మెయిన్ ఫీచర్

రక్షించేది ధర్మమే -17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధం మరియు శాంతి నియమాలు బుగ్వేదం22 నిర్దేశించింది మరియు వాటిని అతిక్రమిస్తే యోధుడు నరకానికి వెళ్తాడని చెప్పబడింది.
యుద్ధ నియమాలు:
బాణం కొనికి విషం పూయరాదు
జబ్బుతో ఉన్న వారిపై లేక ముసలివారిపై దాడి చేయకూడదు
శిశువుపై లేక స్ర్తీ పై దాడి చేయకూడదు
వెనుక నుంచి దాడి చేయకూడదు
ప్రపంచాన్ని ఇటువంటి ఉపద్రవాలనుంచి తప్పించే నియమాలను పాటించే యితర మతాలు ఉన్నాయా?
శాంతి
కలసి రా, కలసి మాట్లాడు
మన మనస్సులను సామరస్యంతో ఉంచుదాం
మన ప్రార్థన ఒకేలా ఉండాలి
మన ముగింపు ఒకేలా ఉండాలి
మన ప్రయోజనం ఒకేలా ఉండాలి
మన చర్చలు ఒకేలా ఉండాలి
మన కోరికలు ఒకేలా ఉండాలి
మన హృదయాలు ఐక్యంగా ఉండాలి
మన ఉద్దేశాలు ఐక్యంగా ఉండాలి
మన మధ్య పరిపూర్ణమైన ఐక్యత ఉండాలి

వేదాశీస్సులు
సాధారణంగా అన్ని హిందూ ప్రార్థనలు ఇలా ముగుస్తాయి
(శాంతి:, శాంతి:, శాంతి:)
సర్వేజనా సుఖినోభవంతు !
(అందరికీ సుఖసంతోషాలు కలగాలి)
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినో భవస్తు !
(లోకంలోని అందరికీ సుఖసంతోషాలు కలగాలని దీవించేందుకు గోవులు, బ్రాహ్మణులు నిత్యంశుభం కలుగాలి. )
పైన పేర్కొన్న వేద మంత్రం లేదా ఆశీస్సు, మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దానిలో వేదాంతం యొక్క ఉద్దేశం మరియు సారాంశం ఉంటుంది. అనేక కారణాల వల్ల దాని అర్ధం యొక్క వివరాలలోకి వెళ్ళడం ముఖ్యం. ప్రపంచ సంక్షేమానికై ఈ మాటలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. రెండవది అపార్ధం చేసుకునే అవకాశం కూడా ఉంది కొంత.
‘్ధర్మిక లేదా దైవ సంబంధ’ కార్యకలాపాలు చేయడానికి మరియు వాటి నిర్వహణకై మార్గదర్శకత్వం చేసి పాల్గొన్న వారిని దీవించే వేదాలను అధ్యయనం చేసే బ్రాహ్మణుడు మరియు ఐశ్వర్యం ప్రసాదించే గోవు ఎల్లప్పుడూ అనందంగా ఉండాలి. అందువల్ల ప్రపంచం మొత్తం, సంతోషంగా జీవిస్తుంది. ఎవరికైనా జీవితం సఫలీకృతం కావడం కోసం ‘ఇహం మరియు పరం’ రెండూ కావాలి అని దీని అంతరార్ధం. ఐశ్వర్యవంతులు ఏది ఆశిస్తే అది పొందగలరు అని ఎవరైనా అనుకోవటం సహజం. అది ధనం మాత్రమే కాదు, ఏదైనా అవవచ్చు. కానీ అది జరుగుతున్నదంటే,దానికి కారణం ఇతరులు దృవీకరించిన ధార్మిక సూత్రాలకు బద్ధులై ఉండటంవేరే మాటల్లో:
ధర్మో రక్షతి రక్షిత:
దీని అర్ధం గుర్తించడం ముఖ్యం. ధర్మమార్గంలో నడిచే వారిని, నడవని వారిని కూడా కాపాడేది ధర్మమే
ఎప్పుడైతే ఒక గోవు గురించి పేర్కొనబడిందో అది ఒక సామాన్య, సాధారణ వ్యక్తి గురించి. వేదాలకు, గోసేవకు దూరంగా ఉండేవారు బహుశా వైదిక సత్యం మరియు సుఖం నుండి దూరమవుతున్నారు.
మంత్రాలలో చెప్పినట్లు వేదాశ్సీస్సుల సార్వజనీయతను ఏ రకంగానూ ఇతర విశ్వాసాలతో పోల్చలేనవి అంటే అతీతమైనవి.
ప్రశ్నలు:
ప్రశ్న. యుద్ధ సమయాలలో సిద్దాంతాలకు కట్టుబడి ఉండుట సాధ్యమేనా?
భారతీయ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అతని పాదాల వద్ద శరణు వేడిన శత్రువును పృథ్వీరాజ్
చౌహాన్ అనే రాజు ఎన్నో సార్లు అతన్ని చంపకుండా వదిలిపెట్టాడు. అందుకనే భారతదేశాన్ని ‘‘అసాధారణ భారతదేశం’’గా పేర్కొంటారు.
-ఇంకావుంది

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562