ఎడిట్ పేజీ

తిరోగమనంలో ప్రజాస్వామ్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా 13వ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ పేరుతో ప్రచురించిన వార్షిక నివేదిక తెలుపుతోంది. ప్రపంచ వ్యా ప్తంగా రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్రాలు తిరోగమనంలో ఉండడం పట్ల ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు మెరుగవుతున్న దేశాల సంఖ్య కన్నా, తిరోగమనంలో పడుతున్న దేశాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
20వ శతాబ్దం చివరిలో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం పరిస్థితులు అంతరించడంతో ప్రపంచంలో వరుసగా ప్రజాస్వామ్య గాలులు వీచడం ప్రారంభమైనది. అప్పటి వరకూ నిరంకుశ పాలనలో ఉన్న పలు దేశాలలో ప్రజాస్వామ్యం వికసించడం ప్రారంభమైనది. ముఖ్యంగా 1988 నుండి 2005 వరకు ఈ పక్రియ ప్రోత్సాహకరంగా ఉంటూ వచ్చింది. కానీ అప్పటి నుండి పరిష్టితులు తిరోగమనంలో పడటం ప్రారంభమవుతున్నది. ఈ లోగా పెరుగుతున్న ప్రపంచీకరణ విధానాల ఫలితంగా దీర్ఘకాలంగా ప్రజాస్వామ్యం దేశాలుగా పేరొందుతున్న దేశాలలోనే రాజకీయ వ్యవస్థలపై విశ్వాస సంక్షోభం నెలకొనడం ప్రారంభమైంది. మొత్తం మీద గత 13 ఏళ్ళల్లో నికరంగా 116 దేశాలలో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉంటూ వచ్చింది. అయితే 63 దేశాలలో ప్రజాస్వామ్యం మెరుగవుతూ వస్తున్నది. ముఖ్యంగా 66 దేశాలలో రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్రాలు 2018లో తగ్గుముఖం పట్టిన్నట్లు ఫ్రీడమ్ హౌస్ నమోదు చేసింది. కేవలం 50 దేశాలలో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయి. మరో వంక పత్రికా స్వాతంత్య్రం కూడా ఆందోళనకరంగా మారుతూ వస్తున్నది.
ఆందోళన కలిగిస్తున్న అమెరికా...
ప్రపంచంలో అమెరికా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కోరుకొనే వారందరికీ స్ఫూర్తి కేంద్రంగా ఉంటూ వచ్చింది. బలమైన ప్రజాస్వామ్యానికి, రాజకీయ హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛలకు ఆ దేశం కేంద్రంగా ఉండటమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వికాసానికి కొండంత అండగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ దేశం రాజ్యాంగ వ్యవస్థ సుస్థిరతకు ప్రశ్నార్థ్ధకరంగా మారుతున్నది. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్రాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన తర్వాత పరిస్థితులు క్రమంగా ఆందోళన కరంగా మారుతున్నాయి. గత ఎనిమిది ఏళలుగా అమెరికాలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దిగజారుతూ వస్తున్నట్లు ఫ్రీడమ్ హౌస్ పేర్కొన్నది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ హయాంలో జరుగుతున్న చట్టబద్ధ పాలనలోనే వాస్తవాలు తెలియజేసే జర్నలిజంపై జరు గుతున్న దాడులలో ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలు మరింతగా దిగజారడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇటువంటి పరిస్థితులే ప్రపంచంలో పలుచోట్ల నిరంకుశ పాలనకు దారితీసిన చరిత్ర దృష్ట్యా అమెరికాలో ప్రజాస్వామ్య సంస్థలపై జరుగుతున్న దాడులను అంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదని ఫ్రీడమ్ హౌస్ హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడానికి స్వదేశంలో జరిగిన ప్రయత్నాలు, కార్యనిర్వాహక -చట్టసభల పనితీరు మందగించడం, కీలక పదవులలో ఉన్నవారి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, పారదర్శకత లోపించడం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, చట్టబద్ధ పాలనలపై పెరుగుతున్న వత్తిడులు ఈ సందర్భంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు ఫ్రీడమ్ హౌస్ పేర్కొన్నది.
మహిళల హక్కులు, వలస విధానం, పాఠశాలలో సామూహికంగా కాల్పులు వంటి అంశాలపై పౌరుల నిరసనలు, ప్రదర్శనలు పెరుగుతున్నా, అంతకు ముం దున్నట్లు హింస చెలరేగిపోవడం అమెరికాలో రాజకీయ హక్కుల వాతావరణాన్ని వెల్లడి చేస్తున్నది. అయితే చట్టం ముందు అందరినీ సమానంగా చూడటం మాత్రం జరిగక పోవడం గమనార్హం. ఆశ్రయం కోరినవారి చట్టబద్ధ హక్కులపై ఆంక్షలు విధించడం, శరణార్థులు తిరిగి స్థిరపడే విషయంలో వివక్ష చూపడం, దూకుడుగా వలస విధానాల అమలు చేసే ప్రయత్నాలు అకారణంగా పిల్లలను కుటుంబాలకు దూరం చేసే పరిస్థితులు కలగడం వంటి పరిణామాలు అమెరికాలో దిగజారుతున్న పరిస్థితులను వెల్లడి చేస్తున్నాయి.
