మెయిన్ ఫీచర్

పట్టుదలే పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువుకోవాలన్న తపన..
కష్టాలకోర్చి కృషి చేసే మనస్తత్వం..
లక్ష్యం చేరుకోవాలన్న పట్టుదల.. ఉంటే చాలు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు.. అందుకు పేదరికం ఎంతమాత్రం అడ్డుకాదని నిరూపించింది డాక్టర్ అపర్ణ. వివరాల్లోకి వెళితే..
నేనొక పేదకుటుంబంలో జన్మించాను. వైద్య విద్య చదవడం నా స్థోమతకు మించిందే అయినప్పటికీ దాన్ని సాధించాలన్న పట్టుదలే నన్ను వైద్య విద్యలో సులువుగా రాణించేలా ప్రేరేపించింది22 అంటోంది డాక్టర్ అపర్ణ..
ప్రస్తుత రోజుల్లో తమ పిల్లల్ని డాక్టర్‌లు, ఇంజనీర్‌లుగా చూడాలన్న ధ్యేయంతో ధనవంతులు, మధ్యతరగతి కుటుంబీకులు లక్షలు వెచ్చిస్తూ ఐఐటీ ఫౌండేషన్‌ల పేరుతో బోధన చేస్తున్న కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చి పిల్లల వయసుకు సరిపడా బోధింపజేయాల్సిన విద్యకన్నా ఒత్తిడితో కూడుకున్న విద్యాబోధన చేయిస్తున్నారు. కేవలం చదువు తప్ప వేరే ప్రపంచం తెలియకుండా చాలామంది వారి పిల్లల్ని పెంచుతున్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చాలామంది విద్యార్థులు వారి ప్రతిభను చాటుతూ అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో అపర్ణ కూడా ఒక వ్యక్తి.
అనంతపురం జిల్లా నల్లమాడలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది అపర్ణ. తల్లి అంగన్‌వాడీ కార్యకర్త, తండ్రి ఓ ఉపాధి కూలీ. అపర్ణ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా వుండటంతో ఎంత కష్టమైనా తమ బిడ్డ చదువుకు వెనుకాడలేదు ఆ తల్లిదండ్రులు. కొంచె భారం అనిపిస్తే తమ స్థాయి చాలా తక్కువ, ఇలాంటి పరిస్థితిలో పిల్లల్ని చదివించడం ఎందుకబ్బా అని యుక్త వయసు రాగానే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేసి చేతులు దులుపుకునే తల్లిదండ్రులెందరో వున్నారు. అయితే అపర్ణ తల్లిదండ్రులు అలా ఆలోచించకుండా వారి తాహతుకు మించిన భారమైనా పిల్లల చదువుకోసమే వారు తపించారు. వారి శ్రమకు అనంతపురం జిల్లాలో పేదల కల్పతరువుగా వున్న ఆర్డీటి (రూరల్ డెవ్‌లప్‌మెంట్) సంస్థ ఇచ్చిన చేయూత, ప్రోత్సాహం మరువలేనిదని డాక్టర్ అపర్ణ తెలిపింది.
అపర్ణ చదువు నల్లమాడలోని బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి వరకు కొనసాగింది. 2009-10వ సంవత్సరంలో పదో తరగతిలో అపర్ణ 559మార్కులతో ఉత్తీర్ణతను సాధించింది. పై చదువులు చదివే ప్రతిభ ఉన్న విద్యార్థినీ విద్యార్థులను ఇంటర్, ఆపై చదువులు చదివించడానికి ఆర్డీటి సంస్థ వారు ఆర్డీటి సెట్ అనే ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన అపర్ణను ఇంటర్మీడియట్ విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వున్న శ్రీచైతన్య కళాశాలలో చదవడానికి ఆర్డీటి అవకాశం కల్పించింది. అందుకోసం అయ్యే ఖర్చులన్నీ ఆర్డీటి సంస్థే భరించింది. ఇంటర్‌లో 949మార్కులు సాధించిన అపర్ణ ఎంసెట్ కోచింగ్ కూడా ఆర్డీటి సహకారంతోనే తీసుకుంది. ఇంటర్‌తో పాటు ఎంసెట్ కోచింగ్‌కి కూడా ఆర్డీటీ ద్వారానే అవకాశం వచ్చింది. ఎంసెట్‌లో 4639ర్యాంకును సాధించిన అపర్ణ మొదటి ప్రయత్నంలోనే వైద్య విద్యకు అర్హత సాధించింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఆమెకు సీటు లభించింది. ఇలా విద్యలో రాణించేవారి ప్రతిభను గుర్తించి పైచదువులకయ్యే మొత్తం ఖర్చును భరిస్తున్న ఆర్డీటి సంస్థ అపర్ణకు కూడా వైద్య విద్య పూర్తి అయ్యేందుకు అయ్యే ఆర్థిక వనరులను, పుస్తకాలు, మెస్ బిల్లులు అన్నీ సమకూర్చి ఒక పేదింటి ఆణిముత్యం డాక్టర్ అయ్యేందుకుప్రధాన భూమిక పోషించింది. 2108 ఏప్రిల్‌లో మెడిసిన్ పూర్తి చేసుకుని నల్లమాడ గ్రామంలో మొట్టమొదటి వైద్యురాలిగా కాలుమోపింది పేదింటి బిడ్డ డాక్టర్ అపర్ణ..

