మెయిన్ ఫీచర్

‘దాన’ కర్ణుడు -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: ద్రోణాచార్యులు మరియు పరశు రాముడు వీరిద్దరు వద్దా కర్ణుడు విలువిద్యా శిక్షణను తీసుకోవడాన్ని ఎందుకు తిరస్కరించారు?
విలువిద్యలో శిక్షణకోసం చేసిన అతని అభ్యర్థనను కుటుంబ నేపథ్యం వలన ద్రోణాచార్యులు తిరస్కరించడంతో, ద్రోణాచార్యుల గురువు పరశురాముని కలుసుకున్నాడు. ఈ మారు విద్య నేర్చుకోవడం కోసం తను క్షత్రియుడినని అబద్ధం చెప్పాడు. పరశురాముడు అతనిని ఒక విద్యార్థిగా స్వీకరించి శిక్షణ ఆరంభించాడు. ఒక రోజు కర్ణుడు క్షత్రియుడు కాదని స్పష్టం అయినప్పుడు గురుశిష్య సంబంధం అకస్మాత్తుగా ముగిసింది. ఒక రోజు, పరశురాముడు తన శిరస్సుని తన విద్యార్థి తొడ మీద వాల్చి కొద్ది సేవు విశ్రాంతి తీసుకోవడం ఆరంభించాడు. అప్పుడు మనిషి శరీరం గుండా చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న ఒక పురుగు, కర్ణునినుండి రక్తం పీల్చి అతనికి రక్తస్రావం మరియు నొప్పి కలుగజేసింది. అతని గురువుకి నిద్రాభంగం కలుగకుండా ఉండడం కోసం కర్ణుడు కొద్దిగా కూడా కదలలేదు. పరశురాముడు మేల్కొని రక్తపు మడుగు చూసి కర్ణుని అతని కుటుంబ నేపథ్యం గురించి అడిగి నిజం తెలుసుకుంటాడు. అబద్ధం చెప్పినందుకు తను నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించడంలో విఫలం అవుతాడని కర్ణుని శపిస్తాడు. ఆ కాలంలో యుద్ధంలో పాల్గొనటానికి క్షత్రియ సంఘానే్న ఇష్టపడ్డారని నేరుగా అనుకోవచ్చు. మహర్షి పరుశురామ లేదా ద్రోణాచార్యుల తీర్పును తప్పుగా ఎదుర్కోడానికి ముందు, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను వెలుపలికి తీసుకువచ్చి ఉపన్యసించాలి. కర్ణుడు చేసిన చర్య లేదా తీర్పు గురువు దృక్పథం నుండి చూస్తే సరైనదేనా అనేది మెట్టమెదటి ప్రశ్న? ఆ పురుగు ఒక పాము లేదా హాని చేసే ఉద్దేశ్యం ఉన్న ఒక వ్యక్తి కావచ్చు. ఆకారణంగా గురువుకి ఈ క్రింది ప్రశ్నలు అడగటం తప్పని విషయమే.
‘‘ప్రొఫెసర్ డి నికోలస్ యొక్క మాటల్లో’’, ‘‘ఏది మనల్ని’’ తొట్రుపడేలా, సందేహపడేలా చేసి మనని మార్గంలో ఆపుతుంది? ఒక క్లిష్ట పరిస్థితిని ఎదురైనప్పుడు మనల్ని ఏది నిరాశకు, నిర్లక్ష్యానికి, తప్పించుకోవడానికి దారి తీస్తుంది?’’ ఆ సంసిద్ధత గురించి నిర్ణయం తీసుకోవటం ద్రోణాచార్యుల యెక్క కర్తవ్యం. కానీ ఆ నిర్ణయ బాధ్యత గురువుపై ఉంటుంది.
