మెయిన్ ఫీచర్

అందుకే.. ఆర్మీ నుంచి వచ్చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాటన్నది ఎవరో కాదు.. ఉత్తర కొరియా మాజీ సైనికురాలు లీ.. ఇప్పుడు లీ సో యేఆన్ వయస్సు 41 సంవత్సరాలు. ఉత్తర కొరియాలో పుట్టి పెరిగింది. ఆమె కుటుంబంలోని చాలామంది పురుషులు కూడా సైన్యంలో పనిచేసినవారే.. 1990 దశాబ్దంలో ఉత్తర కొరియాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకు కనీసం ఒక్కపూటైనా భోజనం దొరుకుతుందనే ఆశతో లీ సైన్యంలో చేరింది. అప్పట్లో ఎంతోమంది మహిళలు ఆకలి కష్టాల నుంచి తప్పించుకునేందుకు ఇలాగే చేశారు. ఉత్తర కొరియా సైన్యంలో మహిళలపై అత్యాచారాలు, సరైన ఆహారం లేక చాలామంది స్ర్తిలలో నెలసరి రాకపోవడం వంటివి సాధారణమని చెబుతోన్న ఉత్తరకొరియా మాజీ సైనికురాలు లీ సో యేఆన్ పడిన కష్టాలు ఆమె మాటల్లోనే..
‘‘ఉత్తర కొరియాలో కరవు వచ్చిన తర్వాత మహిళల పరిస్థితి మరింత దిగజారింది. ఆడవాళ్లంతా కూలి పని చేయడం మొదలుపెట్టారు. దాంతో వారి పట్ల అసభ్య ప్రవర్తన, శారీరక, లైంగిక వేధింపులు మరింత పెరిగిపోయాయి. ఉత్తర కొరియా పురుషాధిక్య సమాజంగానే ఉండేది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది’ అని ‘నార్త్ కొరియా హిడెన్ రివల్యూషన్’ రచయిత్రి జియోన్ బేక్ తెలిపారు. ఇది ముమ్మాటికీ నిజం. నేను ఉత్తర కొరియా సైన్యంలో చేరినప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు. అప్పట్లో సైన్యంలో చేరినందుకు చాలా సంతోషంగా అనిపించింది. మొదటిసారి నాకోసం కేటాయించిన హెయిర్ డ్రైయర్ చూసి నా ఆనందం రెట్టింపైంది. అయితే అప్పుడు సరిపడా విద్యుత్ లేకపోవడంతో వాటిని తక్కువగా వినియోగించేవాళ్లం. నాకు కేటాయించిన గదిలో పనె్నండు మంది ఇతర మహిళలు ఉండేవారు. అక్కడే పడుకునేదాన్ని. ప్రతీ మహిళకు ఓ చిన్న చెక్క డబ్బా ఇచ్చేవారు. అందులోనే బట్టలు పెట్టుకునేవాళ్లం. ఆ డబ్బా పైభాగంలో రెండు ఫొటోలు ఉండేవి. అందులో ఓ ఫొటో ఉత్తర కొరియా వ్యవస్థాపకులు కిమ్ నిని సంగ్‌ది. రెండోది ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్‌ది. అక్కడ పనిచేస్తున్నప్పుడు వరిపొట్టుతో తయారుచేసిన బెడ్‌పై పడుకునేదాన్ని. చెమట బాగా పట్టినప్పుడు ఆ పడకపై కారడంతో దాన్నుంచి దుర్వాసన వచ్చేది. స్నానం చేసేందుకు కూడా సరైన సదుపాయం ఉండేది కాదు. ఒక మహిళ ఎదుర్కొనే అతి పెద్ద సమస్యల్లో ఒకటి.. స్నానం చేసేందుకు సరైన సదుపాయం లేకపోవడం. వేడి నీటి సదుపాయం అసలు ఉండేది కాదు. పర్వతాల నుంచి ప్రవహించే నీటికి ఓ పైపును అనుసంధానించి, ఆ పైపు ద్వారా వచ్చే నీటితోనే స్నానం చేసుకోమనేవారు. కొన్నిసార్లు ఆ నీటిలో కప్పలు, పాములు కూడా వచ్చేవి.
