.
ఈ విషయం పత్రికల్లో, ఛానల్స్‌లో వచ్చేసరికి భారత క్రీడా మండలి కుడితిలో పడిన ఎలుకలా గిజగిజలాడింది. ‘‘ఇందులో మా తప్పేముంది? దీనికి క్రీడాశాఖామాత్యులు విజయ్ గోయల్ బాధ్యత వహించాలి’’ అని ఒకరన్నారు..‘‘సత్పురుషుడు ఆయనదేం తప్పుంది? ఇందుకు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఫ్‌ఐ) బాధ్యత వహించాల’’ని కొందరు న్యాయకోవిదులు ధర్మసూక్ష్మాన్ని వెలువరించారు. ‘‘ఇందులో మా తప్పేముం ది? ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ బాధ్యత వహించాలి’’ అని మరో ఈజీ ఛైర్ పొలిటీషియన్ వ్యాఖ్యానించారు. ‘‘ఒకసారి రియోకు వెళ్లాక బాధ్యతను వారికి అప్పగించవలసి ఉంటుంది. అక్కడి చావు బతుకులతో మన ప్రమేయం లేదు’’, అని మరొకరి వ్యా ఖ్యానం. ‘‘అసలు తప్పంతా కోచ్‌దే. ఆ అ మ్మాయికి నీళ్లు మెడిసిన్స్ ఉన్నాయో లేదో చూసుకోవలసిన బాధ్యత కోచ్‌కి లేదా?’’ అని మరొకరు..‘‘అదికాదండీ అంతగా దాహానికి గురైతే పక్కదేశపు పార్లర్‌లోకి వెళ్లి గుక్కెడు నీళ్లు తాగితే తప్పేముంది,’’ అని మరో పెద్దమనిషి టీకా టిప్పణి. విషయం సీరియస్‌గా మారుతున్నదనే సంగతి తెలిసే సరికి భారత క్రీడామండలికి వేడిపుట్టింది. ఆగస్టు 23 ఉదయం అధికారికంగా ఒక ప్రకటన విడుద ల చేశారు. ‘‘ఈ అమ్మాయి తనకు తానే మే ము కల్పించే జలవసిత గ్లూకోజ్ సౌకర్యాన్ని తిరస్కరించింది’’ అని..ఒకవేళ ఆమెకు ఏమై నా అయితే హత్యానేరం తమమీదకు రాకూడదని ఇలాంటి పచ్చి అబద్దపు ప్రకటనను అధికారికంగా భారత క్రీడామండలి విడుదల చేసింది.
అమెను వెంటనే ఒక ఇంగ్లీషు టివీ ఛానల్‌లో ప్రశ్నించారు..‘ఇది నిజమేనా?’ అని. ‘నే నెందుకు చనిపోవాలని కోరుకుంటా? నిజంగా నాకు ప్రాణహాని జరిగితే నా తల్లిదండ్రులు నా భర్త తప్ప మరెవరూ కంటతడి పెట్టేందుకు కూడా సిద్ధంగా లేరు’ అని జైషా గద్గద కంఠస్వరంతో చెప్పింది. ఈ సన్నివేశం చూసిన తర్వాత మనకు ఏం అనిపిస్తుంది? ఇలాంటి నరరూప రాక్షసులు జీవిస్తున్న సమాజంలో మనం ఉన్నామా? అని అనిపించడం లేదా? ఎవరికివారు తమ స్వీయ చర్మసంరక్షణ కోసం పాకులాడటం గమనార్హం.
అథ్లెట్‌కు ఇవ్వవలసిన గ్లూకోజ్ ప్యాకెట్లు అరటిపండ్లు, నీటి సీసాలు, డ్రింకులు అన్నీ కౌంటర్ నుండి తీసుకున్నదా? అని ఛానల్ వారు అడిగిన ప్రశ్నకు ఎఎఫ్‌ఐ కార్యదర్శి మనీష్ కుమార్ సమాధానమిస్తూ ‘‘తీసుకున్నారు. వాటిని జైషా తానే తీసుకుపోయి దారివెంట ఉండే టేబుల్స్‌పై పెట్టుకోవాలి.’’ ఇంత బాధ్యతారహితమైన జవాబు ప్రపంచంలోని ఏ దేశపు క్రీడా సమాఖ్య కార్యదర్శి ఇవ్వడు. వీడియోలల్లో అన్ని దేశాల కౌంటర్ల వద్ద ఆ యా దేశస్థుల ఆహార పదార్థాల ప్యాకెట్లలో సి ద్ధంగా ఉండి తమ క్రీడాకారులను ఉత్సాహపరుస్తున్న సన్నివేశాలు కనిపించాయి. ఒక్క ఇం డియా కౌంటర్ల వద్దనే నరపురుగు కనిపించలేదు. వెళ్లిన వారంతా ఎక్కడ ఉన్నట్లు? రియో హోటళ్లలో రిలాక్స్ అవుతున్నారా? ఇంగ్లీషు టి.వి ఛానల్‌లో ఒ.పి. జైషాతో జరిపిన ఇంటర్వ్యూను చూస్తున్న ఒకాయన ఉద్రేకాన్ని తట్టుకోలేక ఇలా అన్నాడు,‘‘క్రీడా సమాఖ్య సభ్యులకు కాళ్లకు చెప్పులు లేకుండా నలభె రెండు డిగ్రీల సెల్షియస్‌లో నలభై రెండు కిలోమీటర్లూ నడిపించాలి. అదే వారికి తగిన శిక్ష.’’