ఉదాహరణకు, గురువు ఒక సంభావ్య విద్యార్థిని తనకు గుర్రపుస్వారీ తెలుసా, కత్తి ఎలా పట్టుకోవాలి లేదా కవచం ఎలా తొడుగుకోవాలి, లేదా అతని తండ్రి సైనికుడా అని అడుగుతాడు. లేదా అన్నీ బోధించిన తరువాత రాజభక్తి అంటే అతనికి విచారించాలా అనే సంశయం, ఇందులో వివిధ ప్రశ్నలకు స్పందనలు నిజాయితీగా వచ్చాయా అనే సంశయం. అంతిమ అధికారి యెక్క అధీనంలో ఉన్న గురువు, ఎవరైనా అధికారుల పట్ల విద్యార్థ్ధి విధేయతతో ఉంటాడో లేదో నిర్ణయించడం ఎంత కష్టం?
కాబోయే విద్యార్థికి పైన పేర్కొన్న నైపుణ్యాలు తెలిస్తే, అది గురువుకి పని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒక సైనికుడు ఎప్పుడైనా మరణాన్ని ఎదుర్కోవచ్చు అని అతను గ్రహిస్తాడు. అతని తల్లిదండ్రులు మరియు భార్య తమకి ప్రియమైన వారు తమ ఎంపికను లేదా వృత్తికి సంబంధించిన నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు. తండ్రి సైనికుడు అయితే అతను ఆ వృత్తి ఎంచుకోవాలని ఆశించే అవకాశంకూడా ఉంది. అలాగే, గుర్రపు స్వారీ లాంటి వాటికి ప్రావీన్యత గురించి అధికార పత్రాలు జారీ చేసే ప్రత్యేక అధికారులు లేరు.
కర్ణుడు చేసిన చర్య గురించి వస్తే, అతని చర్యలకు గురువుగారి నిద్రతో పాటు ఇతర కారణాలు ఉండవచ్చు. అవి చంపడానికి సంకోచించడం లాంటివి. కర్ణుని జీవితం చూస్తే, అతను ‘‘దాన కర్ణుని’’గా గుర్తింపు పొందాడు, దాని అర్ధం అతనిని ఎప్పుడు ఏది అడిగినా, అది ఇవ్వడానికి ఎప్పుడూ సంకోచించడు, తడబడడు. ఇది ఒక గొప్ప మానవ లక్షణం. కానీ ఈ చర్చ లేదా సంఘటనకు సంబంధించి కర్ణుడు ఇచ్చిన ఒక ‘‘దానం’’ ప్రశ్నించదగినది. కర్ణుడు సహజ కవచంతో పుట్టాడు. ‘కవచ కుండలాలు’ అతనిని నాశరహితం చేస్తాయి. అతనితో సహా అందరికీ ఈ విషయం తెలుసు. అతనిని చంపబడడానికి ముందు పాండవులు అతని నుండి వీటిని వేరు చేయాలి. వారు ఇంద్రుడిని బ్రాహ్మణునిలా మారువేషంలో వెళ్ళి యాచించమని పంపారు. అతను వాటిని ఇచ్చేసాడు. పైన చెప్పిన సంఘటన కర్ణుడిని గొప్ప యోధులలో ఒకరిగా నిలబడగల సమర్థత గురించి స్పష్టం చేసింది. కవచం కోరడంలో ఉద్దేశ్యం అతనిని బలహీనపరచి, హానిచేద్దామని. ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? వాటిని అతడు ఎందుకు ఇచ్చేసాడు? అనేది ప్రశ్న. ఇది వ్యక్తిగత గర్వమా లేదా గొప్పగా అనిపించాలనే కోరికా? లేదా ప్రత్యేకమైన నైతిక బాధ్యతా? ఏ కారణాల కోసం ఎవరు అడిగినా ఇవ్వాలి అని స్వర్గం నుండి వచ్చిన ఉత్తర్వులు పాటిస్తున్నాడా ?
ఒకవేళ దుర్యోధనుడు కర్ణుని నుండి తన చర్యపై ఒక వివరణ లేదా సమర్థన కోసం అడిగాడను కుందాం. తను చేసిన మేలుకు బదులుగా కర్ణుడు అతనిని సంరక్షిస్తాడని, ఒక సన్నిహిత మిత్రునిగా యుద్ధం గెలవడానికి సహాయం చేస్తాడని దుర్యోధనుడి ఆశ. తనను తను రక్షించుకోలేని వ్యక్తి ఖచ్చితంగా ఇతరులను రక్షించలేడు.