అక్కడ మహిళలకు, పురుషులకు ఒకేలా పని ఉండేది. మహిళలకు శారీరక వ్యాయామం కాస్త తక్కువగా ఉండేది. కానీ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, వంట చేయడం వంటి పనులన్నీ మాతోనే చేయించేవారు. ఇప్పటికీ మహిళలకు కేవలం వంట బాధ్యతలే ఉన్నాయి. ఒకవైపు కఠిన శిక్షణ, మరోవైపు సరైన ఆహారం దొరక్కపోవడంతో నాతోపాటు ఇతర మహిళల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడింది. ఒత్తిడి వాతావరణం, సరైన పోషాకాహారం లేకపోవడంతో మాకు ఆరునెలల నుండి ఏడాది వరకూ నెలసరి ఆగిపోయేది. నెలసరి రాకపోవడంతో మేము ఆనందంగా ఉన్నామని, నెలసరి వస్తే ఆ పరిస్థితిని ఇంకా తట్టుకోలేమని ఇతర మహిళలు నాతో అనేవారు. ఇప్పటికీ అక్కడ మహిళలు శానిటరీ ప్యాడ్స్‌కి బదులు కాటన్ వస్త్రాన్ని వాడతారు. పురుషులు ఎక్కడ చూస్తారోనన్న భయంతో రాత్రిపూట ఆ వస్త్రాన్ని శుభ్రం చేసుకుంటారు. ఇటీవల అక్కడ శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇప్పటికీ దూరప్రాంతాల్లో విధులు నిర్వహించే మహిళా సైనికుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదు. మేం కొన్నిసార్లు పురుషుల ముందే టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇక ఆర్మీలో లైంగిక వేధింపులు మామూలే.. నన్ను ఎప్పుడూ వేధింపులకు గురిచేయలేదు కానీ.. ఇతర మహిళా సైనికులపై అత్యాచారాలు జరిగేవి. కంపెనీ కమాండర్లు మా గదుల్లో ఉంటూ మహిళా కమాండర్లను పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడేవారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. కానీ నేడు మాత్రం ఉత్తర కొరియా ఆర్మీ.. లైంగిక వేధింపులను ఉపేక్షించబోమని, అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. అత్యాచార ఆరోపణలు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని కూడా తెలిపింది. కానీ చాలా సందర్భాల్లో సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వారు తప్పించుకుంటున్నారు. వీటన్నింటినీ భరించలేక నేను సైన్యం నుంచి బయటకు వచ్చేద్దామనుకున్నాను. అప్పుడు దక్షిణ కొరియా సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సిగ్నలింగ్ యూనిట్‌లో రక్షక దళాధికారిగా ఉండేదాన్ని. 2008లో దక్షిణ కొరియా వెళ్లిపోవాలని ప్రయత్నించాను. మొదటి ప్రయత్నంలో చైనా వద్ద మోహరించి ఉన్న ఆర్మీ నన్ను పట్టుకుని ఏడాది పాటు జైలు శిక్ష వేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండో ప్రయత్నం చేశాను. ఈసారి నదిలోకి దూకి అక్కడి నుంచి ఈదుకూంటూ చైనా ఒడ్డుకు చేరుకున్నాను. అక్కడ ఓ దళారీ సాయంతో నేను దక్షిణ కొరియా గడ్డపైకి చేరుకున్నాను’ అంటూ తను పడిన బాధల గురించి వివరించింది లీ. దేశాన్ని వదిలి పది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ లీకి ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయట. లీ సో స్వచ్ఛందంగానే ఆర్మీలో చేరింది. కానీ 2015 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ సైన్యంలో చేరటాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వం తప్పనిసరి చేసింది.