పునర్జన్మ ఎత్తిన జైషా తన గోడును మీడియాముందు చెప్పుకొని ఏడ్చింది. అదే రోజు న ఎఎఫ్‌ఐ కార్యాలయం నుంచి ‘జైషా అబద్ధాలు చెబుతున్నది’ అని ఒక పత్రికా ప్రకటనను మనీష్ కుమార్ విడుదల చేశారు. జైషా చెప్పిన అబద్ధం ఏమిటి? తనకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకుండా మరణ దశకు చేర్చారని చెప్పడం అసత్యమా? దీన్ని నూటముప్పయి కోట్ల భారత ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ మనీష్ కుమార్, వల్సన్ (ఎఎఫ్‌ఐ అధ్య క్షుడు)లు చేసిన అమానవీయ నిర్వాకాలు మొ త్తం ప్రపంచం గమనించింది. ఇంత జరిగిన తర్వాత కూడా మేరా భారత్ మహాన్ అని ఆత్మవంచన చేసుకోగలమా?
లోగడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి అని సర్ది చెప్పుకోవచ్చు కాని, మోదీగారి ప్రభుత్వం ప్రారంభమైన రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఐనా ఈ దుర్మార్గాలేమిటి? భారత క్రీ డా సమాఖ్య కేవలం జైషాకు మాత్రమే కాదు, మొత్తం భారతదేశానికి క్షమాపణ చెప్పి తమకు తాము రాజీనామా చేయాలి. అలా జరగకపోతే విజయ్‌గోయల్‌గారు ఆ సమాఖ్యను రద్దు చేసి అందరి సభ్యులపై సిబిఐ విచారణ జరిపించాలి. అర్జున, ఏకలవ్య వంటి పురస్కారాల ప్రదర్శనల సందర్భంగా లోగడ కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినా అంతగా పట్టించుకోలేదు. గెలిచిన సింధు, సాక్షిమాలిక్‌ను గౌరవించుకుందాం. మారథాన్‌లో పాల్గొన్న జైషాను సముచితం గా గౌరవించుకుందాం.
‘‘్భరత ఎఎఫ్‌ఐ అధ్యక్షుడి బాడీ లాం గ్వేజ్ టేపులలో గమనించారా? జైషా మారథాన్‌లో మృత్యుస్థితిలో పడి వుంటే ఈయన న వ్వుతున్నాడెందుకు? ఇదంతా సురేశ్ కల్మాడీ గారి ఘన వారసత్వం. లోగడ భారతదేశంలో కామన్‌వెల్త్ క్రీడోత్సవాలు జరిగినప్పుడు ఆ భాధ్యతను సురేశ్ కల్మాడీకి, సోనియాగాంధీ అప్పగించింది. క్రీడల నిమిత్తం జరిగిన నిర్మాణాల విషయంలో వేలకోట్ల కుంభకోణం చో టుచేసుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. నిజానికి కల్మాడీ నోరు చాలా చిన్నది. అన్నివేల కోట్లు అతనొక్కడే తినడం అసాధ్యం అని విజ్ఞులు వాదించారు. మొత్తానికి కల్మాడీ తీహార్ జైలుబాట పట్టాడు. అసలు భోక్తల చేతికి మట్టంటుకోలేదు. కాకపోతే భారత క్రీడా స్ఫూర్తి అంతర్జాతీయరంగంలో అప్రతిష్ఠపాలైంది. కొందరు క్రికెటర్లు డబ్బుకు కక్కుర్తిపడి ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు? ఇది క్షంతవ్యమేనా? గత అరవై సంవత్సరాలుగా భారత్‌కు తనదైన నిర్దిష్టమైన క్రీడా ప్రణాళిక ఉన్నదా? ఒక పిటి ఉషో, ఒక సిం ధూనో మెరిసినంత మాత్రం చేత తృప్తిపడకూడదు. స్వర్ణాలలో అమెరికాకు ప్రథమ స్థా నం, ఇండియాకు అరవై ఆరవ స్థానం ఏమి టి? ఏం సాధించామని ఈ సంబరాలు?
ఇదిలావుండగా ఎఎప్‌ఐ రంగంలోకి కవిత అనే అమ్మాయిని ప్రచారానికి దింపింది. ‘‘నాకు పుష్కలంగా నీళ్లు అందాయి’’ అని సా క్ష్యం చెప్పింది. మరి జైషా మాటేమిటి? అని అడిగితే ఆ అమ్మాయి నాకేంతెలుసు? అంటున్నది. ఇదీ మన క్రీడా స్ఫూర్తి. మన నిర్లక్ష్యానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జైషా ఉదంతం అసలు మన క్రీడా సమాఖ్యలోని బాధ్యతా రాహిత్యాన్ని బయటపెట్టింది. ఇది ఏ ఒక్క క్రీ డాకారుడు/క్రీడాకారిణి సమస్య కాదు, మొత్తం దేశంలోని క్రీడాకారులు, క్రీడాభిమానుల సమ స్య. మన క్రీడాసమాఖ్యకు ప్రక్షాళన సమ యం ఆసన్నమైంది.

- ముదిగొండ శివప్రసాద్