క్రింది దృష్టాంతాన్ని పరిగణిద్దాం. ఒకవేళ ఒక పోలీసు అధికారిని వీధిలో ఒకరు అతని బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ అడిగాడు. ఎందుకంటే అతనికి దానిపై ఆసక్తి కలిగింది లేదా తమాషాగా వేసుకోవాలనిపించింది. ఆ అధికారి పైన చెప్పిన లాంటి కారణాలు విని ఇచ్చేస్తాడు. ఆ పోలీసు యె4క్క పై అధికారి అతన్ని ఉద్యోగంలో ఉంచుతాడా? అతనిని ఆ అధికారి కారు మరియు బ్యాడ్జి ఇచ్చే వరకు కూడా వేచి ఉండాలా? మానవతా దృక్పదంతో ఆలోచించి ఆ అధికారిని ఉద్యోంలో కొనసాగిస్తే, ఇతర అధికారులు ఈ చర్యను చూచి ఇది జీవితంలో గొప్పగా అనుభూతి లేదా పేరు పొందే అవకాశం అనుకుంటే ఈ మె4త్తం విషయం ఒక జోకులా అనిపిస్తుంది. ఇది వాస్తవమని మీరు తెలుసుకోనేంత వరకు. న్యాయస్థానంలోని క్రింది దృష్టాంతాన్ని పరిశీలిద్దాం. రక్షణ న్యాయవాది ఒక నిందుతుని కేసును అంగీకరించాడని అనుకుందాం. నిందుతుడు నేరానికి సంబంధించి పూర్తి వివరా లను లేదా అతను లేక ఆమె తమ ప్రమేయం గురించిన సత్యాన్ని పంచుకోకపోవచ్చు. విచారణ సాగుతుండటంతో, సాక్షుల రుజువులతో, నిందితునిపై కేసు బలంగా మారుతుంది. ప్రారం భంలో రక్షణ న్యాయవాది అతను బహుశా నిరపరాధి అనే అభిప్రాయంలో ఉంటాడు, కానీ విచారణ సమయంలో వాస్తవాలు ఆ నమ్మకాన్ని మార్చాయి. అతను లేదా ఆమె నిందితుని వైపు వాదిద్దామా వద్దా అనే ఒక నైతికపరమైన ఇరకాటంలో పడతారు, చివరకు న్యాయం నిలవాలనే కోరికతో పూర్తిగా ఉద్యోగం వదిలి వేద్దామని నిర్ణయిస్తాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు మరియొక దృష్టాంతారాన్ని పరిశీలిద్దాం ఆర్థిక స్తోమత లేని నిందుతునికి, తననుతాను రక్షించుకొనే అవకాశం ఇవ్వటానికి కోర్టు న్యాయవాదిని నియమిస్తుంది. స్వాభి ప్రాయములతో సంబంధం లేకుండా రక్షణమే ఆ న్యాయవాది బాధ్యత. అతని కర్తవ్యం ఏమిటి? మీ కోరిక, బాధ్యత మధ్య నిర్ణయించుకోవడం అంత సులభం కాదు.
అందువల్ల అతను చూసిన దానిని బట్టి పరశురాముని యొక్క నమ్మకం సరైనది. దాని అర్థం కర్ణుడు గొప్ప మానవుడు కాదనేది కాదు. దానిని ఎవరూ ప్రశ్నించలేరు లేదా అతని కీర్తి తీసివేయలేదు. సర్వసైన్యాద్యక్షుడు భీష్ముడు, బలంలో మూడవ స్థాయి ‘అర్ధరధుడు’ విభాగంలో కర్ణుడిని ఉంచారు. భీష్ముడు తీసుకున్న ఆ వృత్తిపరమైన తీర్పు కర్ణుని ఘనత లేదా నేపథ్యం ఆధారంగా కాదు.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562