మెయిన్ ఫీచర్

శాంతిలేని లక్ష్యం వ్యర్థం-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న. కోరికలు, మోక్షము మరియు శాంతి గురించి వేదాలు ఏం చెప్తున్నాయి?
కేవలం పది పదాలు ఉపయోగించి నాలుగు మంత్రాలు మరియు నాలుగు పురుషార్థాలలో దైవత్వం యొక్క సారాంశాన్ని వేదాలు తెలియజేస్తున్నాయి. ఈ పదాలు ఒక పుటలోని (పేజీలోని) ఒక వరుసలో ఇమిడిపోతాయి. శాంతి మరియు సుఖం కొఱకు సమర్థవంతమైన మార్గాన్ని సంక్షిప్తంగా వ్యక్తం చేస్తుంది కనుక సంస్కృత భాష ‘‘దేవభాష’’ గా పిలవబడింది. ఇతర మతాలలో కనిపించే ప్రతి ఒక్క భావం గందరగోళం, అజ్ఞానం లేదా అహంకారంతో కూడియున్నది. కొందరి విషయంలో ఇది వంచన అవుతుంది ఎందుకంటే వారి వాగ్దానాలు లేక మాటలు తర్కరహితమని వారికి చాలా బాగా తెలుసు. వారి మాటలు సరి అవ్వాలంటే వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న మతపరమైన యుద్ధాలు, మతాలలో ఉండే అంతర్గత పోరాటాలు మరియు అంత: కలహాలు, ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశాంతి మరియు ప్రాదమిక మానవ నైజం వీటన్నిటిని పట్టించుకోకుండా తలపులోనికి రానివ్వకుండా వారి మాటలను వినాలి లేక నమ్మాలి. బ్రిటిష్ న్యాయాధీశుడు మరియు సాహితీవేత్త సర్ విలియమ్ జోన్స్ వాడిన మాటల్లో చెప్పాలంటే సంస్కృత భాష అద్భుతమైన నిర్మాణం కలిగినదని. నాలుగు దేవోభవ మంత్రాలలో మరియు పురుషార్థాలలో మాత, పిత, ఆచార్య, అతిధి, దేవ, భవ, ధర్మ, అర్థ, కామ మరియు మోక్ష అనే పది పదాలు ఉపయోగించబడ్డాయి. ఈ నాలుగు మంత్రాలు నాలుగు దివ్య సంఘటనలను బహిర్గతము చేస్తాయి. ఏ సంఘటైనా సంభవించినప్పుడు వారి దీవెనలు అందించడానికి దేవతలు ఆ ఘటనాస్థలానికి దిగి వస్తారు ఎందుకంటే దైవత్వం కోరుతూ యజ్ఞం చేసేవారిని గమనించడం మరియు రక్షించడం వారి కర్తవ్యం.
తల్లులు తమ పిల్లలకు కేవలం ప్రేమ మాత్రమే కాకుండా యితరులను నమ్మే ధైర్యం, తండ్రులు తమ పిల్లలకు కేవలం కుటుంబాన్ని పోషించడమే కాకుండా ఏ ఫలితాన్ని ఆశించకుండా సమాజసేవ చేసే అవకాశం కోసం ఏవిధంగా చూసి పాల్గొనవలెనో ప్రదర్శించినప్పుడు, ఆచార్యులు జీవనోపాధి ఏర్పరచుకొనే సమర్థతనే కాకుండా మానవాళిని పరిరక్షించేందుకై నైపుణ్యత మరియు ప్రేరణ కూడా బోధించినప్పుడు, మరియు అతిథులు ఆహారం మరియు ఆశ్రయం తీసుకోవడాకికే కాకుండా తమని ఆహ్వానించిన అభ్యాగతి తమ ఆతిథ్యాన్ని స్వీకరించటమే మహాభాగ్యంగా భావించినప్పుడు.
కృష్ణ్భగవానుడు ధర్మం ఏ ఫలితం ఆశించని సేవ అని, మిగితావన్నీ భౌతిక లేక వాణిజ్య ప్రవృత్తి కలిగినవని సూచిస్తూ నిర్వచనం చెప్పాడు. నిజాయితీగా సంపాదించిన ధనము మరియు అటువంటి సంపాదన యిచ్చే ఆనందాలు చివరికి దివ్యత్వానికి దారి చూపి చర్యలుగా సమర్థిస్తారు. కామం అణగద్రొక్కనప్పుడు అవధులు దాటినప్పుడు అది విషపూరితమవుతుంది. కామానికి వెనువెంటనే మోక్షం లేక విముక్తిని దానికి విరుగుడుగా వేదాలు సూచించడం అనేది సంస్కృతాన్ని దేవభాష అని పిలువబడడాన్ని సమర్ధిస్తున్నది. అక్కడే హిందుత్వం మరియు హిందూ గ్రంథాల యె4క్క శ్రేష్టత, సౌందర్యం మరియు గొప్పతనం యిమిడి యున్నవి. ఇంకేది శాంతికి దారి తీయదని అని స్పష్టం చేస్తున్నాయి.
కామం, మోక్షం మరియు శాంతి అన్న మూడు పదాలను పరిధిలోనికి తీసుకొని పరిశీలించి నప్పుడు ఇతర మతాలలో ఉన్న గందరగోళాన్ని అర్ధం చేసుకొనవచ్చు. ఎప్పుడైతే సమూహం యొక్క కోరిక లేక కామం తర్కరహితముగా లేక సమర్ధించలేనిదిగా ఉంటుందో, ఏదైతే నిజమైన శాంతిని ఎప్పుడూ ఇవ్వలేదో, అటువంటి లక్ష్యం సాధించడానికి అప్పుడు వారికి మిగిలిన మార్గము వంచన గాని లేక హింస తప్ప వేరేవి లేవు. వారున్న అసమంజసము, చంచలము, నిరాధారము అయిన అస్పష్టమైన పరిస్థితి గురించి వారు అర్ధం చేసుకోలేకపోవడం అత్యంత దురదృష్టకరం. రోటరీ క్లబ్బులు, లయన్స్ క్లబ్బులు మరియు అటువంటి మరి ఎన్నో మానవజాతి సేవకై అంకితమైన సంస్థలు ఉన్నాయని గమనించడం ముఖ్యం. కానీ అవి మతాలు అవుతాయా?
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562