నా కలను నెరవ్చేంది ఆ సంస్థే..
34ఆర్డీటి సంస్థ నావెంట లేకుంటే డాక్టర్‌ని అవ్వడం కలగా మిగిలేది.. నా తండ్రి రామచంద్ర ఒక పేపర్‌బాయ్. ఇంటింటికీ పేపర్ వేయడం అయిపోగానే ఉపాధి హామీ పనులకెళ్తారు. నా తల్లి రమణమ్మ, అంగన్‌వాడీ వర్కర్. నాకిద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వారు తొమిదోతరగతి చదువుతున్న అనూష, ఏడోతరగతి చదువుతున్న అమృత, ఐదోతరగతి చదువుతున్న నా తమ్ముడు గిరినంద్. నేను ఇంటికి పెద్దకూతుర్ని. మాకు ఊర్లో ఓ చిన్న ఇల్లు వుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న ఇంట్లో నేను, నా చెల్లెళ్ళు, తమ్ముడిని పెద్ద చదువులు చదివించడమంటే తలకు మించిన భారమేనని చెప్పొచ్చు. అయినా కూడా బాగా శ్రమిస్తూ పైసా పైసా కూడబెడుతూ మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తూ వారిస్తున్న ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. అదేవిధంగా మేము దేవుడిలా భావించే వినె్సంట్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డీటి సంస్థ సహకారం లేకపోతే నేను డాక్టర్‌ని అయ్యుండేదాన్ని కాదు. నేను మెడిసిన్‌కి అర్హత సాధించగానే కళాశాలలో అందరితో సమానంగా వుండాలని మా గ్రామంలోని కొందరు పెద్దలు కూడా కొన్ని వస్తువులు సమకూర్చి నాకు వెన్నుదన్నుగా నిలిచారు. వైద్య విద్యను అభ్యసించేవారిలో ధనవంతుల పిల్లలే అత్యధిక శాతం వుంటారు. వారందరితో సమానంగా వుంటూ వైద్య విద్యను పూర్తి చేయడానికి నా తండ్రి పడిన శ్రమ మరువలేనిది. ఇప్పుడు జనరల్ సర్జన్‌గా లేదా పీడియాట్రిక్ (చిన్నపిల్లల వైద్యం)లో పీజీ చేయాలనే కోరిక వుంది. ఇన్నాళ్ళూ నా చదువుకోసం అహర్నిశలూ శ్రమించిన నా తల్లిదండ్రులకు నా పీజీ విద్య కోసం మళ్ళీ కష్టపెట్టాలా అనే బాధ కూడా వుంది. ఎలాగైనా పీజీ పూర్తీ చేయడానికి ఫ్రీ సీట్ తెచ్చుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నా.. కోచింగ్‌కు వెళ్ళాలంటే లక్షలతో కూడుకున్న పని. పీడియాట్రిషన్‌గా చిన్నపిల్లలకు వైద్యసేవలందించాలన్న కోరిక నెరవేరేవరకు రేయింబవళ్ళు కష్టపడి చదువుతా.. నాలక్ష్యమే నాకు దారి చూపుతుందన్న నమ్మకం నాకుంది.22 అని ధీమాగా చెబుతోంది అపర్ణ.
ప్రతిభ వుండాలే కానీ చదువుకు పేదరికం అడ్డుకాదని అపర్ణలాంటి వారెందరో నిరూపిస్తున్నారు. చదువుకోవడానికి డబ్బులేదు, పేదవాళ్ళం అనేవి కేవలం సాకు మాత్రమే అనిపిస్తోంది ఇలాంటివారిని చూసినప్పుడు. సాధించాలన్న లక్ష్యం వుంటే చాలు ఆ లక్ష్యమే దారిచూపుతుందన్న నమ్మకం ముందుకు నడిపిస్తుందని నిరూపిస్తోంది అపర్ణ. నిరుపేద కుటుంబంలో పుట్టిన అపర్ణలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పేదరికం అనేదాన్ని పక్కకు నెట్టి చదువులో రాణించాలి. అదేవిధంగా వైద్య విద్యను పూర్తి చేసుకుని చిన్నపిల్లల డాక్టర్‌గా సేవ చేయాలని ఆశిస్తున్న అపర్ణ లక్ష్యం నిజం అవ్వాలని కోరుకుందాం.. ఆశీర్వదిద్దాం.. ఆల్ ది బెస్ట్ అపర్ణ..
***

వైద్య పట్టా పొందిన అపర్ణ *వైద్య సేవలు అందజేస్తున్న డాక్టర్ అపర్ణ
*వైద్య విద్యలో అర్హత సాధించగానే ఆర్డీటి వ్యవస్థాపకుడి చిత్రపటం అందజేసి అపర్ణను సత్కరించిన పెద్దలు
* డా.. అపర్ణ కుటుంబం

- నల్లమాడ బాబ్‌జాన్, 8500083799