ఫ్రీడమ్ హౌస్ సర్వే ప్రకారం ప్రజాస్వామ్యం విష యంలో అమెరికా- ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలకన్నా వెనుకబడి ఉన్నది. ఈ విషయంలో అమెరికాకు సామీప్యంలో బ్రెజిల్, క్రోటియా, గ్రీస్, లాటి వా, మంగోలియా వంటి దేశాలు ఉండటం గమనార్హం. ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలలో సైతం క్రియాశీల పౌర ఉద్యమాల కారణంగా ప్రజాస్వామ్యం వత్తిడులను ఎదుర్కొంటు ఉండగా, మలేషియా, అర్మేనియా, ఎథోపియా, అంగోలా, ఈక్వడార్ వంటి దేశాలలో ప్రజాస్వామ్యం సానుకూల మార్పులతో మెరుగవుతూ ఉండటం ఆనందం కలిగిస్తుంది.
చైనా, భారత్‌ల ప్రభావం...
అంతర్జాతీయంగా అధికారం మారుతూ ఉండడం కూడా దీర్ఘకాలం ప్రజాస్వామ్యం వికసించిన పలు దేశాలు సంక్షోభకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సుదీ ర్ఘకాలం అంతర్జాతీయ అధికార కేంద్రంగా మన గలుగుతూ వస్తున్న అత్యున్నత పారిశ్రామిక దేశాలు క్రమంగా తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయి. ప్రథానంగా పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్న చైనా, భారత్ వంటి దేశాల ప్రభావం పెరుగుతూ అంతర్జాతీయంగా నిర్ణయాత్మక పాత్ర వహించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా సాధిస్తున్న గణనీయ అభివృద్ధి ప్రజాస్వామ్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్నది. 1990 నుండి 2017 వరకు ఆ దేశపు జీడీపీ 16 రేట్లు పెరిగింది. ఈ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు వెలుగులోకి రాని అపారమైన సంపదలను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది. ప్రయోజనాల పంపిణీ అసమానంగా ఉంటూ ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆధిపత్యం సన్నగిల్లడం ప్రారంభమ వుతున్నది.
ఈ సంపద వృద్ధి కారణంగా దీర్ఘకాలికంగా పారి శ్రామికంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలలో తక్కువ, ఒక మాదిరి నైపుణ్యం గల కార్మికులు పెద్దగా ప్రయోజనం పొందలేక పోతున్నారు. మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు విదేశీ పోటీదారులకు పోతున్నాయి. ఇటువంటి పరిణామాలు ఆర్థిక అసమానతలు, వ్యక్తిగత హోదాలు సన్నగిల్లడం పట్ల ఐరోపా, అమెరికాలలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఈ దేశాలలో నెలకొన్న రాజకీయ అధికార కేంద్రాలు మారుతూ వస్తున్నాయి. ఇటలీ నుండి స్వీడన్ వరకు పలు దేశాలలో ఉదారవాద వ్యతిరేక ధోరణులు పెరుగుతూ వలసలను అరికట్టడం వంటి అంశాలలో జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ధోరణులు పెరుగుతున్నాయి. ఈ విషయమై డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశాలలో పెరుగుతున్న అసహనం, అసంతృప్తిల ఆధారంగా జాతీయవాద ధోరణులు పెచ్చుపెరుగుతూ ఎన్నికలలో ప్రభావం కూడా చూపుతున్నాయి.
చివరకు ఇటువంటి ధోరణులు మైనారిటీలకు రక్షణ కల్పించే వ్యవస్థలపై దాడులకు కూడా దారితీస్తున్నాయి. ఇటువంటి ఉద్యమాలు ఒక వంక ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తూ ఉండగా, వలసల పట్ల కఠినంగా వ్యవహరించడంతో మానవహక్కులు తీవ్ర విఘాతం కూడా కలిగిస్తున్నది. ఆచరణలో పలు ప్రజాస్వామ్య దేశాలు నిరంకుశ పాలకులకు అండగా ఉండటం కూడా చాలాకాలంగా జరుగుతూ వస్తున్నది. ఈ సందర్భంగా భావ ప్రకటన స్వాతంత్య్రం కూడా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొనవలసి వస్తున్నది. చైనా ఇంటర్నెట్ సెన్సార్షిప్, దానిపై పర్యవేక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచంలో నూతన తరహా నిరంకుశ ధోరణులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇటువంటి ధోరణులు ప్రజాస్వామ్య దేశాలను కూడా తాకుతున్నాయి. అనేక విపరిమాణాలు, విపరీత ధోరణుల నడుమ నేడు ప్రజాస్వామ్యం ఒక విధంగా పరీక్షాకాలాన్ని ఎదుర్కొంటున్నది.

-చలసాని నరేంద్ర